twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ippudu Kaaka Inkeppudu movie review: పెళ్లికి ముందే శృంగారంలో మునిగితే..

    |

    Rating: 2.75/5

    పెళ్లికి ముందు సెక్స్ అనే కాన్సెప్ట్‌తో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో చిత్రం అనే మూవీ ఎంత పెద్ద హిట్‌ను ఇండస్ట్రీకి ఇచ్చిందో అందరికీ గుర్తుండి ఉంటుంది. ప్రస్తుతం సమాజంలో ఇలాంటి సంస్కృతి పెరిగిపోతుందంటే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నాగరికత పేరుతో ఆధునిక ప్రపంచంలో జరుగుతున్న యువత పోకడలను విడమర్చి చెప్పాలని ప్రయత్నించిన చిత్రం ఇప్పుడు కాక ఇంకెప్పుడు. ఈ చిత్రం ఆగస్టు 6వ తేదీన థ్రియేటర్లలో రిలీజ్ అవుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రంలో యూత్‌ను, ఫ్యామిలీని మెప్పించే అంశాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ మూవీని రివ్యూ చేయాల్సిందే.

    Merise Merise movie review.. శ్వేత అవస్థి గ్లామర్.. దినేష్ తేజ్ పెర్ఫార్మెన్స్‌ హైలెట్‌గాMerise Merise movie review.. శ్వేత అవస్థి గ్లామర్.. దినేష్ తేజ్ పెర్ఫార్మెన్స్‌ హైలెట్‌గా

    Ippudu Kaaka Inkeppudu movie review: పెళ్లికి ముందే శృంగారంలో మునిగితే..Ippudu Kaaka Inkeppudu movie review: పెళ్లికి ముందే శృంగారంలో మునిగితే..

    ఇప్పుడు కాక ఇంకెప్పుడు కథ

    ఇప్పుడు కాక ఇంకెప్పుడు కథ

    పిల్లలు చెడిపోతారనే భయంతో గౌతమ్ (హస్వంత్ వంగా), అను ( నమ్రతా దరేకర్)ను తల్లిదండ్రులు స్నేహితులకు దూరంగా తీవ్రమైన ఆంక్షలతో తల్లిదండ్రలు పెంచుతారు. అయితే వైజాగ్‌లోనే పెరుగుతూ ఇలాంటి కట్టుబాట్లు, ఆంక్షల మధ్య కూడా బాల్యంలోనే యాక్సిడెంటల్‌గా గౌతమ్, అను లిప్‌లాక్ పెట్టుకొంటారు. అప్పుడే ఒకరంటే మరొకరికి ఆకర్షణ పెరుగుతుంది. చదువులు పూర్తయ్యాక హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరి ఒకరికొకరు పరిచయం అవుతారు. ఆకర్షణలో పడిన ఈ ఇద్దరు పెళ్లికి ముందే సెక్స్ సిద్ధమవుతారు. పల్లవిగా అను, రిషిగా పేర్లు మార్చుకొని అలా లైఫ్‌ను ఎంజాయ్ చేసిన తర్వాత వారి మధ్య బ్రేకప్ చోటుచేసుకొంటుంది. అయితే ఊహించని విధంగా ఇద్దరికి పెళ్లి చూపులు జరుగుతాయి.

     కథలో ట్విస్టులు ఇలా..

    కథలో ట్విస్టులు ఇలా..

    తల్లిదండ్రుల ఆంక్షల మధ్య పెరిగిన అను, గౌతమ్ మధ్య లిప్‌లాక్ ఎలా జరిగింది? హైదరాబాద్‌లో అను, గౌతమ్ ఎలా కలుసుకొన్నారు? పెళ్లికి ముందు సెక్స్ అనే కాన్సెప్ట్‌తో వారిద్దరి మధ్య ఒప్పందం కుదరడానికి కారణాలు ఏమిటి? అలా శృంగార జీవితాన్ని అనుభవిస్తున్న సమయంలో పల్లవి (అను) రిషి (గౌతమ్)కు ఎందుకు బ్రేకప్ చెప్పింది? పెళ్లి చూపుల్లో మళ్లీ కలుసుకొన్న తర్వాత వారిద్దరి మధ్య ఏం జరిగింది? పెళ్లి చూపులు జరిగాయా? పెళ్లి వరకు రావడానికి ముందు వారి జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయి అనే ప్రశ్నలకు సమాధానమే ఇప్పుడు కాక ఇంకెప్పుడు మూవీ కథ.

