భారతీయుడు 2 లో హైలైట్స్ ఏంటి? పాజిటివ్, నెగిటివ్స్ ఇవే.. శంకర్ హిట్ కొట్టాడా?
భారతదేశ సినిమా దగ్గర పాన్ ఇండియా సినిమాలు ఊపందుకున్న తరుణంలో అన్ని భాషలు నుంచి కూడా పలు భారీ పాన్ ఇండియా సినిమాలు వస్తుండగా ఈ 2024 లో మాత్రం ప్రథమార్ధం ముగిసేవరకు చాలా తక్కువే పాన్ ఇండియా సినిమాలు వచ్చాయని చెప్పాలి. కాగా జూన్ ఎండింగ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఎడి వచ్చింది.
కాగా ఈ సినిమా తర్వాత అయితే ఈ సినిమాలో కూడా ఉన్న నటుడు ఉలగనయగన్ కమల్ హాసన్ నటించిన మరో పాన్ ఇండియా సినిమా "భారతీయుడు 2" వచ్చింది. కాగా ఈ చిత్రాన్ని సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తెరకెక్కించారు. మరి దీనితో అయినా శంకర్ మంచి హిట్ ఇవ్వాలని, విక్రమ్ తో భారీ కం బ్యాక్ ఇచ్చిన కమల్ హాసన్ కూడా మరో హిట్ అందుకోవాలని తన అభిమానులు కోరుకున్నారు.

మరి ఈ సినిమా ఆల్రెడీ యూఎస్ ప్రీమియర్స్ తో మొదలు కాగా సినిమా ఏంటి ఎలా ఉంది హైలైట్స్, పాజిటివ్స్ నెగిటివ్స్ కూడా వచ్చేసాయి. కాగా హైలైట్స్ లో పాజిటివ్ పాయింట్స్ చూస్తే సినిమాలో శంకర్ మార్క్ భారీతనం మాత్రం పుష్కలంగా ఉందట. అలాగే పాటలు కూడా గ్రాండ్ విజువల్స్ తో అదరగొట్టాయట. ఇంకా సెకండాఫ్ లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు కూడా మంచి హైలైట్స్ గా నిలిచాయని తెలుస్తుంది.
అంతే కాకుండా సేనాపతిగా కమల్ హాసన్ పై ఇంకా సిద్ధార్థ్ పై కొన్ని సీన్స్ ఎమోషనల్ గా బాగున్నాయట. ఇంకా క్లైమాక్స్ లో ట్విస్ట్ కూడా బాగుంది అని తెలుస్తుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే మరోసారి శంకర్ దెబ్బేసినట్టుగా అంటున్నారు. అసలు ఫస్టాఫ్ లో సినిమా ఏమి లేదట. చాలా పేలవంగా ఒక అవుట్ డేటెడ్ సీన్స్ లైన్ లో సినిమా కనిపిస్తుంది అని సినిమా చూసిన వారు అంటున్నారు.

అలాగే ఇంకో పెద్ద నెగిటివ్ అనిరుద్ అని కూడా టాక్. తన సాంగ్స్ పక్కన పెడితే అసలు తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి చాలా మైనస్ అయ్యింది అని అంటున్నారు. ఇది మాత్రం షాకింగ్ అనే చెప్పాలి. ఇక కమల్ పై ప్రోస్తటిక్ మేకప్ కూడా చాలా ఆర్టిఫీషియల్ గా ఉందట. అలాగే కొన్ని సీన్స్ లో విజువల్ ఎఫెక్ట్స్ కూడా కొంచెం అవి గ్రాఫిక్స్ అన్నట్టుగా క్లియర్ గా తెలిసిపోతున్నాయట.
వీటితో సినిమాలో సెకండాఫ్ కొంచెం ఓకే కానీ ఫస్టాఫ్ మాత్రం బాగా దెబ్బేసింది అని ఇప్పుడు ఈ సినిమా విషయంలో టాక్ బయటికి వచ్చింది. మరి ఈ అంశాలతో అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి పెర్ఫామెన్స్ ని కనబరుస్తుంది అనేది ఆసక్తిగా మారింది. కాగా ఈ భారీ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహ, ప్రియా భవాని శంకర్ దివంగత నటుడు వివేక్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











