For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  In the name of God Review : ఆసక్తి రేకెత్తించిన బోల్డ్ ఎటెంప్ట్ ఎలా ఉందంటే ?

  |

  RATING: 2/5

  స్టార్ క్యాస్ట్ : ప్రియదర్శి, నందిని రాయ్, పోసాని కృష్ణ మురళి,

  దర్శకుడు: విద్యాసాగర్ ముత్తుకుమార్

  ఒకప్పుడు వెబ్ సిరీస్ అంటే ఎక్కువగా బాలీవుడ్ కంటెంట్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎదురు చూసేవారు.. అయితే తెలుగులో మొట్టమొదటి ఓటీటీగా లాంచ్ అయిన ఆహా కోసం ఔత్సాహిక దర్శకులు అనేక వెబ్ సిరీస్ లను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆహా కోసం ఇన్ ది నేమ్ అఫ్ గాడ్ అనే పేరుతో ఒక వెబ్ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్ ట్రైలర్ టీజర్ ను చూస్తేనే బోల్డ్ గా ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. దీంతో ఈ వెబ్ సిరీస్ మీద అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరి అందరి అంచనాలను ఈ సిరీస్ అందుకుందా ? లేదా ? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  కథ విషయానికి వస్తే

  కథ విషయానికి వస్తే


  ఈ సిరీస్ కథ మొత్తం రాజమండ్రి బ్యాక్ డ్రాప్ లో రూపొందించారు. కథ విషయానికి వస్తే బి గ్రేడ్ సినిమాలు రూపొందించే అయ్యప్ప (పోసాని కృష్ణ మురళి) అలా ఒక బి గ్రేడ్ సినిమాలో నటించడానికి వచ్చిన మీనా (నందిని రాయ్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. మరోపక్క హవాలా పనులు చేసే ఫకీర్ అత్యవసరంగా కొంత డబ్బు దాచమని అయ్యప్పకు పంపిస్తాడు. అయితే అయ్యప్ప -మీనా మధ్య వయసులో అంతరం ఉండడంతో మీనా ఇంటి దగ్గర లోనే ఉండే థామస్ అనే యువకుడితో ప్రేమలో పడుతుంది. మరోపక్క ఆది( ప్రియదర్శి) కార్ డ్రైవర్ గా పని చేస్తూ ఎప్పటికైనా ఒక రిసార్ట్ పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా థామస్ మీనా కలిసి ఉన్న సమయంలో వాళ్లను చూసిన అయ్యప్ప ఇద్దరిని చంపబోతాడు. అనూహ్యంగా మీనా ఎదురుతిరిగి అయ్యప్పని చంపేసి ఆ హత్య విషయంలో ఆదిని ఇరికిస్తుంది. అయితే అయ్యప్ప తెచ్చిన ఐదు కోట్లు ఏమయ్యాయి ? అది ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు ? మీనా ఏమైంది ? చివరికి ఐదు కోట్లు ఏమయ్యాయి ? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే .

  సిరీస్ లో ట్విస్టుల విషయానికి వస్తే

  సిరీస్ లో ట్విస్టుల విషయానికి వస్తే

  తెలుగులో ఇది ఒక బోల్డ్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. సిరీస్ మొదలైనప్పటి నుంచి అనేక విషయాల్లో సస్పెన్స్ క్యారీ చేస్తూ తీసుకువెళ్లారు. అయితే పాత్రల పరిచయానికి చాలా సమయం పట్టింది అని చెప్పొచ్చు. 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ అనేక ట్విస్టులతో రూపొందించడానికి దర్శకుడు ప్రయత్నించడాని చెప్పచ్చు. ప్రతి ఎపిసోడ్ లో ఏదో ఒక ఆసక్తికరమైన అంశం ఉండేలా దర్శకుడు జాగ్రత్త పడ్డారు. సిరీస్ ప్రారంభమైంది మొదలు పూర్తయ్యే వరకు ప్రేక్షకులలో కాస్త ఆసక్తి రేకెత్తించడంలో సఫలమయ్యారు అని చెప్పవచ్చు.

  దర్శకుడి పనితనం ఎలా ఉందంటే

  దర్శకుడి పనితనం ఎలా ఉందంటే


  ఇది దర్శకుడి మొదటి ప్రయత్నమే అయినా ఎక్కడా మొదటిసారి దర్శకత్వం వహించాడు అన్న అనిపించకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డారు. అసలు కధ ఏంటి అనే విషయాన్ని మొదటి 2 ఎపిసోడ్స్ లో ప్రేక్షకులకు అర్థం అయ్యేలా చెప్పారు. అయితే వెబ్ సిరీస్ కి మెయిన్ మైనస్ పాయింట్ ఈ సిరీస్ లో వాడే బూతులు అని చెప్పవచ్చు. ఎలాగూ డిజిటల్ కి సెన్సార్ లేదు కదా అని ఇష్టం వచ్చిన విధంగా ప్రతి రెండు మాటల్లో ఒక మాటను బూతులతో ముంచేశారు.

