Jaabilamma Neeku Antha Kopama Review: జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

మూవీ: జాబిలమ్మ నీకు అంత కోపమా?
నటీనటులు: పవిష్, అనిక సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, రమ్య రఘురామన్, వెంకటేశ్ మీనన్, ఆడు కాలమ్ నరేన్ తదితరులు
దర్శకత్వం: ధనుష్
నిర్మాతలు: కస్తూరి రాజా, విజయలక్ష్మీ కస్తూరి రాజా
మ్యూజిక్: జీవీ ప్రకాశ్ కుమార్
ఎడిటర్: జీకే ప్రసన్న
సినిమాటోగ్రఫి: లీయాన్ బ్రిట్టో
ఆర్ట్: జాకీ
బ్యానర్: వండర్‌బార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్
రిలీజ్ డేట్: 2025-02-21

కథ ఏమిటంటే?
ఛెఫ్‌గా పనిచేసే యువకుడు ప్రభు (పవిష్)‌కు నీలా (అనికా సురేంద్రన్)తో బ్రేకప్ జరుగుతుంది. అయితే ఏడాది తర్వాత కొడుకు బాధ చూడలేక పెళ్లి చేయాలని తల్లిదండ్రులు (ఆడుకాలమ్ నరేన్) ఫిక్స్ అవుతారు. దాంతో పెళ్లిచూపులు ఏర్పాటు చేయగా అక్కడ అమ్మాయి (ప్రియా ప్రకాశ్ వారియర్)ని చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత వారిద్దరూ ఒకరి మనసును మరొకరు తెలుసుకొనేందుకు జర్నీని ప్రారంభిస్తారు. ఆ క్రమంలో వారిద్దరి జీవితంలో జరిగిన బ్రేకప్స్ గురించి చెప్పుకొంటారు. ఆ క్రమంలో నీలా పంపిన శుభలేఖను చూసి షాక్ అవుతాడు. తన మాజీ ప్రేయసి పెళ్లికి తన ప్రాణ స్నేహితుడు రవి (వెంకటేశ్ మీనన్)తో కలిసి వెళ్తాడు.

Jaabilamma Neeku Antha Kopama Tamil Movie Review in Telugu  priya prakash varrier shines in Dhanush s Poetic love Story

స్టోరీలో ట్విస్టులు
నీలాతో పవిష్ బ్రేకప్ ఎందుకు జరిగింది? నీలా తండ్రి (శరత్ కుమార్) ఎందుకు పవిష్ ప్రేమకు అడ్డు తగిలాడు? పవిష్ బ్రేకప్‌ను కాబోయే భార్య (ప్రియా ప్రకాశ్ వారియర్) ఒకే చెప్పిందా? తన కాబోయే భార్య బ్రేకప్ స్టోరిని విన్న పవిష్ రియాక్షన్ ఏమిటి? మాజీ ప్రియురాలి వెడ్డింగ్ కార్డు చూసి ఎందుకు షాక్ అయ్యాడు? తన మాజీ లవర్ పెళ్లికి వెళ్లిన పవిష్‌కు ఎలాంటి సంఘటనలు ఎదురు పడ్డాయి? తన జీవితంలోకి వచ్చిన అంజలి (రమ్య రంగనాథన్) ఎవరు? మాజీ ప్రేయసి, కాబోయే భార్య ఉందని తెలిసినా పవిష్‌తో అంజలి ఎలా ప్రేమలో పడింది? తన స్నేహితులు రాజేశ్, శ్రీయ (మ్యాథ్యూ థామస్, రబీనా ఖాతూన్) కథేంటి? చివరకు నీలా, ప్రియా ప్రకాశ్ వారియర్, అంజలిలో ఎవరిని పవిష్ పెళ్లి చేసుకొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే జాబిలమ్మ నీకు అంత కోపమా? సినిమా కథ.

