For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘జాను’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  3.0/5
  Star Cast: శర్వానంద్, సమంత, వెన్నెల కిషోర్, శరణ్యా ప్రదీప్
  Director: సీ ప్రేమ్ కుమార్

  Jaanu Movie Review | Sharwanand | Samantha | 96 Movie | Jaanu

  తమిళ నాట సంచలనం సృష్టించిన 96 చిత్రాన్ని తెలుగులో జానుగా రీమేక్ చేశారు.అక్కడ విజయ్ సేతుపతి, త్రిష క్రియేట్ చేసిన మ్యాజిక్‌ను తెలుగులో శర్వానంద్, సమంత రీ క్రియేట్ చేసేందుకు నేడు (ఫిబ్రవరి 7) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి కోలీవుడ్‌లో 96 క్రియేట్ చేసిన రికార్డులను తెలుగులో జాను చేసిందా? సమంత, శర్వానంద్‌లకు జాను ఏ మేరకు పేరు తీసుకొచ్చింది? అనే విషయాలను ఓ సారి చూద్దాం.

   కథ

  కథ

  రామచంద్రన్ (శర్వానంద్) చిన్నతనంలో జానకీదేవీ (సమంత)ని ప్రేమిస్తాడు. స్కూల్ ఏజ్‌లోనే ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. కొన్ని పరిస్థితుల వల్ల ఈ ఇద్దరు విడిపోతారు. మళ్లీ పదిహేనేళ్ల తరువాత ఏర్పాటు చేసే రీ యూనియన్ పార్టీలో కలుస్తారు.

  కథలోని ట్విస్టులు..

  కథలోని ట్విస్టులు..

  రామ చంద్రన్, జాను ఎందుకు విడిపోయారు? ప్రేమించిన అమ్మాయిని కలుసుకోవడానికి రామ చంద్రన్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? పదిహేనేళ్ల తరువాత రామచంద్రన్‌ను కలిసిన జాను రియాక్షన్ ఏంటి? చివరకు జాను, రామ చంద్రన్ కథ ఎలా ముగిసింది? అన్న ప్రశ్నలకు సమాధానమే జాను.

  ఫస్టాఫ్ అనాలిసిస్..

  ఫస్టాఫ్ అనాలిసిస్..

  ట్రావెలింగ్ ఫోటోగ్రాఫర్‌గా ప్రకృతిని ఆస్వాధిస్తూ తిరుగుతున్న రామ్‌ చంద్రన్‌తో కథ మొదలవుతుంది. ఫోటోగ్రఫీ పాఠాలు చెప్పడం, ఆ స్టూడెంట్స్‌ సరదా సన్నివేశాలతో కథ ముందుకు సాగుతూ ఉంటుంది. రామ్ ఎప్పుడైతే తన బాల్యం నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటాడో కథ అక్కడ ఆసక్తికరంగా మారుతుంది. ఫస్టాప్ దాదాపుగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడే కనిపిస్తుంది. ఆ సీన్స్ అన్నీ కూడా గతంలోకి తీసుకెళ్లేలానే ఉంటాయి. ఇది వరకు ఎన్నో సినిమాలో స్కూల్ ఏజ్ లవ్ స్టోరీస్ చూసినా.. కూడా జాను మరోసారి మ్యాజిక్ చేసినట్టు కనిపిస్తుంది. గెట్ టుగేదర్ పార్టీ, పాత స్నేహితులు కలుసుకోవడం, జోకులు, సరదా సన్నివేశాలతో అలా ప్రేక్షకులను కట్టిపడేయడంలో ప్రథమార్థం విజయవంతమైందని చెప్పవచ్చు.

   సెకండాఫ్ అనాలిసిస్..

  సెకండాఫ్ అనాలిసిస్..

  ప్రథమార్థాన్ని ఎంత ఫీల్‌తో నింపేశారో.. సెకండాఫ్‌ను అంతకు మించి ఎమోషన్స్‌తో నడిపించేశారు. ద్వితీయార్థంలోని అన్ని సీన్లు దాదాపు శర్వానంద్, సమంత మధ్యే వస్తాయి. ఈ ఇద్దరితోనే గంటకు పైగా నడిపించాడు. గతాన్ని గుర్తుకు చేసుకోవడం, సరదాగా ముచ్చట్లు చెప్పుకోవడం లాంటి సీన్స్‌తో ద్వితీయార్థాన్ని నింపేశారు. అయితే అవి ఎక్కడా కూడా బోర్ కొట్టించకపోవడం ప్లస్. సినిమా మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు ఒకే ఫీల్‌ను మెయింటేన్ చేయడంతో ప్రేక్షకులకు పక్క చూపులు చూసే అవకాశం ఉండదనిపిస్తుంది. ఇలా సినిమా ముగిసే సరిగి భారమైన హృదయంలో ప్రేక్షకులు బయటకు వచ్చేస్తారు.

  నటీనటుల పర్ఫామెన్స్‌..

  నటీనటుల పర్ఫామెన్స్‌..

  ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది రామ చంద్రన్, జాను అనే రెండు పాత్రల గురించే. వీటి చుట్టే, వారి గురించే కథ తిరుగుతూ ఉంటుంది. అయితే బాల్యం నాటి పాత్రల్లో నటించిన సాయి కిరణ్ కుమార్ , గౌరీ జీ కిషన్ తమ పాత్రల్లో చక్కగా నటించారు. శర్వానంద్, సమంతల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి పాత్రలు దొరికితే వారు ఎంత జీవిస్తారో ఇది వరకే చూశాం. సమంత, శర్వానంద్‌లు కాకుండా జాను, రామ చంద్రన్‌లే కనిపిస్తారు ప్రేక్షకులకు. ప్రతీ ఫ్రేమ్‌లో వీరి చూపించిన హావాభావాలు సినిమాను అందంగా మలిచాయి. ఎమోషనల్ సీన్స్‌లో ఇద్దరూ పీక్స్‌లో నటించారు. తమ పర్ఫామెన్స్‌తో వారిద్దరు ఈ సినిమాకు బలంగా మారారు.

