twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Itlu Maredumilli Prajaneekam Review అల్లరి నరేష్ అదరొట్టే పెర్ఫార్మెన్స్.. ప్రభుత్వాల పనితీరుపై విమర్శనాస్త్రం

    |

    Rating: 2.75/5

    నటీనటులు: అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, రఘుబాబు, శ్రీ తేజ్, ప్రవీణ్, సంపత్ రాజ్, కుముదన్ తదితరులు
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఏఆర్ మోహన్‌
    నిర్మాత: రాజేష్‌ దండు
    సంగీతం: శ్రీ చరణ్ పాకాల
    సినిమాటోగ్రఫీ: రాంరెడ్డి
    ఎడిటర్: చోటా కే ప్రసాద్
    ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
    మాటలు: అబ్బూరి రవి
    ఫైట్స్: పృథ్వీ
    పాటలు: కాసర్ల శ్యామ్, శ్రీ మణి, అబ్బూరి రవి
    కోరియోగ్రఫీ: శేఖర్, విజయ్
    బ్యానర్: జీ స్టూడీయోస్‌, హస్య మూవీస్
    రిలీజ్ డేట్: 2022-11-25

    ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం కథేంటంటే?

    ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం కథేంటంటే?

    తెలుగు టీచర్‌గా పనిచేసే శ్రీనివాస్ శ్రీపాద (అల్లరి నరేష్) రంపచోడవరం నియోజకవర్గానికి జరిగే అసెంబ్లీ ఎన్నిక కోసం మారేడుమిల్లి ప్రాంతానికి ఎన్నికల అధికారిగా వెళ్తారు. అయితే అక్కడి ప్రజలు ఎన్నికలను బహిష్కరించుకోవాలని నిర్ణయించుకొంటారు. ప్రపంచానికి అంటి ముట్టనట్టు ఉండే గిరిజన ప్రాంతంలోని కష్టాలు ప్రత్యక్ష్యంగా చూస్తాడు. అయితే ఓటు హక్కు వినియోగించుకొంటే.. రవాణ, ఆరోగ్యం, విద్య సదుపాయాలు సమకూరుతాయని మారేడుమిల్లి గ్రామస్థులకు శ్రీనివాస్ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో శ్రీనివాస్, ఇంగ్లీష్ టీచర్ (అల్లరి నరేష్), ప్రభుత్వ అధికారి (ప్రవీణ్) కిడ్నాప్ అవుతారు.

    కథలో ట్విస్టులు ఇలా..

    కథలో ట్విస్టులు ఇలా..

    ఓటు హక్కు వినియోగించుకోవాలని శ్రీనివాస్ శ్రీపాద చేసిన రిక్వెస్ట్‌కు మారేడుమిల్లి ప్రజలు సానుకూలంగా స్పందించారా? శ్రీనివాస్ సలహాతో ఓటు హక్కు వినియోగించుకొన్నారా? శ్రీనివాస్‌తోపాటు ఇతర సిబ్బందిని ఎవరు కిడ్నాప్ చేశారు? కిడ్నాప్‌కు గురైన ప్రభుత్వ ఉద్యోగులను విడిపించడానికి కలెక్టర్ అర్జున్ త్రివేది (సంపత్ రాజ్) చేసిన ప్రయత్నాలు ఏమిటి? ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించిన కలెక్టర్‌ త్రివేది ఎలాంటి గుణపాఠం నేర్చుకొన్నారు. చివరకు ప్రజల డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గిందా అనే ప్రశ్నలకు సమాధానమే ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా కథ.

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

    తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం గొప్పదా? అని అల్లరి నరేష్, వెన్నెల కిషోర్ మధ్య జరిగే చర్చతో కథ ఆసక్తికరంగా మొదలవుతుంది. ప్రతీ సన్నివేశంలో తెలుగు భాష గొప్పతనాన్ని దర్శకుడు ఏఆర్ మోహన్ చెప్పే ప్రయత్నం చేయడం అభినందనీయం. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎక్కువ సమయం తీసుకోకుండానే కథలోకి వెళ్లి ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. కానీ రొటీన్ సీన్లు, రెగ్యులర్ పాటర్న్‌లో కథ చెప్పడమే కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో కథను కొంత సాగదీసినట్టు అనిపిస్తుంది.

    సెకండాఫ్‌ ఎమోషనల్‌గా

    సెకండాఫ్‌ ఎమోషనల్‌గా

    ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. కథలో అసలు డ్రామా అప్పుడే మొదలవుతుంది. అల్లరి నరేష్. ఇతర సభ్యుల కిడ్నాప్ వ్యవహారంతో కథ సీరియస్‌ నోట్‌లోకి వెళ్తుంది. అయితే కథ సీరియస్‌గా సాగినట్టు అనిపించినా.. కథనంలో హాస్యాన్ని బ్లెండ్ చేసిన విధానంతో సినిమా ఆద్యంతం వినోదభరితంగా సాగుతుంది. రఘుబాబు ఎపిసోడ్ మంచి కామెడీని పండించింది. ఇక క్లైమాక్స్‌లో నేటివిటిని టచ్ చేసి.. కాంతార తరహా ముగింపును ఇచ్చే ప్రయత్నం కూడా మెప్పించేలా ఉంది.