సినిమా ఎలా ఉంది?
ప్రేమ అంటే చికాకు, విసుగు, కోపం ఉన్న పవిష్ క్యారెక్టర్ పరిచయంతో ఈ మూవీ కథ మొదలవుతుంది. వెంటనే ప్రియా వారియర్‌తో పెళ్లి చూపులు ఏర్పాటు చేసి ఎక్కువ సమయం తీసుకోకుండా కథలోకి వెళ్లడంతో మంచి ఫీల్‌తో కథ సాగుతుందనే విషయం అర్ధమవుతుంది. అయితే ఫ్లాష్ బ్యాక్‌లో నీలాతో అఫైర్ చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. కానీ ఫస్టాఫ్‌లో కథ అక్కడక్కడే తిరుగుతుండటంతో సినిమా కథను సాగదీసి చెబుతున్నాడా? అనే కొంత విసుగు ఏర్పడుతుంది. తొలి భాగంలో నీలాతో పవిష్ ప్రేమ కథ ఫన్, ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాతో ముందుకు సాగడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా అనిపిస్తుంది.

దర్శకుడిగా ధనుష్ కథను ఎలా చెప్పాడు?
సెకండాఫ్‌లో నీలా డెస్టినేషన్ వెడ్డింగ్ గోవాలో జరుగుతుండటంతో స్టోరీ అక్కడికి చేరుతుంది. పవిష్‌కు అంజలి కలవడం.. వారి మధ్య ఓ డిఫరెంట్ కెమిస్ట్రీ బిల్డ్ కావడం, మధ్యలో రవి లవ్ స్టోరి, శ్రీయ, రాజేష్ ఫన్‌తో సాగే ప్రేమ కథ సినిమాకు స్పెషల్ ఎలిమెంట్స్‌లా కనిపిస్తాయి. ఇక నీలాతో బ్రేకప్‌ కారణంగా పవిష్‌లో తెలియని మానసిక ఆందోళన మొదలవుతుంది. అయితే నీలాకు పెళ్లి జరిగిన తర్వాత శ్రీయ చెప్పిన షాకింగ్ విషయాలు పవిష్‌ను గందరగోళంలో పడేస్తాయి.

జాబిలమ్మ కోపం ఎవ్వరిపై
నీలా, ప్రియా, అంజలి మధ్య పవిష్ ట్రాయాంగిల్ లవ్‌ను దర్శకుడిగా ధనుష్ డీల్ చేసిన విధానం సినిమాకు హైలెట్. ఆహ్లాదకరమైన కామెడీ, కొంత ల్యాగ్, మరికొంత లవ్, రొమాన్స్, ఇంకాస్త ఫ్యామిలీ డ్రామా, నీలా, ఆమె తండ్రి (శరత్ కుమార్) ఎమోషనల్ బాండింగ్ సినిమాను మరింత భావోద్వేగంగా మారుతాయి. ఇలాంటి కాన్‌ఫ్లిక్ట్‌ను పొరలు పొరలుగా ధనుష్ డీల్ చేసిన విధానం ఆయన జీవితా అనుభవాలు పనికి వచ్చాయా? అనే సందేహం ఏర్పడుతాయి. క్లీన్ అండ్ హెల్తీ లవ్ స్టోరీ చాన్నాళ్లకు చూశామా? అనే తృప్తితో థియేటర్ బయటకు రావడం ధనుష్ కథకుడిగా సాధించిన విజయంగా అనిపిస్తుంది.