     ఫస్టాఫ్ అనాలిసిస్

    ఫస్టాఫ్ అనాలిసిస్

    సమాజంలో పరిస్థితుల ప్రభావం వల్ల పిల్లలు చెడిపోతారనే భయాందోళనలతో అను తల్లిదండ్రులు (అప్పాజీ అంబరీష, తులసి), గౌతమ్ తల్లిదండ్రులు (తనికెళ్ల భరణి, అంజలి) పద్దతి, క్రమశిక్షణ పేరుతో వారి బాల్యంతో ఆడుకోవడమనే పాయింట్‌తో ఆరంభమవుతుంది. మగ పిల్లలతో స్నేహం చేయకుండా అనును, ఆడపిల్లలకు దూరంగా గౌతమ్‌ను పెంచడమే పాయింట్ మరి కాస్త ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెరిగిన ఇద్దరూ నగరంలోని సంస్కృతిలో చిక్కుకుపోవడం.. ఎప్పుడు కలవాలి? ఎక్కడ కలుసుకోవాలి అనే ఒప్పందం, రిలేషన్ ఫర్ బెన్‌ఫిట్స్ అనే కాన్సెప్ట్‌‌తో ఫస్టాఫ్ మరి రొమాంటిక్‌గా సాగుతుంది. తొలి భాగంలో రొమాంటిక్, శృంగార సన్నివేశాలు మోతాదును మించే ఉన్నాయనిపిస్తుంది.

     సెకండాఫ్ ఎలా ఉందంటే..

    సెకండాఫ్ ఎలా ఉందంటే..

    ఇక సెకండాఫ్‌లో పెళ్లికి ముందే సెక్స్ అనే పాయింట్‌తో కథ నడుస్తుంది. ఆ తర్వాత అను, గౌతమ్ పెళ్లి చూపులో కలుసుకోవడం, పెళ్లికి సెక్స్ లైఫ్‌ను గడిపిన వారు పెళ్లి చేసుకోవడానికి వెనుకాడటంతో కథలో ట్విస్టుగా మారుతుంది. అయితే సెకండాఫ్‌లో కథకు అవసరం లేని విషయాలను ఎక్కువగా సాగడంతో ఫస్టాఫ్‌లో పాజిటివ్‌గా అనిపించి విషయాలు సెకండాఫ్‌లో సినిమాకు ప్రతికూలంగా మారుతాయి. సెకండాఫ్‌లో సాగదీత కారణంగా కథలో ఉండే ఫీల్ తగ్గి కొంత బ్యాలెన్స్ తప్పినట్టు అనిపిస్తుంది. కాకపోతే హోటల్‌లో పెళ్లి చూపులు సీన్‌తో కథలో వేగం పుంజుకొంటుంది, ఎమోషనల్ అంశాలు సినిమాను ట్రాక్‌పై పెట్టినట్టు కనిపిస్తాయి. అయితే చివర్లలో కథను దర్శకుడు డీల్ చేసిన విధానంతో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే ఫీలింగ్ కలుగుతుంది.

