Jaat Twitter Review: జాట్ హిందీ మూవీ ట్విట్టర్ రివ్వ్యూ
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం జాట్. యాంగ్రీ స్టార్, బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మలినేని తొలిసారి బాలీవుడ్‌కు పరిచయమవుతూ రూపొందించిన చిత్రమిది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్, ఉమేశ్ కుమార్ భన్సల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో సన్నీడియోల్‌తోపాటు రెజీనా కసండ్రా, సయామీ ఖేర్, రమ్యకృష్ణన్, జగపతి బాబు, బబ్లూ పృథ్వీరాజ్, జరీనా వాహెబ్, ఉపేంద్ర లిమియే,అజయ్ ఘోష్, ఆయేషా ఖాన్, దయానంద్ రెడ్డి, ఊర్వశీ రౌటేలా అతిథి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించారు. మే 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో నెటిజన్లు వెల్లడించిన రివ్యూలు అభిప్రాయాల వివరాల్లోకి వెళితే..

సినిమాల గురించి నేను ఎక్కువగా ట్వీట్స్ చేయను. జాట్ ప్రీమియర్ షో చూశాను. ఈ మూవీ మైండ్ బ్లోయింగ్. పైసా వసూల్ మూవీ. ఓవరాల్‌గా మంచి ఎంటర్‌టైనర్. మీరు ఘాయల్, దామిని, ఘాతక్ సినిమాల ఫ్యాన్స్ అయితే.. ఈ సినిమా మీకు బాగా నచ్చుతుంది. ధర్మేంద్ర ముద్దుల కుమారుడు సన్నిడియోల్ స్క్రీన్ పై సింహంలా గర్జించాడు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
సన్నిడియోల్, గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో మైండ్ బ్లోయింగ్ మూవీ వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్. బిగ్ స్క్రీన్‌లో ఎక్స్‌పీరియెన్స్ మిస్ చేసుకోకండి. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను చూడండి అమేజింగ్‌గా ఉంటుంది. ఫుల్ ఎంటర్‌టైనర్. యాక్షన్ సీన్లు మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