  ప్లస్ పాయింట్స్

  ప్లస్ పాయింట్స్

  సమంత

  శర్వానంద్

  సంగీతం

  దర్శకత్వం

  మైనస్ పాయింట్స్

  రీమేక్ చిత్రం కావడం

  స్లో నెరేషన్

  దర్శకుడి పనితీరు..

  దర్శకుడి పనితీరు..

  ఒకసారి ఓ కథతో మ్యాజిక్ క్రియేట్ చేసిన దర్శకుడు.. మళ్లీ అదే కథతో వేరే నటీనటులతో అదే అద్భుతాన్ని రీ క్రియేట్ కొంచెం కష్టమే. అయితే సీ ప్రేమ్ కుమార్ అలాంటి కష్టాన్ని జయించినట్టు కనిపిస్తుంది. జాను సినిమాను చూస్తుంటే మధ్య మధ్యలో విజయ్ సేతుపతి, త్రిష గుర్తుకు వస్తే.. అది దర్శకుడి తప్పు కాదు.. నటీనటుల తప్పూ కాదు.. ప్రేక్షకులది అంతకంటే కాదు. ఎందుకుంటే 96 సినిమాతో క్రియేట్ చేసిన మ్యాజిక్ అలాంటిది మరి. అయితే ఒరిజినల్ సినిమాను చూడని ప్రేక్షకుడు.. రీమేక్‌ను చూస్తే మాత్రం కచ్చితంగా గతంలోకి వెళ్లి వస్తాడు. తెలుగులో రీమేక్ చేస్తున్నాము కదా అని అనవసరపు కమర్షియల్ హంగులకు పోకుండా.. తెరకెక్కించిన దర్శకుడు గట్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అయితే ఈ కథను ఇంత స్లోగా చెప్పడమే మైనస్ అయ్యేలా కనిపిస్తుంది. ఓ నిజాయితీతో కూడిన ప్రయత్నం చేసి.. దర్శకుడు అందులో సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు.

  సాంకేతిక నిపుణుల పనితీరు..

  సాంకేతిక నిపుణుల పనితీరు..

  జాను సినిమాకు ఆయువు పట్టులా నిలిచేది గోవింద్ వసంత్ అందించిన సంగీతమే. ప్రతీ పాట సన్నివేశానికి తగ్గట్టుగా వచ్చి.. ఫీల్ అయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా ఊహలే ఊహలే పాట వచ్చినప్పుడు థియేటర్లలో ఓ తెలియని మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. జాను కథలో కాసింత వేగంగా ఉంటే బాగుండేదేమోననిపిస్తుంది. ఈ విషయంలో ఎడిటర్ ప్రవీణ్ కేఎల్ తప్పు కూడా లేదనిపిస్తుంది. మహేంద్రన్ జయరాజ్ కెమెరాలో సమంత, శర్వానంద్ మరింత అందంగా కనిపించారు. జాను చిత్రంలోని డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఆర్ట్ విభాగం, నిర్మాణ విలువలు ఇలా ప్రతీ ఒక్కటి సినిమా స్థాయిని పెంచాయి. 96 సినిమాను రీమేక్ చేసేందుకు ముందుకు వచ్చిన నిర్మాత దిల్ రాజును ప్రత్యేకంగా అభినందించాలి. కమర్షియల్ హంగులను అద్దకుండా.. 96 సినిమాలోని ఫీల్ మిస్ కాకుండా ‘జాను'ను నిర్మించారు.

  నటీనటులు ..

  నటీనటులు ..

  నటీనటులు : శర్వానంద్, సమంత, వెన్నెల కిషోర్, శరణ్యా ప్రదీప్ తదితరులు

  దర్శకత్వం : సీ ప్రేమ్ కుమార్

  నిర్మాత : దిల్ రాజు

  బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

  మ్యూజిక్ : గోవింద్ వసంత్

  సినిమాటోగ్రఫి : మహేంద్రన్ జయరాజు

  ఎడిటింగ్ : ప్రవీణ్ కేఎల్

  ఫైనల్‌గా..

  ఫైనల్‌గా..

  స్వచ్చమైన ప్రేమకథలను ఆస్వాధించే వారికి జాను మంచి ఆప్షన్. రొటీన్ కమర్షియల్ తెలుగు చిత్రాలకు అలవాటుపడ్డ ప్రేక్షకులకు జాను ఓ చక్కటి జ్ఞాపకంగా మిగులుతుంది. అయితే ఇలాంటి చిత్రాలు బీ, సీ సెంటర్స్‌లో ఎంత వరకు ఆడతాయన్నది ప్రశ్నార్థకమే. కమర్షియల్ లెక్కల్లో చూసుకుంటే జాను ఏ రేంజ్ సక్సెస్‌ను అందుకుంటుందో చూడాలి.

  English summary
  Jaanu is an Telugu language Love And Emotional Drama written and directed by c Prem Kumar. The film stars Sharwanand, Samantha, Vennela Kishore, Sharanya Pradeep. This movie released on February 7th 2020.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X