twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Iravatham movie review ఆకట్టుకొనే కథ, మెప్పించే కథనం.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఐరావతం

    |

    టాలీవుడ్‌లో క్రైమ్, థ్రిల్లర్ చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. మంచి కంటెంట్‌తో వచ్చిన చిత్రాలు మంచి విజయాన్ని అందుకొన్న దాఖలాలు ఉన్నాయి. సరైన ప్రేమ కథకు మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడిస్తే.. ప్రేక్షకులు పొందే అనుభూతి వేరే లెవెల్‌లో ఉంటుంది. అలాంటి కోవలో వచ్చిన చిత్రమే ఐరావతం మూవీ. కొత్త నటీనటులతో, దర్శకుడితో వచ్చిన ఐరావతం చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందనే విషయాన్ని తెలుసుకొందాం..

     Iravatham movie review and rating

    బ్యూటీషియన్‌గా పనిచేసే శ్లోక (తన్వీ నేగి), చిక్కు (అమర్ దీప్ చౌదరీ) మధ్య అఫైర్ ఉంటుంది. తన ప్రియురాలు శ్లోక బర్త్ డే రోజున ఓ వైట్ కెమెరాను చిక్కు బహుమతిగా ఇస్తాడు. ప్రియుడు ఇచ్చిన కెమెరాతో తన వీడియోను తీసుకొంటుంది.

    అయితే కెమెరాతో తీసుకొన్న వీడియో తర్వాత శ్లోక జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకొన్నాయి. ఈ కథలో ప్రిన్సీ అనే అమ్మాయి ఎవరు? శ్లోకకు ప్రిన్సీ జీవితం గురించి ఎలా తెలిసింది. ఈ కథలో మాయా (ఏస్తెర్) ఎవరు? శ్లోక, ప్రిన్సీలో ఎవరో ఒకరు చనిపోతారని మాయ ఎందుకు చెప్పింది? శ్లోక, ప్రిన్సీని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? శ్లోక, ప్రిన్సీ ప్రాణాలకు సైకో కిల్లర్ వల్ల ఎందుకు ముప్పు ఏర్పడింది? ఇంతకు ఈ కథలో సన్నీ (అరుణ్ జాన్) ఎవరు? చివరకు శ్లోక, ప్రిన్సీలకు ఎలాంటి పరిస్థితి ఎదురైంది? వారు ఈ ముప్పును బయటపడ్డారా అనే ప్రశ్నలకు సమాధానమే ఐరావతం.

    శ్లోక, చిక్కు మధ్య ప్రేమ కథతో ఫీల్‌గుడ్ నోట్‌తో కథ మొదలవుతుంది. ఎప్పుడైతే వైట్ కెమెరా గిఫ్టుగా ఇస్తాడో అప్పుడే అసలు కథ మొదలవుతుంది. ఆ తర్వాత వచ్చే ట్విస్టులు, సన్నివేశాలు కొత్త అనుభూతిని పంచుతూ కథ అనేక మలుపులు తిరుగుతుంది. పక్కా స్క్రిప్టుతో కథను నడిపించిన విధానం సినిమాపై ప్రేక్షకుడి పట్టు బిగించేలా చేస్తుంది. అక్రమ సంబంధాలు పెట్టుకొంటే ఎలాంటి సమస్యలు ఎదురువుతాయి అనే మెసేజ్‌తో దర్శకుడు సుహాస్ మంచి ట్రీట్‌మెంట్‌తో సినిమాను అందించాడు.

    తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్ దీప్ చౌదరీ ఐరావతం చిత్రంలో హీరోగా నటించాడు. సిల్వర్ స్క్రిన్‌కు కొత్తైనప్పటికి.. ఫీల్‌గుడ్ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. చిక్కు పాత్రలో అమర్ దీప్ బాయ్ నెక్ట్స్ డోర్ క్యారెక్టర్‌లో ఆకట్టుకొన్నాడు.

    ఇక శ్లోకగా నటించిన తన్వీ నేగి ఈ సినిమాలో కీలకమైన పాత్రను పోషించడమే కాకుండా గ్లామర్‌పరంగా, నటన పరంగా మంచి మార్కులే కొట్టేసింది. మాయగా ఎస్తేర్, అరున్ జాను, ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకొన్నారు. ఈ చిత్రంలో సప్తగిరి పాత్ర కొసమెరుపుగా ఉంటుంది. చర్చి ఫాదర్ క్యారెక్టర్‌లో కనిపించి మంచి హాస్యాన్ని పంచేందుకు ప్రయత్నించారు.

    దర్శకుడు సుహాస్ మేరా లవ్, క్రైమ్, థ్రిల్లర్ అంశాలను మేలవించి ఐరావతాన్ని సస్పెన్స్ థ్రిల్లర్‌గా మార్చాడు. ట్విస్టులు, స్క్రీన్ ప్లేతో కథను నడిపిన విధానం తన టాలెంట్‌కు అద్దం పెట్టింది. పక్కా స్క్రిప్టుతో అద్యంతం వినోదాన్ని అందించడంలో సక్సెస్ అయ్యాడు.

    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కార్తీక్ కడగండ్ల మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణ. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆకట్టుకొన్నాడు. సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్ సినిమాకు కావాల్సిన మ్యూజిక్‌ను అందించడంలో సఫలమయ్యాడు. ఈ సినిమాకు మరో ఆకర్షణ ఆర్కే వల్లెపు సినిమాటోగ్రఫి. సన్నివేశాల చిత్రీకరణ, లైటింగ్ బాగుంది. సురేష్ దుర్గం ఎడిటింగ్ బాగుంది.

    నిర్మాతలు రాంకీ పలగని, లలిత కుమారి, బాలయ్య చౌదరి పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథను ఎంచుకొన్న తీరు సినిమాపై వారికి ఉన్న అభిరుచిని తెలియజేసింది. కథను ఎలివేట్ చేయడానికి ఎలాంటి రాజీ పడలేదనే విషయం స్క్రీన్ మీద ప్రతీ ఫ్రేమ్ తెలియజేసింది.

    ఫైనల్‌గా ఐరావతం ఓ మంచి అనుభూతిని పంచే సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్. క్రైమ్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. విభిన్నమైన, విలక్షణతో కూడిన సినిమాలను ఆదరించే వారికి వీకెండ్‌లో ఐరావతం చక్కటి ఆప్షన్. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే.. ఐరావతం ఎక్కడా మిమ్మల్ని నిరుత్సాహానికి గురిచేయదు.

    English summary
    Iravatham movie released on May 6th in Theaters. Janaki Kalaganaledu serial Amardeep Chowdary and Tanvi Negi are the lead roles. Here is Telugu filmibeat review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X