  అవసరం ఉన్నచోట లేని చోట కూడా బూతులు నింపేసి అనడం కంటే బూతులను ఇరికించారు అనే భావన తీసుకువచ్చారు. ఖచ్చితంగా ఇది ఇంట్లో కుటుంబంతో కలిసి కూర్చుని చూడగలిగే సిరీస్ అయితే కాదు. అంతేకాక కొన్ని పాత్రలను ఎందుకు సృష్టించారో ? ఎందుకు చొప్పించారో ? అర్థం కాదు. కథ మొత్తం తిరిగేది 5 కోట్ల రూపాయల డబ్బు కోసం కానీ ఆ డబ్బు ఏమైంది అనేది దర్శకుడికి ఒక్కడికి తప్ప ఇంకా ఎవరికీ తెలియదు.. బహుశా దీనికి సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారు ఏమో. కానీ ఐదు కోట్ల రూపాయల డబ్బు చుట్టూ కథ తిరుగుతుంది. కానీ ఆ విషయంలో ప్రేక్షకులను సస్పెన్స్ కు గురి చేయలేకపోయారు.

  టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే

  టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే

  ముఖ్యంగా ఈ సిరీస్ లో కెమెరా పనితనం ఆకట్టుకుందని చెప్పొచ్చు. వరుణ్ కి కెమెరా మీద ఉన్న పట్టు సిరీస్ లోని చాలా సీన్స్ లో ప్రతిబింబించింది. కొన్ని డార్క్ సీన్స్, అలాగే డ్రోన్ షార్ట్స్ కూడా సినిమాకి రిచ్నెస్ తీసుకు వచ్చాయి అని చెప్పవచ్చు. అయితే ఇలాంటి క్రైమ్ లేదా థ్రిల్లర్ అని భావిస్తున్న సిరీస్ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉపిరి లాంటిది. ఈ సిరీస్ ని మరో లెవల్ కి తీసుకు వెళ్ళ గలిగే చోట కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరిగ్గా లేకపోవడంతో సిరీస్ కొంచెం పేలవంగా అనిపిస్తూ ఉంటుంది. వెబ్ సిరీస్ అని చెప్పడంతో ఖచ్చితంగా కొన్ని ఎపిసోడ్స్ ఇవ్వాలనే భావనతో అవసరం లేని సీన్స్ కూడా కొన్ని చేసినట్లు అనిపించింది.

  నటీనటుల విషయానికి వస్తే

  నటీనటుల విషయానికి వస్తే


  సిరీస్ లో నటించిన అందరు నటీనటులు తమ తమ పాత్రలకు ప్రాణం పోశారు. మరీ ముఖ్యంగా ఆది పాత్రలో నటించిన ప్రియదర్శి నటించమంటే జీవించాడు. జీవితంలో స్థిరపడాలని బలమైన కోరిక ఉన్న యువకుడిగా కనిపిస్తూనే మరోపక్క డబ్బు కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే పాత్రలో నటించాడు. ఒకరకంగా ఈ సిరీస్ లో ప్రియదర్శి కాకుండా వేరే నటుడు చేసి ఉంటే అంత సఫలీకృతం అయి ఉండకపోవచ్చు. ఇక ఎప్పటిలాగే పోసాని కృష్ణమురళి తన పాత్రలో మెప్పించాడు. నందిని రాయ్ సైతం లీడ్ నటిగా నటించి అందరినీ మెప్పించింది. ఇక అలాగే మహమ్మద్ అలీ బేగ్, వికాస్, కంచరపాలెం ఉమామహేశ్వరరావు ఇలా చెప్పుకుంటూపోతే ప్రతి ఒక్కరూ తమ పాత్రలలో ఇమిడిపోయి నటించారు.

  Jathi Ratnalu ఫస్ట్ డే కలెక్షన్స్ , బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు!!
  ఫైనల్ గా చెప్పాలంటే

  ఫైనల్ గా చెప్పాలంటే


  తెలుగులో ఒక బోల్డ్ వెబ్ సిరీస్ వస్తోంది అని అందరూ ఎన్నో అంచనాలు పెట్టుకోగా ఈ వెబ్ సిరీస్ ఆ అంచనాలను అందుకో లేక పోయింది. దర్శకుడు అనుకున్న పాయింట్ మంచిదే అయినా దానిని సరైన రీతిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో విఫలమయ్యాడు అనే చెప్పాలి. నటుడు ప్రియదర్శి, నందిని రాయ్ ఇద్దరూ ఒక రకంగా సిరీస్ మొత్తాన్ని తమ చేతుల మీద నడిపినట్లు అనిపించింది. ఇక బూతులు కూడా తోడవడంతో సిరీస్ కాస్త వెగటు పుట్టిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన సిరీస్ ఇది. అయితే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పిల్లలతో ఉన్న సమయంలో ఈ సిరీస్ చూడకపోవడం మంచిది.

  English summary
  In the name of God is a web series that released in AHA OTT. this series created a lot of buzz in social media with teaser and trailer. and here is the review for In the name of God series.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X