Jaane Jaan Review దృశ్యం మూవీ రేంజ్‌లో.. కరీనా కపూర్ కెరీర్ బెస్ట్.. జానే జాన్ మూవీ రివ్యూ

Rating:
3.0/5

నటీనటులు: కరీనా కపూర్ ఖాన్, జైదీప్ అహ్లావత్, విజయ్ వర్మ, సౌరబ్ సచ్‌దేవ, నైషా ఖన్నా తదితరులు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుజోయ్ ఘోష్
డైలాగ్స్: సుజోయ్ ఘోష్, రాజ్ వసంత్
నిర్మాతలు: జయ్ షేవాక్రమణి, ఆకాశ్ పూరి, శోభాకపూర్, ఏక్తా కపూర్
సినిమాటోగ్రఫి: అవిక్ ముఖోపాధ్యాయ్
ఎడిటింగ్: ఊర్వశి సక్సెనా
మ్యూజిక్: సచిన్, జిగర్ (సాంగ్స్), షోర్ పోలీస్ (బ్యాక్ గ్రౌండ్ స్కోర్)
బ్యానర్: బాలాజీ మోషన్ పిక్చర్స్, 12th స్ట్రీట్ ఎంటర్‌టైన్‌మెంట్, క్రాస్ పిక్చర్స్, నార్తర్న్ లైట్స్ ఫిల్మ్స్
ఓటీటీ రిలీజ్: నెట్‌ఫ్లిక్స్
ఓటీటీ రిలీజ్ డేట్: 2023-09-21

పశ్చిమ బెంగాల్‌లో కాలింమ్‌పోంగ్ ప్రాంతంలో మాయ డిసౌజా అలియాస్ సోనియా మాత్రే టిఫిన్ కేఫ్‌ను నిర్వహిస్తుంటుంది. పోలీస్ ఇన్స్‌పెక్టర్ అయిన భర్త అజిత్ మాత్రే (సౌరబ్ సచ్‌దేవా)తో విభేదాల కారణంగా తన కూతురు తార (నైషా ఖన్నా) కలిసి ఒంటరి జీవితాన్ని గడుపుతుంటుంది. అయితే తన ఇంటికి వచ్చి వేధింపులకు గురిచేస్తున్న నేపథ్యంలో భర్త అజిత్‌ను కూతురు తారతో కలిసి మాయ చంపేస్తుంది. భర్త శవాన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పక్కింటి టీచర్ నారు అలియాస్ నరేన్ మాయకు సహకరిస్తాడు.

Jaane Jaan Movie Review and Rating: Kareena Kapoor career best performance

ప్రేమించి పెళ్లి చేసుకొన్న భర్త అజిత్‌తో మాయకు ఎందుకు విభేదాలు తలెత్తాయి? మాయను అజిత్ ఎలా వేధించాడు? భర్తను కూతురితో కలిసి చంపాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అజిత్ శవాన్ని మాయం చేసేందుకు టీచర్ ఎందుకు సహకరించాడు? పోలీస్ ఇన్స్‌పెక్టర్ అజిత్ అదృశ్యమైన తర్వాత అతడి ఆచూకీ కోసం రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్ కరణ్ ఆనంద్ (విజయ్ వర్మ)కు ఎలాంటి సంఘనలు ఎదురయ్యాయి? ఇంతకు అజిత్ శవాన్ని టీచర్ నారు ఏం చేశాడు? అజిత్ కేసులో కరణ్ ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది? భర్త హత్య కేసులో మాయ, టీచర్ అరెస్ట్ అయ్యారా? అనే ప్రశ్నలకు సమాధానమే జానే జాన్ సినిమా (Jaane Jaan Review) కథ.

మాయ (కరీనా కపూర్) తన కూతురితో కలిసి సింగిల్ పేరెంట్‌ లైఫ్‌ను చకచకా ఎస్టాబ్లిష్ చేసి ఆలస్యం చేయకుండా అసలు కథలోకి వెళ్లిపోవడంతో సినిమా చాలా గ్రిప్పింగ్‌గా, ఎమోషనల్‌గా మారుతుంది. ప్రేమించిన భర్త ఎవరూ ఊహించిన విధంగా భార్యను మోసం చేయడం, ఆపై వేధింపులకు గురిచేయడమే పాయింట్‌తో మాయ, తార క్యారెక్టర్లపై సానుభూతి పెరిగేలా చేయడంలో దర్శకుడు సుజోష్ సక్సెస్ అయ్యారు. భర్త మర్డర్ తర్వాత జరిగే సన్నివేశాలు సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయని చెప్పవచ్చు.

Jaane Jaan Movie Review and Rating: Kareena Kapoor career best performance

అజిత్ మర్డర్ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి కరణ్ వచ్చాడా? లేదా ఆ ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ అయి వచ్చాడా? అనే విషయంలో క్లారిటీ, లాజిక్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఇక నూర్ అనే టీచర్‌, ఇన్స్‌పెక్టర్ కరణ్‌ చిన్ననాటి స్నేహితులు అనే పాయింట్‌ను డైరెక్టర్ తన ఫ్లెక్సిబిలిటీ కోసం రాసుకోవడం చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. ఇన్స్‌పెక్టర్ కరణ్ ఇన్వెస్టిగేషన్ సాగదీసినట్టు ఉంటుంది. అలాగే మాయపై కరణ్ మోజు పడే సన్నివేశాలను తొలగించడం వల్ల ఆ ట్రాక్‌లో క్లారిటీ మిస్ అయినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే.. కరీనా, విజయ్ మధ్య లిప్ లాక్ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ సీన్ వరకు జరిగే జరిగే డ్రామా చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. (Jaane Jaan Review)

