Isakapatnam Web Series Review: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: ఐశ్వర్య రాజేశ్, సముద్రఖని, రాజీవ్ కనకాల, సునీల్, నరేష్ అగస్త్య, సుధాకర్ కోమాకుల, బెనర్జీ, రాజా చెంబోలు, జ్వాలా కోటి తదితరులు
దర్శకత్వం: గ్యారీ బీహెచ్
నిర్మాతలు: రాహుల్ తమడ, సందీప్ రెడ్డి బొర్ర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తేజవర్మ సరిపెల్ల
డైలాగ్స్: సయ్యద్ తాజుద్దీన్
కథ: ప్రశాంత్ రగతి
మ్యూజిక్: ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫి: వంశీ పచ్చిపులుసు
సాహిత్యం: శ్రీజో
బ్యానర్: తమడ మీడియా
ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ రిలీజ్ డేట్: 2026-07-01

ఇసకపట్నం ప్రాంతంలో నిజాయితీ పరుడైన నాయకుడు చిన్నారావు (రాజీవ్ కనకాల)కు స్థానిక మత్స్యకారుల్లో మంచి పలుకుబడి, పేరు ఉంటుంది. బతుకు తెరువు పేరుతో ఆ ప్రాంతానికి వచ్చిన నాయుడు (సముద్రఖని) కూలీగా చిన్నారావు దగ్గర చేరుతాడు. గంగమ్మ జాతరలో చిన్నారావును నాయుడు దారుణంగా హత్య చేసి ఆయన స్థానంలో ఆ ప్రాంతానికి తిరుగులేని నాయకుడిగా అవుతాడు. నాయుడు కూతురైన భారతి (ఐశ్వర్య రాజేశ్) తండ్రి హత్యారాజకీయాలు నచ్చవు. సామాజిక కార్యకర్తగా తండ్రిని వ్యతిరేకిస్తూ ఆ ప్రాంత ప్రజలకు సేవ చేస్తుంటార. భారతీని ఓ యువకుడు (సుదాకర్ కోమాకుల) ప్రేమిస్తుంటాడు. తనను ప్రేమించే వ్యక్తిని కాకుండా ప్రతాప్ వర్మను వివాహం చేసుకొంటుంది. కానీ ప్రతాప్ వర్మ పస్ట్ నైట్‌లోనే చనిపోతాడు.

చిన్నారావు మరణం తర్వాత ఇసుకపట్నం ప్రాంతాన్ని ఎలా నాయుడు తన గుప్పిట్లో పెట్టుకొన్నాడు? ఇసకపట్నం మాఫియాను కట్టడి చేసేందుకు ఇన్స్‌పెక్టర్ వర్మ (సునీల్) ఏం చేశాడు? తండ్రిని భారతీ ఎందుకు వ్యతిరేకిస్తుంది? భారతీ సమాజ సేవ ఎలా సాగింది? తనను ప్రేమించిన యువకుడిని కాకుండా ప్రతాప్ వర్మను ఎందుకు పెళ్లి చేసుకొన్నది? ప్రతాప్ వర్మ ఎలా చనిపోయాడు? ఆటో డ్రైవర్ పెద్దన్న (నరేష్ అగస్త్య) కల నెరవేరిందా? నాయుడుకు నీడలా ఉండే కోటయ్య (బెనర్జీ) హత్య వెనుక కారణం ఏంటి? తండ్రి మరణం తర్వాత కోటయ్య కొడుకు శేఖర్ (రాజా చెంబోలు) ఏం చేశాడు? ఇసుకపట్నంపై నాయుడు పట్టు సడలిందా? భారతీ వ్యూహాలు వర్కవుట్ అయ్యాయా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ వెబ్ సిరీస్ కథ.

Isakapatnam Review

వలస కూలీలపై నాయకత్వ, అధిపత్య పోరాటం నేపథ్యంగా ఇప్పటికే చాలా సినిమాలు,వెబ్ సిరీస్‌లు వచ్చాయి. ఇసకపట్నం సిరీస్ విషయానికి వస్తే.. నేటివిటి, మట్టి వాసన ఉన్న పాత్రలు, వాటి స్వభావం కొత్తగా ఉంటుంది. ప్రతీ పాత్రకు మంచి స్కోప్ ఉండేలా డిజైన్ చేయడం.. ఆ పాత్రల నుంచి దర్శకుడు గ్యారీ పెర్పార్మెన్స్ రాబట్టుకొన్న విధానం ఈ సిరీస్‌కు హైలెట్‌గా కనిపిస్తాయి. రా అండ్ రస్టిక్ నేరేషన్‌తో మంచి రూరల్ డ్రామాగా తెరకెక్కించిన విధానం బాగుంది. అయితే కొన్ని ఇంపాక్ట్‌ఫుల్ పాత్రలకు అంతగా గుర్తింపులేని యాక్టర్లను తీసుకోవడం వల్ల ఆ క్యారెక్టర్స్ తేలిపోయినట్టు కనిపిస్తాయి. కానీ గ్యారీ దర్శకత్వ ప్రతిభ ఆ లోపాన్ని కప్పిపుచ్చేలా చేశాయని చెప్పవచ్చు. కథను ఎస్టాబ్లిష్ చేయడానికి సమయం ఎక్కువగా తీసుకొన్నప్పటికీ.. చివరి మూడు ఎపిసోడ్స్‌ హైడ్రామా కట్టిపడేస్తుంది.

సముద్రఖనికి నాయుడు పాత్ర కొట్టిన పిండే. ఇప్పటికే ఆయన నట విశ్వరూపాన్ని చూసి ఉన్నాం. కానీ సరికొత్తగా విలనిజాన్ని పండించేందుకు ప్రయత్నించిన తీరు బాగుంది. భారతీ పాత్రలో ఐశ్వర్య రాజేశ్ ఇంటెన్స్ యాక్టింగ్ బాగుంది. సునీల్, సుధాకర్ కోమాకులు, నరేన్ ఆగస్త్య తమ పాత్రల పరిధి మేరకు రాణించారు. బెనర్జీ, రాజ చెంబోలు క్యారెక్టర్ స్పెషల్‌గా కనిపిస్తాయి. ఈ సిరీస్‌లో నటించిన వారంతా తమ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు.

ఈ వెబ్ సిరీస్‌కు సినిమాటోగ్రఫి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను ఎలివేట్ చేశాయి. చాలా చోట్ల డైలాగ్స్ సన్నివేశాలకు బలాన్ని ఇచ్చాయి. సినిమాటోగ్రాఫర్ వంశీ జెట్టిలు, తీర ప్రాంతపు సన్నివేశాలు చాలా సహజసిద్దంగా చూపించారు. కంటెంట్ పరంగా ఇంకాస్త డిఫరెంట్‌గా తమడ మీడియా ప్లాన్ చేసి ఉంటే.. మంచి రివేంజ్, ఇంటెన్స్ వెబ్ సిరీస్ అయి ఉండేది. హై బడ్జెట్ సినిమాకు తీసిపోని విధంగా నిర్మాణ విలువలను పాటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నది. తగినంత సమయాన్ని కేటాయించి ఒకే స్ట్రెచ్‌లో చూస్తే మంచి ఫీల్ కలుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X