twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఇట్స్ మై లవ్ స్టోరీ’ రివ్యూ...

    By Bojja Kumar
    |

    నటీనటులు : అరవింద్ కృష్ణ, నిఖిత నారాయణ్, జయసుధ, శరత్ బాబు, కాశీ విశ్వనాథ్‌, ప్రగతి, తాగు బోతు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు
    నిర్మాత: మున్నా వెంకట కృష్ణారెడ్డి
    దర్శకత్వం: మధుర శ్రీధర్‌
    వన్ ఇండియా రేటింగ్ : 2/5

    స్నేహ గీతం సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన మధుర శ్రీధర్ ఆ సినిమాత ద్వారా మంచి దర్శకుడిగా పేరుతెచ్చున్నప్పటికీ...ఆ సినిమా మాత్రం విజయం సాధించ లేక పోయింది. దీంతో ఈ సారి విభిన్నమైన ప్రేమకథ చిత్రంతో ప్రేక్షకులను అలరిస్తాను అంటూ ఇంత కాలం చెప్పకొచ్చాడు. మరి శ్రీధర్ తాజా సినిమా 'ఇట్స్ మై లవ్ స్టోరీ" కథా కమామిషు ఏమిటనే దానిపై ఒకసారి ఫేసు టర్నింగ్ ఇచ్చుకుందాం...

    కథ విషయానికొస్తే...
    వీడియో గేమ్ డెవలపర్ గా పని చేస్తున్న అర్జున్( అరవింద్ కృష్ణ) హైదరాబాద్లో తన సొంత ప్లాట్ లో ఉంటూ ఉంటాడు. ఫ్యాషన్ డిజైనర్ గా ఎదగాలని ఎన్నో ఆశలతో హైదరాబాద్ వస్తుంది వందన(నిఖిత నారాయణ్). వందనకు, అర్జున్ కు అనుకోకుండా పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త స్నేహంగా ఆపై ప్రేమగా మారుతుంది. హాస్టల్ లో ఉంటున్న వందనకు ఒక చేదు అనుభవం ఎదురు కావడంతో అర్జున్ తో కలిసి అతని ప్లాట్ లో ఉంటుంది. ఆ బంధాన్ని వందన తల్లి దండ్రులు(జయసుధ, శరత్ బాబు) తప్పు బడతారు. ఆ పైన ఏం జరింగది? అనేది మిగిలిన కథ.

    పెర్ఫార్మెన్స్ : అరవింద్ కృష్ణ హీరో అనే పదానికి తగిన విధంగా ఉన్నాడు. ఒక నటుడికి ఉండాల్సి అన్ని లక్షణాలు అతనికున్నాయని చెప్పొచ్చు. నిఖిత నారాయణ అందంలోనూ, నటనలోనూ ఫర్వాలేదు. జయసుధ, శరత్ బాబులు తమ ఇమేజ్ కు ఏమాత్రం తీసిపోకుండా సహ సిద్దం నటించారు. వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ కామెడీ ఫర్వాలేదనిపిస్తుంది.

    విశ్లేషణ :

    రోటీన్ కి భిన్నంగా సినిమా ఉంటుందంటూ ఇంతకాలం మధుర శ్రీధర్ చెప్పిన మాటలు కేవలం పబ్లిసిటీ స్టంట్, వట్టిమాటలనే అని ఈ సినిమా చూసిన వారికి ఇట్టే అర్థం అవుతుంది. ఆయన చెప్పననట్లు ఇదేదో ప్రత్యేక మైన చిత్రం అస్సలు కాదు. తల్లిదండ్రులను ఒప్పించడం కోసం ప్రేమికులు పడే పాట్లు...అనే కథాంశంతో తెలుగులో ఇప్పటి వరకు చాలానే వచ్చాయి. కనీసం ఇట్స్ మై లవ్ స్టోరీ సినిమా వినోదాత్మకంగా అయినా ఉందా? అంటే అదీ లేదు. తొలి సగ భాగం కాస్త ఫర్వాలేదనిపించి, సెండాప్ మాత్రం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. వాస్తవానికి మొదటి సగంలోనే సినిమా పూర్తవుతుంది. మరి దర్శకుడి ఆలోచన ఏమో గానీ....సెకండాప్ ను సా...గ తీసితీసి చికాకు పుట్టించాడు అని చెప్పక తప్పదు. కామెడీ సన్నివేశాలు కొన్ని ఓకే కానీ, కొన్ని మాత్రం చెత్తగా ఉన్నాయి అనే అభిప్రాయం ప్రేక్షకుల అభిప్రాయం. ఓవరాల్ గా ఈ సినిమా రోటీన్ లవ్ స్టోరీ. పైగా ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్ లేని బోరింగ్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు.

    అయితే సినిమా నాణ్యత విషయంలో మాత్రం దర్శక నిర్మాతలు రాజీ పడలేదని స్పష్టంగా చెప్పొచ్చు. తక్కువ బడ్జెట్ లో సినిమాను సూపర్ గా తెరకెక్కించారు. సునిల్ కశ్యప్ అందిచిన పాటలు సినిమాకు ప్లస్ పాయింట్, సిరాశ్రీ రాసిన లిరిక్స్ బాగున్నాయి, బ్యాగ్రౌండ్ స్కోరు ఫర్వాలేదు. పి.జె విందా సినిమాటో గ్రఫీ బాగుంది. దర్శకుడు ప్రేక్షకుల నాడిని పసిగట్టి ఉంటే బాగుండేది. మిగతా అంశాలన్నీ బాగుండి..అసలు దాంట్లో మ్యాటర్ లేక పోవడంతో సినిమా బోరింగ్ గా తయారైంది.

    English summary
    When the director named his film as ‘It’s My Love Story’, one would expect it to be a unique love story. Sadly, is not unique but just a rehash of lots of love stories that we have already seen hundreds of times on the silver screen.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X