కరీనా కపూర్ (Kareena Kapoor Khan) అంటే గ్లామర్ హీరోయిన్‌గా మాత్రమే తెలుసు. అయితే మాయగా, సోనియాగా కరీనా కపూర్ మధ్య తరగతి గృహిణిగా డీ గ్లామర్ క్యారెక్టర్‌లో అద్బుతమైన ఫెర్ఫార్మెన్స్‌తో మెప్పించారు. కరీనా కపూర్ కెరీర్‌లోనే బెస్ట్ రోల్ అని చెప్పవచ్చు. హీరోతో లవ్, రొమాంటిక్ సీన్లకే పరిమితమైన కరీనా మాయ పాత్రలో ఒదిగిపోయి యాక్టింగ్‌తో విజృంభించింది.(Jaane Jaan Review). టీచర్‌గా జైదీప్ అహ్లావత్ (Jaideep Ahlawat) తన ఫెర్ఫార్మెన్స్, బాడీ లాంగ్వేజ్, సింపుల్ యాటిట్యూడ్‌తో ఆకట్టుకొన్నాడు. స్కూల్‌లో పిల్లలతో మ్యాజిక్ చేసే సీన్లు గానీ, అలాగే మ్యాథమెటిక్స్ టీచర్‌గా ప్రాబ్లెం సాల్వ్ చేసే సీన్లకు పూర్తిగా న్యాయం చేశాడని చెప్పవచ్చు. ఇక అజిత్‌గా చిన్న పాత్ర అయినప్పటికీ.. ఆ రోల్ ఇంపాక్ట్ సినిమాపై పూర్తిగా ఉండేలా సౌరబ్ సచ్‌దేవ నటించాడు. ఇక విజయ్ వర్మ (Vijay Varma) ఆఫీసర్‌గా పలు రకాల వేరియేషన్‌తో ఆకట్టుకొన్నారు. మిగితా వారంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.

Jaane Jaan Movie Review and Rating: Kareena Kapoor career best performance

జానే జాన్ (Jaane Jaan Review) సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. ఈ సినిమా వరకు మ్యూజిక్, సినిమాటోగ్రఫి ఓ రేంజ్‌లో ఉన్నాయి. హిల్ స్టేషన్ అందాలను అవిక్ ముఖోపాధ్యాయ్ అద్బుతంగా కెమెరాలో బంధించారు. ఎమోషనల్‌గా డ్రామాలో నటీనటుల హావభావాలను బాగా క్యాప్చర్ చేశారు. ఈ సినిమాకు రీరికార్డింగ్ మరింత ఎలివేషన్ ఇచ్చింది. ఎడిటింగ్, ఇతర విభాగాల పనితీరు కూడా బాగుంది. ఇక దర్శకుడు సుజోష్ ఘోష్ (Sujoy Ghosh) మ్యాథమెటిక్ థియరీ, ప్లాబ్లెం ద్వారా, మార్షల్ ఆర్ట్‌ను బ్లెండ్ చేస్తూ కథ చెప్పడం బాగుంది కానీ సాధారణ ప్రేక్షకుడికి కనెక్ట్ కావడం కష్టమే అనిపిస్తుంది. దృశ్యం సినిమాలోని కంటెంట్ ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యాడా అనిపిస్తుంది.

జానే జాన్ (Jaane Jaan Review) అనే సినిమాకు ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ X (The Devotion of Suspect X) అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు. దృశ్యం సినిమాకు కూడా ఈ పుస్తకం ఆధారంగా తెరకెక్కిన కొరియన్ సినిమా ఆధారం. కాబట్టి కంటెంట్ విషయంలో కొంత పోలీకలు కొట్టిచ్చినట్టు కనిపిస్తాయి. కాకపోతే కథ ట్రీట్‌మెంట్, సింగిల్ పేరెంట్ కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తాయి. ఈ సినిమా టైటిల్ లతా మంగేష్కర్ పాడిన ఇంతకామ్ సినిమాలోని జానే జాన్ పాటకు కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్‌కు ఎమోషనల్ కంటెంట్‌ను కూడా జత చేయడంతో టైటిల్‌కు జస్టిఫై చేసినట్టు అనిపిస్తుంది.

Jaane Jaan Movie Review and Rating: Kareena Kapoor career best performance

ఇక జానే జాన్ (Jaane Jaan Review) సినిమాకు ఎమోషన్స్‌తోపాటు నటీనటుల ఫెర్ఫార్మెన్స్ అత్యంత బలం. ఇన్వెస్టిగేషన్, థ్రిల్లింగ్, సస్పెన్స్ ఎలిమెంట్స్ సినిమాకు పాజిటివ్‌గా మారాయి. కరీనా కపూర్, జైదీప్, విజయ్ వర్మ మధ్య జరిగే డ్రామా మెప్పించేలా ఉంటుంది. ఈ సినిమా మంచి అనుభూతితోపాటు థ్రిల్లింగ్‌గా, చూస్తున్న సేపు మెదడుకు మేత పెట్టేలా ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. మీ తీరిక వేళలో తగినంత సమయాన్ని కేటాయించి ఒకేసారి సినిమాను ముగిస్తే మంచి ఫీల్ అందిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X