Jaat Movie Review: జాట్ హిందీ సినిమా రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: సన్నీడియోల్, రెజీనా కసండ్రా, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, జగపతి బాబు, అజయ్ ఘోష్ తదితరులు
దర్శకత్వం: గోపిచంద్ మలినేని
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్, ఉమేశ్ కుమార్ భన్సల్
మ్యూజిక్ డైరెక్టర్: థమన్ ఎస్
సినిమాటోగ్రాఫర్: రిషి పంజాబీ
ఎడిటర్: నవీన్ నూలి
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
రిలీజ్ డేట్: 2025-04-10

శ్రీలంక నుంచి పారిపోయి ప్రకాశం జిల్లాలోని మోటుపల్లికి వచ్చిన లేబర్ రణతుంగ (రణ్‌దీప్ హుడా) అక్కడి అసాంఘీక శక్తులతో కలిసి గ్రామస్థులను వేధించడం.. పీడించడం చేస్తుంటాడు. అక్కడ రణతుంగ చెప్పేదే వేదం.. చేసేదే చట్టం. ఈ క్రమంలో విదేశీ కార్పోరేట్ సంస్థలతో చేతులు కలిపిన ఆయన ఏపీ సముద్ర తీర ప్రాంతంలోని గ్రామాలకు చెందిన ప్రజలను ఖాళీ చేయించే పని పెట్టుకొంటారు. అడ్డు తిరిగిన వారిని నిర్ధాక్షిణ్ణంగా చంపేస్తుటారు. అలాంటి పరిస్థితుల్లో బ్రిగేడియర్ బల్బీర్ ప్రతాప్ సింగ్ (సన్నీడియోల్) ఆ ప్రాంతానికి వస్తాడు.

Jaat Movie Review

శ్రీలంక నుంచి పారిపోయి వచ్చిన రణతుంగ అసలు ఎవరు? విదేశీ కార్పేరేట్ సంస్థలతో ఎందుకు చేతులు కలిపాడు. తన భార్య (రెజీనా)తో కలిసి ఎలాంటి అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడుతుంటాడు? పోలీసులను లెక్క చేయకుండా గ్రామస్థులపై ఎలాంటి అరాచకాలు చేశాడు? సీబీఐ ఆఫీసర్ (జగపతి బాబు)ను ఎందుకు అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తారు? అసలు బల్బీర్ ప్రతాప్ సింగ్‌కు ప్రకాశం జిల్లాలో ఏం పని? అక్కడికి వచ్చిన బల్బీర్ సింగ్.. రణతుంగను ఎలా ఎదురించి గ్రామస్థులకు అండగా నిలిచారు అనే ప్రశ్నలకు సమాధానం జాట్ సినిమా కథ.

ఓ కిసాన్ జవాన్‌గా మారితే అతడిలో ఏ మేరకు దేశభక్తి ఉంటుంది? దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతాడు అనే పాయింట్‌తో కథను అల్లుకొన్న తెలుగు దర్శకుడు గోపిచంద్ మలినేని బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. సన్నీడియోల్ ఇమేజ్, బాక్సాఫీస్ స్టామినాకు తగిన కథను రాసుకొని స్క్రీన్ మీద చెలరేగిపోయాడనే చెప్పాలి. సారీ అనే పాయింట్ తీసుకొని అల్లుకొన్న కథలో యాక్షన్, ఎమోషనల్ సీన్లను జొప్పించిన విధానం ఆయన ప్రతిభకు మరోసారి అద్దం పట్టింది. సన్నిడియోల్‌ క్యారెక్టర్‌ను లో ప్రొఫైల్‌ నడిపించి.. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు ఇచ్చిన బిల్డప్, ఎలివేషన్‌ చాలా బాగుంది. బాలీవుడ్‌లో తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకొనే ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు.

ఇక సన్నీడియోల్ యాక్టింగ్, పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. ఆయన బాక్సాఫీస్ స్టామినా అందరికి తెలిసిందే. కాకపోతే ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ సీన్ వరకు ఆయన చేసిన పెర్ఫార్మెన్స్, యాంగ్రీ మ్యాన్ యాక్టింగ్ ఈ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లిందనే చెప్పాలి. ఇక రణ్‌దీప్ హుడా, ఆయన పోటాపోటీగా నటించారు. ఇక బబ్లూ పృథ్వీరాజ్ క్యారెక్టర్ బాగుంది. విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో రెజీనా అదరగొట్టింది. జగపతి బాబు, రవి ప్రసాద్, అజయ్ ఘోష్, దివి, సయామీ ఖేర్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సినిమాటోగ్రఫి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ విభాగాల పనితీరు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఈ సినిమా కలర్ టోన్ బాగుంది. రిషి పంజాబీ చిత్రీకరించిన సన్నివేశాలు బాగున్నాయి. థమన్ బీజీఎం పలు సీన్లను భారీగా హైలెట్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనుసరించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. నవీన్ ఎర్నేని, రవిశంకర్, విశ్వ ప్రసాద్ తొలి బాలీవుడ్ సినిమాను నిర్మించి హిట్ కొట్టడం విశేషంగా చెప్పుకోవాలి.

Jaat Movie Review

ప్రకాశం జిల్లా, ఏపీ సముద్ర తీర ప్రాంతంలో ఖనిజాల దోపిడి బ్యాక్ డ్రాప్‌గా తెలుగు నేటివిటితో రూపొందించిన చిత్రం జాట్. సన్నీడియోల్ టైటిల్ పాత్రను పోషించిన ఈ సినిమాలో యాక్షన్, ఎమోషనల్ కంటెంట్‌కు పెద్ద పీట వేశారు. గ్రామాల్లోని ఖనిజాల దోపిడిని కార్పోరేట్ సంస్థలు ఎలా పాల్పడుతాయనే పాయింట్‌తో గోపిచంద్ రాసుకొన్న పాయింట్, సన్నివేశాలుగా విస్తరించిన తీరు బాగుంది. ఆర్మీ, దేశభక్తి అంశాలను కలబోసిన సినిమా మంచి అనుభూతిని పంచుతుంది. ఈ సినిమాకు మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉంది. వీలైతే థియేటర్‌లోనే చూడండి.

More from Filmibeat

Read more about: sunny deol regina cassandra Jaat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X