ఇంట్లో శ్రీమతి -వీధిలో కుమారి, సమీక్ష

By Staff

Intlo Srimathi Veedhilo Kumari
-జలపతి గూడెల్లి
చిత్రం: ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి
నటీనటులు: శ్రీకాంత్‌, ప్రభుదేవా, ఆర్తి ఛాబ్రియా, ప్రకాష్‌రాజ్‌,
ఊర్వశి, వేణుమాధవ్‌, అలీ, శిల్పాచక్రవర్తి,
చంద్రమోహన్‌, కవిత, తనికెళ్ళభరణి, తదితరులు
సంగీతం: ఘంటాడి కృష్ణ
నిర్మాతలు: అశ్వనీదత్‌, అల్లు అరవింద్‌
స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: కె.వాసు

తెలుగు ప్రేక్షకులు ' ఒట్టి వెధవాయిలు..' అని తెలుగు దర్శక, నిర్మాతల అభిప్రాయమా? ఇటీవల విడుదలైన చిత్రాలే కాదు, తాజాగా వచ్చిన 'ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి' తీరు మరీ అన్యాయం. రెండు దశాబ్దల క్రితం చంద్రమోహన్‌, జయసుధ, రావుగోపాలరావులతో 'గోపాలరావుగారి అమ్మాయి' అనే చిత్రం వచ్చింది. ఇదే సినిమాను మలయాళంలో ప్రియదర్శన్‌ చాలా ఏళ్ళ క్రితమే తీశాడు. అదే చిత్రాన్ని గత ఏడాది ప్రియదర్శన్‌ 'హంగామా' పేరిట హిందీలో తీశాడు.

ఇప్పుడు ఈ 'హంగామా'ను తెలుగులో 'ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి'గా తీశారు. చిత్రమేమిటంటే, దర్శకుడు కె.వాసు 'గోపాలరావుగారి అమ్మాయి' చిత్రానికి దర్శకుడు. అదే దర్శకుడితో ఇప్పుడు హిందీలో హిట్టయిందని తెలుగులో మళ్ళీ తీయించడం అనేది నిజంగా ప్రేక్షకులు ఒట్టి అమాయకులు అని అనుకోవడ మే.

పోనీ, అదైనా కాస్తా బాగా తీశారా అంటే, అదీనూ లేదు. సినిమా పేరుకు కామెడీ చిత్రం కానీ ఎవరికీ నవ్వు తెప్పించదు. అనవసరపు హంగామా. ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం కూడా అనవసరమే.

అతుకుల బొంతగా తీసిన, పాతకాలపు చిత్రం. ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి పాత్ర పేరు 'చెత్త సత్తయ్య'. కానీ, ఈ సినిమాకు ఆ పేరు వర్తింపచేయవచ్చు.

హీరోయిన్‌ ఆర్తి ఛాబ్రియా నటన సాధారణంగా ఉంది. ప్రకాష్‌రాజ్‌, ఊర్వశిల చుట్టే సినిమా అధికంగా తిరుగుతుంది. ప్రకాష్‌రాజుతో పోల్చితే, ఊర్శశి బాగా చేసింది. శ్రీకాంత్‌, ప్రభుదేవాలు ఇందులో డ మ్మీలు. వారి నటన కూడా అలాగే ఉంది. ఉన్నంతలో బ్రహ్మనందం నటన, వేణుమాధవ్‌ యాక్షన్‌ నవ్వు తెప్పిస్తుంది.

కొన్ని డబుల్‌మీనింగ్‌ డైలాగ్స్‌ కూడా నవ్వు తెప్పిస్తాయి కానీ, వాటిని ఆస్వాదించాలంటే కష్టమే. ఘంటాడి కృష్ణ సంగీతం మరీ మోస్తారు. పొరపాటున కూడా చూడడానికి వెళ్ళవద్దు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X