Indiana Jones Review 80 ఏళ్ల వయసులో అదరగొట్టే స్టైల్‌.. హారిసన్ ఫోర్ట్ ఫెర్పార్మెన్స్ ఎలా ఉందంటే?

Rating: 3/5

నటీనటులు: హ్యారీసన్ ఫోర్డ్, ఫోబే వాలర్ బ్రిడ్జ్, మాడ్స్ కిక్కెల్సన్, ఆంటోనియో బండేరాస్, బాడీ హల్బ్రూక్, థామస్ క్రెచ్ మ్యాన్, కరెన్ అలెన్, మార్క్ కిలీన్ తదితరులు
దర్వకత్వం: జేమ్స్ మ్యాన్ గోల్డ్
నిర్మాతలు: కత్లీన్ కెన్నెడీ, ఫ్రాంక్ మార్షల్, సైమన్ ఇమ్మాన్యుయేల్
సినిమాటోగ్రఫి: ఫెడాన్ పాపమీచెల్
ఎడిటింగ్: మైఖేల్ మెక్ కస్టర్
మ్యూజిక్: జాన్ విలియమ్స్
బ్యానర్: వాల్ట్ డిస్నీ పిక్చర్స్, మోషనల్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2023-06-30

పురావస్తు పరిశోధకుడైన జోన్స్ (హ్యారీసన్ ఫోర్డ్) పురాతన వస్తువులు, శిలాజాల కోసం తన స్నేహితుడు షాతో కలిసి వెతుకుతుంటాడు. జర్మనీలో నాజీ సామ్రాజ్యం కుప్పకూలిన పరిస్థితులను అధ్యయనం చేసేందుకు పరిశోధన మొదలుపెడుతారు. ఆ క్రమంలో డయల్ ఆఫ్ డెస్టీనీ అనే యాంటీకెతేరా లభిస్తుంది. దాంతో టైమ్ ట్రావెల్ చేయాలని ప్లాన్ చేస్తారు. జర్మనీలో నాజీ ప్రభుత్వం కుప్పకూలిన పరిస్థితుల్లో ఆ దేశ పరిపాలనను తన చేతిలోకి తీసుకోవవాలని ఆశతో సైటింస్ట్ జుర్గెన్ వోల్లెర్ (మ్యాడ్ మిక్కెల్‌సన్) ప్లాన్ వేస్తాడు. అయితే ఈ ముగ్గురి ప్లాన్స్ వర్కవుట్ అయ్యాయా? ట్రైమ్ ట్రావెల్‌లో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేది ఇండియానా జోన్స్: ది డయల్ ఆఫ్ డెస్టినీ సినిమా కథ.

ఇండియానా జోన్స్: ది డయల్ ఆఫ్ డెస్టినీ సినిమా కథ 1945లో ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి 1969 సంవత్సరానికి కథ జంప్ చేసి అసలు స్టోరీలోకి వెళ్లడం, అపోలో మూన్ మిషన్ ఎలిమెంట్ రావడం మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. యాంటీకెథేరా రెండు ముక్కలను ఇండీ సాయంతో బాసిల్ షా కూతురు హెలెనా భద్రపరచడం అంశాలు మరింత ఆసక్తిని కలిగిస్తాయి. దర్శకుడు జేమ్స్ మ్యాన్ గోల్డ్ రాసుకొన్న కథ, కథనాలు ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని కలిగించేలా ఉంటాయి.

 Indiana Jones

ఇండియానా జోన్స్ సినిమాల్లో ఉండే అన్ని కమర్షియల్ హంగులు డయల్ ఆఫ్ డెస్టీనీలో ఉండటమే కాకుండా ప్రేక్షకుడిని థ్రిల్‌కు గురిచేసేలా ఉంటాయి. ఛేజింగ్స్ సీన్లు, అడవుల్లో సాహసాలు, అతీ ప్రాచీన పురాతన ప్రదేశాల్లో పరిశోధనలు లాంటి అంశాలు సినిమాకు హైలెట్‌గా నిలిచాయి.

 Indiana Jones

ఇండియానా జోన్స్ సినిమా సిరీస్‌లో చివరిగా జోన్స్ పాత్రను హ్యారీసన్ ఫోర్డ్‌. ఐకానిక్ పాత్రలో హ్యారీసన్ ఫోర్డ్‌ ఒదిగిపోయాడు. తనదైనా బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. 80 ఏళ్ల వయసులో స్టైల్ అండ్ స్వాగ్‌తో మెప్పించాడు. గ్రాఫిక్స్ సహయంతో 20 నిమిషాలపాటు యంగ్ ఫోర్డ్‌గా కనిపించిన తీరు ఆయన ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్‌లా ఉంటుంది.

 Indiana Jones

ది డయల్ ఆఫ్ డెస్టినీ కథలో ఇండీ పాత్రను మలిచిన తీరు దర్శకుడు ప్రతిభకు అద్దంపడుతుంది. హెలెనా, సాలా, మారియన్ పాత్రలు కథకు మరింత బలాన్ని ఇచ్చేలా చేశాయని చెప్పవచ్చు. అండర్ వాటర్ అడ్వెంచర్స్‌లో ఆంటానియో బండేరాస్ పాత్ర అతిథి పాత్ర అయినప్పటికి.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. విలన్ పాత్రలో మెక్కెల్సేన్ పాత్ర బలమైనప్పటికీ.. కాస్త నిరాశపరిచిందనే చెప్పాలి. ఇండియానా జోన్స్ సిరీస్‌లో ది డయల్ ఆఫ్ డెస్టీనీ చివరిది కావడంతో ఎక్కువ అంచనాలతో వెళ్లిన ప్రేక్షకులకు విలన్ పాత్ర పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు.

 Indiana Jones

ఇండియానా జోన్స్ సిరీస్‌‌ను ఫాలో అయ్యే ఫ్యాన్స్‌కు ది డయల్ ఆఫ్ డెస్టీనీ మంచి అనుభూతిని కలిగిస్తుంది. హ్యారీసన్ ఫోర్డ్ యాక్టింగ్, ఫెర్ఫార్మెన్స్, లుక్, బాడీ లాంగ్వేజ్ సినిమాకు హైలెట్. కథలో మలుపులు, గ్రాఫిక్స్ వర్క్, ఇతర సాంకేతిక అంశాలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. ఎలాంటి అంచనాలతో వెళ్లినా ఇండియానా జోన్స్: ది డయల్ ఆఫ్ డెస్టినీ మంచి ఫీల్‌ను అందిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X