Intinti Ramayanam Movie OTT Review.. తెలంగాణ యాస, ఆచారాలతో ఫీల్‌గుడ్‌గా.. ఇంటింటి రామాయణం ఎలా ఉందంటే?

తెలంగాణలోని కమలాపూర్ గ్రామంలో నిజాయితీపరుడైన వ్యక్తి రాములు (వీకే నరేష్) అందర్నీ ప్రేమానురాగాలతో చూసుకొంటాడు. తన కంటూ పెద్ద కుటుంబాన్ని ఏర్పరుచుకొంటాడు. తన ప్రాణ స్నేహితుడు చనిపోతే ఆయన కొడుకు శ్రీను (రాహుల్ రామకృష్ణ)ను ఆదరించడమే కాకుండా కొడుకు కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకొంటాడు. రాములు కూతురు సంధ్య (నవ్య స్వామి), శ్రీను ఒకరినొకరు ప్రేమించుకొంటారు. శ్రీను ఉద్యోగం కోసం భారీగా డబ్బు అవసరం అవుతుంది. ఈ క్రమంలో రాములు ఇంట్లో బంగారం పోతుంది.

ఇంట్లో బంగారం పోయిన తర్వాత రాములు కుటుంబంలో ఎలాంటి సంఘనలు చోటుచేసుకొన్నాయి? సంధ్య, శ్రీను ప్రేమ వ్యవహారం తెలిసిన తర్వాత రాములు ఎలా రియాక్ట్ అయ్యాడు? సంధ్యతో లవ్ అఫైర్ కొనసాగిస్తున్నాడనే విషయం తెలిసిన తర్వాత శ్రీనును ఎలా దూషించాడు? రాములు ఆగ్రహం చెందడంతో శ్రీను ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? శ్రీను, సంధ్య ప్రేమ వ్యవహారం రాములు కుటుంబంలో ఎలాంటి విభేదాలు సృష్టించింది? బంగారాన్ని ఎవరు కొట్టేశారు? బంగారం చివరికి ఎలా దొరికింది? రాములు, శ్రీను, ఇతర కుటుంబ సభ్యులు మళ్లీ ఎలా కలిశారు అనే ప్రశ్నలకు సమాధానమే ఇంటింటి రామాయణం సినిమా కథ.

Intinti Ramayanam

రాములు అనే కుటుంబ పెద్ద పాత్ర చుట్టూ ఉండే ఫ్యామిలి మెంబర్స్ మధ్య ఉండే అన్యోన్యత, ప్రేమానురాగాలతో కథ ప్రారంభమవుతుంది. రాములు నిరాడంబర జీవితం, అమాయకత్వం పాత్ర నడిపించే సన్నివేశాలు ఆహ్లాదకరంగా సాగుతాయి. అయితే ఇంట్లో బంగారం పోవడంతో కథలో వేగం పుంజుకొంటుంది. బంగారం పోయిన తర్వాత ఒళ్లుపట్టే పాత్రలో బిత్తిరి సత్తి పండించిన మంచి కామెడీ ఆకట్టుకొనేలా ఉంటుంది.

సెకండాఫ్‌లో శ్రీను, సంధ్య ప్రేమ వ్యవహారాన్ని తన సోదరుడు, బావ బయటపెట్టిన తర్వాత రాములులో పరువు ప్రతిష్టలు గుర్తుకు వస్తాయి. దాంతో ప్రేమగా పెంచిన శ్రీనును దారుణంగా దూషించడంతో కథలో ఇంటెన్సిటీ పెరిగిపోతుంది. సెకండాఫ్‌లో పలు సన్నివేశాలు భారంగా, భావోద్వేగంగా సాగుతాయి.

Intinti Ramayanam

సీనియర్ నటుడు వీకే నరేష్ మరోసారి అద్బుతమైన పాత్రలో ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. రాములు పాత్రతో ఆద్యంతం ఎమోషన్ పండించాడు. ఇంట్లో పెదనాన్న, బావ, తండ్రి, బాబాయ్ మాదిరిగా రాములు పాత్రలో కనిపిస్తాడు. ఇక రాహుల్ రామకృష్ణ, నవ్యస్వామి తమ పాత్రలో ఒదిగిపోయారు. సినిమా ద్వితీయార్థంలో చాలా సన్నివేశాల్లో రాహుల్ తన నటనతో ఆకట్టుకొన్నాడు. నవ్వస్వామి తెలంగాణ అమ్మాయిలా చక్కగా కనిపించింది.

మిగితా పాత్రల విషయానికి వస్తే.. గంగవ్వ మరోసారి పూర్తిస్థాయిలో హాస్యాన్ని పండించారు. ఇంట్లో అమ్మమ్మలా కనెక్ట్ అవుతారు. అంజిమామ, సురభి ప్రభావతి తదితరులు తమ పాత్రల పరిధి నటించడమే కాకుండా గుర్తుండిపోయేలా ఫెర్ఫార్మ్ చేశారు. అలాగే బిత్తిరి సత్తి ఓ ప్రత్యేక పాత్రలో మెప్పించాడు.

ఇంటింటి రామాయణం మూవీ సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. దర్శకుడు సురేష్ నరెడ్ల రాసుకొన్న పాయింట్ చాలా బాగుంది. తెలంగాణ యాస, భాష, ఆచారాలు, సాంప్రదాయాలు విషయంలో తీసుకొన్న జాగ్రత్తలు, పరిశోధన సినిమాకు అందం తెచ్చిపెట్టింది. తెలంగాణ ప్రజలను ప్రతీ క్షణం ఓ కొత్త అనుభూతికి, తమ మధురానుభూతులను గుర్తు చేస్తుంది. కల్యాణి మాలిక్ మ్యూజిక్ పలు సన్నివేశాలను ఎమోషనల్‌గా మార్చింది. పీసీ మౌళి సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్ ఎస్‌బీ ఉద్దవ్ పనితీనం సినిమాను మంచి ఫీల్‌ను కలిగించింది. గోపిచంద్ ఇన్నమూరి, వెంకట్ ఉప్పుటూరి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

Intinti Ramayanam

తెలంగాణ యాస, భాష, సాంప్రదాయాలు, ఆచారాలు కళ్లకు కట్టినట్టు చూపిన చిత్రం ఇంటింటి రామాయణం. కుటుంబ విలువలు, భావోద్వేగాలు ఈ సినిమాకు బలంగా మారాయి. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. తెలంగాణ నేటివిటితో వచ్చే సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. తీరిక వేళలో మంచి అనుభూతిని పొందడానికి ఈ సినిమా చూడండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X