    ఎంచుకొన్న పాయింట్‌తోనే

    ఎంచుకొన్న పాయింట్‌తోనే

    ఇప్పుడు కాక ఇంకెప్పుడు చిత్రం కోసం ఎంచుకొన్న పాయింట్‌తోనే తొలి చిత్ర దర్శకుడిగా వై యుగంధర్ సక్సెస్‌ను పట్టేశారనే విషయం అర్ధమవుతుంది. ఆ పాయింట్‌ను కథ, మంచి కథనంతో పరుగులు పెట్టించడంతో తొలి చిత్ర దర్శకుడు అనే ఫీలింగ్ ఎక్కడా కనిపించదు. అంతేకాకుండా తొలి భాగం యూత్‌ఫుల్ అంశాలను డీల్ చేసిన దర్శకుడు.. సెకండాఫ్‌లో కుటుంబపరమైన అంశాలను జోడించి సినిమాను బూతు నుంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే ఫీలింగ్‌ను కల్పించడంలో సఫలమయ్యారు. పాత్రలను రాసుకొన్న విధానం, సీన్లను పేర్చుకొంటూ పోయిన విధానం సినిమాకు ప్లస్‌గా మారింది. ప్రొడక్షన్ విభాగం, అలాగే స్క్రీన్ రైటర్‌గా అనుభవం ఈ సినిమాను సక్సెస్ బాటలో నడిపించడానికి అవకాశం కలిగిందనే ఫీలింగ్ కలుగుతుంది.

    హీరో, హీరోయిన్ల ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే..

    హీరో, హీరోయిన్ల ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే..

    హీరో, హీరోయిన్ల విషయానికి వస్తే... గౌతమ్‌గా, రుషిగా హస్వంత్ వంగా, అను, పల్లవిగా నమ్రతా దరేకర్ తమ తమ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. ఇద్దరు నటనలో తమ అనుభవానికి మించి పరిణతిని ప్రదర్శించారు. రొమాంటిక్, శృంగార సీన్లలో రెచ్చిపోయి నటించారు. సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్లలో ఫెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీశారని చెప్పవచ్చు. హస్వంత్, నమత్రా ఇద్దరు పోటాపోటీగా నటించారు. ఇంకా ఈ చిత్రంలో పూజా రామచంద్రన్ పాత్ర కూడా ఆకట్టుకొనేలా ఉంటుంది. తన పాత్రకు పూజా సంపూర్ణంగా న్యాయం చేశారని చెప్పవచ్చు. క్యాటలీన్ గౌడ, రాజ రవీంద్ర పాత్రలు కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి.

     తనికెళ్ల భరణి, రాజ రవీంద్ర, తులసి..

    తనికెళ్ల భరణి, రాజ రవీంద్ర, తులసి..

    మిగితా పాత్రల్లో తనికెళ్ల భరణి, యూట్యూబ్ యాంకర్ అంజలి, అంబరీష, తులసి తమ పాత్రల్లో అద్బుతంగా నటించారు. సాధారణంగా పిల్లల పెంపకంలో ఉండే భయాందోళనలను నటనపరంగా చక్కగా పలికించారు. తనకు కొట్టిన పిండిగా మారిన పాత్రలో తనికెళ్ల భరణి అద్భుతమైన హావభావాలను పలికించారు. తులసి మధ్య తరగతి తల్లిపాత్రలో ఒదిగిపోయారు. సాఫ్ట్‌ నేచర్‌తో ఫీల్ గుడ్ పాత్రలో అంబరీష మెప్పించారు. తనకు లభించిన మంచి పాత్రకు అంజలి న్యాయం చేసిందనే చెప్పాలి.

