Bharateeyudu 2 Review: భారతీయుడు 2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rating: 2.75/5
నటీనటులు: కమల్ హాసన్, ఎస్.జె.సూర్య, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, నెడుముడి వేణు, వివేక్, కాళిదాస్ జయరాం, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని, బాబీ సింహ, బ్రహ్మానందం, జాకీర్ హుస్సేన్, పియుష్ మిశ్రా, గురు సోమసుందరం, డిల్లీ గణేష్, జయప్రకాష్, మనోబాల, అశ్వినీ తంగరాజ్ తదితరులు
కథ, దర్శకత్వం: ఎస్.శంకర్
నిర్మాత: సుభాస్కరన్
స్క్రీన్ ప్లే: ఎస్.శంకర్, బి.జయమోహన్, కబిలన్ వైరముత్తు, లక్ష్మీ శరవణ కుమార్
మ్యూజిక్ : అనిరుద్ రవిచంద్రన్
ఎడిటింగ్: ఎ.శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: రవివర్మన్
ఆర్ట్: ముత్తురాజ్
స్టంట్స్: అనల్ అరసు, అన్బరివు, రంజాన్ బులట్, పీటర్ హెయిన్స్, స్టంట్ సిల్వ
డైలాగ్ రైటర్: హనుమాన్ చౌదరి,
విఎఫ్‌ఎక్స్ సూపర్ వైజర్: వి.శ్రీనివాస్ మోహన్
కొరియోగ్రఫీ: బాస్కో సీజర్, బాబా భాస్కర్,
పాటలు: శ్రీమణి,
సౌండ్ డిజైనర్: కునాల్ రాజన్,
మేకప్ : లెగసీ ఎఫెక్ట్-వాన్స్ హర్ట్‌వెల్- పట్టణం రషీద్,
కాస్టూమ్ డిజైన్: రాకీ-గవిన్ మ్యూగైల్- అమృతా రామ్-ఎస్‌బి సతీషన్-పల్లవి సింగ్-వి సాయి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుందర్ రాజ్,
హెడ్ ఆఫ్ లైకా ప్రొడక్షన్స్: జికెఎం తమిళ్ కుమరన్, రెడ్ జైంట్ మూవీస్: సెన్‌బగ మూర్తి
రిలీజ్ డేట్: 2024-07-12
సమాజంలో జరిగే అన్యాయాలు, అవినీతి, లంచ గొండి వ్యవహారాలను వీడియోలుగా తీసి అధికారులను, వ్యాపారులను పట్టించేందుకు నడుము కట్టిన చిత్రం అరవిందన్ (సిద్దార్థ్) తన టీమ్ సభ్యులు (ప్రియా భవానీ శంకర్, తదితరులు). వారు ఎవరికి అన్యాయం జరిగినా ఆ విషయాన్ని ప్రపంచానికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టిస్తారు. ఆ క్రమంలో ఈ నలుగురు టీమ్ కష్టాల్లో పడుతుంది. పోలీసులు, ఇతర అధికారులు తిరగబడుతారు. ఈ క్రమంలో భారతీయుడు సేనాపతి (కమల్ హాసన్) వస్తే బాగుండని కోరుకొంటాడు. భారతీయుడు మళ్లీ రావాలి అంటూ హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ చేస్తాడు. ఆ క్రమంలో తైపేలో ఉన్న సేనాపతి ఇండియాకు వస్తాడు. అక్రమార్కులను భరతం పడుతూ ఉంటాడు. సేనాపతిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ అధికారులు వెంటాడుతుంటారు.