కుర్రాళ్లు, పెద్దలు ఎలా పెర్ఫార్మ్ చేశారంటే?
నటీనటులు విషయానికి వస్తే.. నటనకు పవిష్ కొత్త కుర్రాడైనా బాగా రాటుదేలిన అనుభవంతో నటించాడు. నేటితరం కుర్రాడి పోకడలు, ఆలోచన విధానం ఆ క్యారెక్టర్‌కు అద్దం పట్టేలా నటించాడు. ఫన్, ఎమోషన్స్, సెంటిమెంట్, జాలీ ఆడుతూ పాడుతూ ఆ క్యారెక్టర్‌ను తెర మీద పండించాడు. ఇక నీలాగా అనికా సురేంద్రన్ తన పాత్రలో ఒదిగిపోయింది. వీరిద్దరూ సినిమా భారాన్ని సమానంగా మోయడంతో కథలో ఎలాంటి ఇంబాలెన్స్ లేకుండా కనిపిస్తుంది. ప్రియా ప్రకాశ్ వారియర్ గెస్ట్ రోల్ అయినప్పటికీ కథలో ప్రజెన్స్ బలంగానే ఉంటుంది. శరత్ కుమార్ ఓ ఎమోషనల్ పాత్రలో సినిమాకు వెన్నముకలా నిలిచాడు. రమ్య రంగనాథన్ తన ఫెర్ఫార్మెన్స్‌తో మనసు దోచుకొటుంది. ఎమోషనల్ కథలో వెంకటేష్ మీనన్, మ్యాథ్యూ థామస్, రబీనా ఖాతూన్ అనుక్షణం నవిస్తూ ఊరట కలిగిస్తారు.

టెక్నికల్‌గా ఎలా ఉందంటే?
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. అందమైన ప్రేమకథను మరో రేంజ్‌కు తీసుకెళ్లిన ఘనత సంగీత దర్శకుడు జీవి ప్రకాశ్ కుమార్‌కే దక్కుతుంది. సన్నివేశాలకు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల అదరగొట్టిందనిపిస్తుంది. సన్నివేశాలకు తగినట్టుగా వచ్చే పాటలు మంచి ఫీల్‌తో సాగుతాయి. లీయాన్ బ్రిట్టో సినిమాటోగ్రఫి సినిమాను మంచి పెయింటింగ్‌లా మార్చింది. ఆర్ట్ వర్క్, కలర్ ప్యాలెట్ బాగా కుదిరాయి. కస్తూరి రాజా, విజయలక్ష్మీ కస్తూరి రాజా నిర్మాతలుగా అనుసరించిన విలువలు బాగున్నాయి. సినిమా చూస్తున్నంత సేపు రిచ్ ఫ్యామిలీ మధ్యలో గడిపామా? అనే ఫీలింగ్‌ను కల్పిస్తుంది.

ఓవరాల్‌గా జాబిలమ్మ నీకు అంత కోపమా? ఎలా ఉందంటే?
జాబిలమ్మ నీకు అంత కోపమా? సినిమా విషయానికి వస్తే.. లవ్, ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స్ ముఖ్యంగా నేటితరం యువత అభిచుచులకు అద్దం పట్టే చిత్రంగా అనిపిస్తుంది. ప్రస్తుత జనరేషన్‌లో యువతీ యువకుల పోకడలను దర్శకుడు ధనుష్ స్పష్టంగా తెరకెక్కించారు. నటీనటులు ఫెర్పార్మెన్స్, సాంకేతిక విభాగాల పనితీరు ఈ మూవీకి అత్యంత బలంగా మారాయి. కథ చెప్పే స్వభావం కారణంగా ఓ వర్గం వారికి సాగదీసినట్టు అనిపిస్తుంది. యూత్‌కు మాత్రం బాగా కనెక్ట్ అవుతుంది. వయసులో సంబంధం లేకుండా ఎంజాయ్ చేయడానికి సన్నివేశాలను ధనుష్ బాగా రాసుకొన్నాడు. అవి మీకు కూడా నచ్చే అవకాశం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మీకు ప్రేమ కథలను ఆస్వాదించే గుణం ఉంటే.. మీరు తప్పకుండా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. కాబట్టి థియేటర్‌కు వెళ్లి ఈ సినిమాను ఆస్వాదించే పనిలో ఉండండి.. సినిమా టైటిల్ పాత చింతకాయ పచ్చడిలా అనిపించినా.. భోజనం లాంటి సినిమా మంచి టేస్టీగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X