    సాంకేతిక విభాగాలు

    సాంకేతిక విభాగాలు


    ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్‌ ఈ సినిమాను నిలబెట్టిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. తొలి సీన్ నుంచి చివరి సీన్ వరకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేసింది. పాటలు కూడా క్యాచీగా ఉన్నాయి. సంగీత దర్శకుడు సాహిత్య సాగర్ మంచి మార్కులు కొట్టేశారు. ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ సినిమాటోగ్రఫి. వైజాగ్‌ను ఇంత అందంగా చూపించవచ్చా అనే రేంజ్‌లో నగర అందాలను అద్బుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాను చాలా రిచ్‌గా అందించడంలో జెమిన్ జామ్ అయ్యనేత్ పనితీరు అద్భుతంగా ఉంది. శ్రీకాంత్ పట్నాయక్‌ ఎడిటర్‌గా కొన్ని సీన్లపై మరికొంత వేటు వేయాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాలో డైలాగ్స్ అద్బుతంగా పేలాయి. ఎవరైనా మాట అంటే కోపం వస్తే అబద్ధం.. బాధగా మౌనంగా ఉంటే అది నిజం లాంటి డైలాగ్స్ వెంటాడుతుంటాయి. పూజా రామచంద్రన్‌తో చెప్పించిన డైలాగ్స్, అలాగే క్లైమాక్స్‌లో ప్రతీ పాత్రతో పలికించిన సంభాషణలు బాగున్నాయి. ఇతర సాంకేతిక విభాగాల నిపుణులు కూడా అదనపు ఆకర్షణగా మారారు.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి

    ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి

    ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి. కథ, నటీనటుల ఎంపిక నిర్మాత చింతా గోపాల్‌కృష్ణారెడ్డి అభిరుచికి అద్దం పట్టాయని చెప్పవచ్చు. సినిమాను రిచ్‌గా, ఫీల్‌గుడ్‌గా అందించడంలో సక్సెస్ అయ్యారు. యువతకు కావాల్సిన విషయాలతోపాటు సమాజానికి అవసరమైన చిన్న మెసేజ్‌తో మంచి చిత్రాన్ని అందించారని చెప్పవచ్చు.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    ఇప్పుడు కాక ఇంకెప్పుడు చిత్రం గురించి ఫైనల్‌గా మాట్లాడుకోవాలంటే పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు అనుసరించే విధానాలు, క్రమశిక్షణ పేరుతో వారి బాల్యాన్ని ఎలా తప్పుదారిని పట్టిస్తున్నారనే విషయాన్ని చెప్పే కథగా ఈ చిత్రం రూపొందింది. పెళ్లికి ముందు సెక్స్ అనే ఎట్రాక్టివ్ పాయింట్‌తో సమాజానికి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. పిల్లలకు అన్నీ తెలియచెప్పాలి. అలాగే మంచి, చెడు ఏమిటో వారికి నేర్పించాలి అనే పాయింట్ ఈ సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చింది. ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు తప్పిస్తే.. ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్ చక్కగా ఎంజాయ్ చేసే అంశాలు ఉన్నాయి. సెకండాఫ్‌ కొంత పార్ట్ సినిమాను వీక్‌గా మార్చిందనే ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే వారాంతంలో ఎంజాయ్ చేయాలనుకొనే వారికి ఈ సినిమా మంచి ఛాయిస్. యూత్‌కు కనెక్ట్ అయితే కమర్షియల్‌గా మంచి ఫలితాన్ని అందుకొనే అవకాశం పుష్కలంగా ఉంది.

    Recommended Video

    Prabhas Dual role in Salaar. Eye feast for fans. Katrina kaif special song in Salaar
    తెర వెనుక, తెర ముందు

    తెర వెనుక, తెర ముందు

    నటీనటులు: నమత్రా దారేకర్, హస్వంత్ వంగా, తులసి, తనికెళ్ల భరణి, అప్పాజీ అంబరీష, కటాలీన్ గౌడ, పూజా రాంచంద్రన్, ఐడ్రీమ్ అంజలి తదితరులు
    రచన, దర్శకత్వం: వై యుగంధర్
    నిర్మాత: చింతా గోపాల్‌కృష్ణారెడ్డి
    సాహిత్యం, మ్యూజిక్ డైరెక్టర్: సాహిత్య సాగర్
    ఎడిటింగ్: శ్రీకాంత్ పట్నాయక్ ఆర్
    సినిమాటోగ్రఫి: జెమిన్ జామ్ అయ్యంత్
    రిలీజ్: 2021-08-06

    English summary
    Ippudu Kaaka Inkeppudu movie hits the theatres on 6th of August. This movie directed by Y Yugander, Produced by Chinta Gopal Krishna Reddy. In this occassion, Telugu filmibeat brings exclusive review and Rating.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X