    అల్లరి నరేష్, ఆనంది ఫెర్పార్మెన్స్

    అల్లరి నరేష్, ఆనంది ఫెర్పార్మెన్స్


    కెరీర్ ఆరంభంలో ప్రాణం, గమ్యం తరహా విభిన్నపాత్రలతో ప్రయోగం చేసిన అల్లరి నరేష్.. ఇటీవల కాలంలో మహర్షి, నాంది సినిమాలో నటుడిగా కొత్త అవతారం ఎత్తారు. నాంది ఇచ్చిన జోష్‌తో మరోసారి ఫెర్ఫార్మెన్స్‌కు పూర్తి స్కోప్ ఉన్న శ్రీనివాస శ్రీపాద పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. నాంది సినిమానే కాకుండా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకంతో నరేష్ కంప్లీట్ యాక్టర్ అనే ఫీలింగ్ కనిపించాడు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లలోను, అలాగే.. క్లైమాక్స్‌లో అల్లరి నరేష్ హృదయాన్ని కదిలించేంతగా ఫెర్ఫార్మెన్స్ చేశాడని చెప్పవచ్చు. ఇక ఆనంది కూడా నటనకు స్కోప్ ఉన్న పాత్రలో మెప్పించింది.

    ఇతర నటీనటుల గురించి

    ఇతర నటీనటుల గురించి

    మిగితా నటీనటులు విషయానికి వస్తే.. ఇట్లు మారేడుమిల్లి సినిమాలో శ్రీతేజ్ క్యారెక్టర్ హైలెట్. సినిమాను నరేష్‌తోపాటు సమానంగా మోసే ప్రయత్నంలో సఫలమయ్యాడు. కొండా క్యారెక్టర్‌తో శ్రీతేజ్ రూపంలో మరో మంచి నటుడు తెలుగు ఉన్నాడనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక వెన్నెల కిషోర్ ఎలాంటి పాత్రైనా తన ధోరణిలో, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో నవ్వులు పూలు పూయించాడు. సంపత్ రాజ్, ప్రవీణ్, కుముదన్ మిగితా పాత్రల్లోని వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

    సాంకేతిక నిపుణుల గురించి

    సాంకేతిక నిపుణుల గురించి

    ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా సాంకేతిక విభాగాల్లో ఆర్ట్, సినిమాటోగ్రఫి, మ్యూజిక్, డైలాగ్స్ కీలకంగా మారాయి. అబ్బూరి రవి అందించిన మాటలు ఆలోచింపజేస్తాయి. ఇక అటవీ ప్రాంత అందాలను రాంరెడ్డి తన కెమెరా వర్క్‌తో ఆకట్టుకొన్నాడు. శ్రీ చరణ్ పాకాల ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు తన బీజీఎంతో అదరగొట్టాడు. ఎక్స్‌ట్రా ఫ్రేమ్ లేకుండా చోటా కే ప్రసాద్ ఎడిటింగ్‌ సినిమాను పరుగులు పెట్టించింది. బ్రహ్మ కడలి ఆర్ట్ మరో హైలెట్ అని చెప్పవచ్చు.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు


    ప్లస్ పాయింట్స్
    అల్లరి నరేష్ ఫెర్ఫార్మెన్స్
    డైరెక్షన్, టెక్నికల్ అంశాలు
    స్టోరి పాయింట్, నేటివిటి

    మైనస్ పాయింట్స్
    రెగ్యులర్, రొటీన్ సన్నివేశాలు
    ఎమోషన్స్ కొన్నిచోట్ల పండకపోవడం

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    ఓటు విలువ, మారుమూల గిరిజన ప్రాంతాలకు జరుగుతున్న అన్యాయం, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతల బాధ్యతారాహిత్యం లాంటి అంశాలను ఎమోషనల్‌గా చేప్పేందుకు చేసిన ప్రయత్నం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. నేటివిటి, గిరిజనులు ఆచారాలు, సెంటిమెంట్ కథకు బలంగా నిలిచాయి. అయితే కథ సింగిల్ పాయింట్‌తో ఒకే నోట్‌లో వేరియేషన్స్ లేకుండా చెప్పడం ఫస్టాప్‌లో కొంత రోటీన్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ భావోద్వేగానికి గురిచేసేలా ఉంటుంది. తెలుగు భాష ఔన్నత్యం, ఉపాధ్యాయుల వృత్తికి మరింత గౌరవం తెచ్చేలా చెప్పిన డైలాగ్స్ కేక పట్టిస్తాయి. క్యాలెండర్‌లో టీచర్లకు ఒక రోజు ఉంది.. కలెక్టర్లకు ఒక రోజు ఉందా? ఆలోచింపజేసే డైలాగ్స్ హృదయాన్ని ఉల్లాసంగా మారుస్తాయి.ఇంగ్లీష్ మీడియం బూచీ చూపించి తెలుగు భాషను భ్రష్టుపట్టించే వారికి ఈ సినిమా ఒక చెంపపెట్టు. ఇట్లు మారేడుమిల్లి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ సినిమానే కాకుండా మార్పు, ప్రశ్నించే తత్వంపై ఆధారంగా వ్యవస్థ గురించి ఆలోచింపజేసే చిత్రం. అభ్యుదయ భావాలు ఉన్న కథలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

    English summary
    Allari Naresh's latest movie Itlu Maredumilli Prajaneekam hits the Theatres on November 25th. Here is the Telugu Filmibeat Exclusive Review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X