ఇండియాకు వచ్చిన భారతీయుడు అలియాస్ సేనాపతి ఎవరెవరినీ చంపాడు? ఎందుకు చంపుతు వారిని శిక్షించాడు? సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు (సిద్దు, ప్రియా)కు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి? సోషల్ మీడియా టీమ్‌కు రకుల్ ఫ్రెండ్ ఎందుకు సహాయం చేస్తుంది. సిద్దూ టీమ్‌కు రకుల్‌కు సంబంధం ఏమిటి? తల్లి చనిపోయినా సిద్దూ ఎందుకు తలకొరివి పెట్టలేకపోతాడు? చివరికి సోషల్ మీడియా ఇన్ల్పూయెన్సర్లను భారతీయుడు కలిశాడా? కలిస్తే ఎలాంటి పరిస్థితుల్లో కలిశాడు? భారతీయుడిని అరెస్ట్ చేయడానికి సీబీఐ అధికారి (బాబీ సింహా) సక్సెస్ అయ్యాడా? చివరకు భారతీయుడు తీసుకొన్న నిర్ణయం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే భారతీయుడు 2 లేదా ఇండియన్ 2 సినిమా కథ.
భారతీయుడు సినిమా చూసిన వారు ఇప్పటికీ అలాంటి అనుభూతిని, ఆ మ్యాజిక్‌ను మరిచిపోలేరు. అలాంటి గొప్పగా మైమరిపించిన ఆ సినిమాపై ఉన్న అంచనాలతో భారతీయుడు 2 సినిమాకు వస్తే.. కొంత నిరాశ పడే అవకాశం ఉంది. మొదటి భాగంలో కొన్ని సంఘటనలను ఎమోషనల్‌గా కనెక్ట్ చేయలేకపోయాడనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఆ ఎపిసోడ్స్ సెకండాఫ్‌కు ప్రాణంగా నిలవడం కొంత థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఫస్టాఫ్‌ను శంకర్ గ్రిప్పింగ్, ఎమోషనల్‌గా కనెక్ట్ చేయకపోవడంతో ఏదో సినిమా నడుస్తుందనే ఫీలింగ్ మాత్రమే కలిగించాడు. ఫస్టాఫ్‌లో విజయ్ మాల్యా, గాలి జనార్థన్ రెడ్డి లాంటి కొందరి ప్రముఖుల జీవితాలను టచ్ చేయడం సినిమాకు కనెక్ట్ చేసేలా ఉంటుంది.

ఇక సెకండాఫ్‌లో పవర్ ప్యాక్ట్ ఉండాలనే ప్లాన్‌తో రకరకాల ట్విస్టులు జొప్పించడంతో కథ కొంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇక సిద్దార్థ్, రకుల్ లాంటి పాత్రలకు సంబంధించిన ట్విస్టులు ఆలోచింప చేస్తాయి. అయితే క్లైమాక్స్‌లో ఛేజింగ్గ సీన్ నిడివి అవసరమైన దానికంటే ఎక్కువే ఉందనిపిస్తుంది. కొంత విసుగును కూడా తెప్పించింది. చివర్లో భారతీయుడు 3 గురించి ఇచ్చిన ట్విస్టు మరింత ఆసక్తిని రేపిందనే చెప్పాలి.
సిద్దార్థ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహ పాత్రలు ఫర్వాలేదనిపిస్తాయి. కానీ ఎమోషనల్‌గా ఆ క్యారెక్టర్ల ట్రావెల్ కాలేవు. ఇక సెకండాఫ్‌లో సిద్దార్థ్, ఆయన తల్లి మధ్య ఎపిసోడ్ ఉద్వేగానికి గురి చేస్తుంది. కమల్ హాసన్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. కానీ ఓవర్‌గా మేకప్ వేయడం వల్ల భారతీయుడి క్యారెక్టర్‌కు కనెక్ట్ అయ్యే ఛాన్స్‌ను దెబ్బ తీసినట్టు ఉంటుంది. కమల్ హసన్‌ను నేరుగా చూడలేకపోవడం, ఎక్కువ సేపు మేకప్‌లో చూపించడం కొంత నిరాశనే కలిగించింది.

ఇక ఓవరాల్‌గా భారతీయుడు 2 సినిమా విషయానికి వస్తే.. ఫస్టాఫ్ సాదాసీదాగా, ఎలాంటి ట్విస్టులు, ఉత్తేజం, ఉద్వేగం కనిపించే సన్నివేశాలు లేకపోవడం వల్ల రెగ్యులర్, రొటీన్ సినిమా అనిపిస్తుంది. సెకండాఫ్‌ను కొంత మేరకు గ్రిప్పింగ్‌గా చెప్పడం వల్ల ఫస్టాఫ్‌లో ఉన్న అసంతృప్తి తగ్గడానికి దోహదపడిందనిపిస్తుంది. ఇక భారతీయుడు మూవీలో ఉండే మ్యాజిక్ ఈ సినిమాలో ఆశిస్తే నిరాశపడొచ్చు. రకుల్ ప్రీత్ రోల్ ఏ మాత్రం ఆకట్టుకోదు. సిద్దార్థ్ ఎమోషనల్ సీన్లలో రాణించాడు. సముద్రఖని సెకండాఫ్‌లో తన మార్కు చూపించాడు. కమల్ ఫెర్ఫార్మెన్స్ కోసం, శంకర్ టెక్నికల్ బ్రిల్లియన్స్ కోసం థియేటర్‌లో ఓసారి చూడొచ్చు.


Click it and Unblock the Notifications











