Prema Vimanam OTT Review అనసూయ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించిందా? ప్రేమ విమానం సమీక్ష

Rating: 2.75/5

నటీనటులు: సంగీత్ శోభన్, శాన్వీ మేఘన, అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్, దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా తదితరులు
సమర్పణ: దేవాన్ష్ నామా
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, జీ5
నిర్మాత: అభిషేక్ నామా
దర్శకత్వం: సంతోష్ కటా
సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రాఫర్: జగదీష్‌ చీకటి
ఎడిటర్: అమర్ రెడ్డి
ఆర్ట్ డైరెక్టర్: గంధి నడికుడికర్
సీఈవో: వాసు పోతిని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మోహిత్ రాల్యని
పీఆర్వో సురేంద్ర నాయుడు - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)

పేద వ్యవసాయ కుటుంబానికి చెంది శాంత (అనసూయ భరద్వాజ్) కుమారులు రాము (దేవాన్ష్ నామా), లచ్చు (అనిరుధ్ నామా)కు చిన్నతనం నుంచే విమానం ఎక్కాలనే కోరిక ఉంటుంది. అయితే వారి ఆర్థిక పరిస్థితి అంతంతా మాత్రంగా ఉండటంతో తండ్రి (రవి వర్మ) పంటలు బాగా పండితే విమానం ఎక్కిస్తానని చెబుతాడు. ఇదిలా ఉండగా, గ్రామ పెద్ద (సుప్రీత్) కుమార్తె అభిత (సాన్వీ మేఘన) అదే ఊరికి చెందిన యువకుడు మణి (సంగీత్ శోభన్) పీకల్లోతు ప్రేమలో ఉంటారు. కులం సమస్య కావడం దొంగచాటుగా మణి, అభిత కలుసుకొంటుంటారు. విమానం ఎక్కాలనే కోరికతో తల్లి దాచిన డబ్బు తీసుకొని రాము, లచ్చు హైదరాబాద్‌కు బయలుదేరుతారు. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోని దుబాయ్‌కి వెళ్లాలని అభిత, మణి హైదరాబాద్‌కు వెళ్తారు.

Jabardasth Fame Anasuya Bharadwajs Prema Vimanam movie Review and Rating

రాము, లచ్చుకు విమానం ఎక్కాలనే కోరిక ఎలా కలిగింది? విమానం ఎక్కడానికి రాము లచ్చుకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? విమానం ఎక్కడానికి రాము, లచ్చు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? తల్లి శాంత డబ్బు దొంగిలించి హైదరాబాద్‌కు వెళ్లిన రాము, లచ్చుకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? రాము, లచ్చు తండ్రి ఎలా మరణించాడు? చివరకు విమానం వారు ఎక్కారా? అలాగే మణి అభిత ప్రేమకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. మణి, అభిత ప్రేమకథకు ఎలాంటి ముగింపు దొరికింది అనే ప్రశ్నలకు సమాధానమే ప్రేమ విమానం సినిమా కథ.

అన్విత (ప్రియ) కూతురు (దక్షా నగార్కర్) జర్నలిస్టు కావాలనే లక్ష్యంతో మంచి కథ కోసం ప్రయత్నిస్తుంటుంది. తన నిర్మాతకు ఎన్ని కథలు చెప్పినా నచ్చకపోవడంతో ఆందోళనకు గురవుతుంది. అయితే తన తల్లికి బాధ చెప్పుకోవడంతో ఓ హింట్ ఇచ్చి.. ఓ పుస్తకాన్ని ఇస్తుంది. ఆ పుస్తకంలో ఉన్న కథ చదువుతూ ఉండటంతో సినిమా ఇంట్రెస్టింగ్‌గా మొదలవుతుంది. రాము, లచ్చు ఫ్యామిలీ కష్టాలతో మూవీ కొంత ఎమోషనల్‌గా సాగుతుంది. పిల్లల తండ్రి మరణంతో కథ ఎమోషనల్‌గా మారుతుంది. వెన్నెల కిషోర్ ఫస్ట్ నైట్ జరుగుతుండగా ఇద్దరు పిల్లలు డిస్ట్రబ్ చేయడం ఫన్ క్రియేట్ చేస్తుంది. ఇక మణి, అభిత లవ్ వ్యవహారం సాదాసీదాగా రొటీన్‌గా, రెగ్యులర్‌గా సాగుతూ ఫస్టాఫ్‌ పెద్ద విషయం లేకుండానే ముగుస్తుంది.

Prema Vimanam movie Review

ఇక సెకండాఫ్‌లో రాము, లక్ష్మణ్ తండ్రి చనిపోవడంతో వారికి మరింత కష్టాలు మొదలవుతాయి. విమానం ఎక్కలేమోననే బెంగ మొదలవుతుంది. దాంతో సొంతంగా కష్టపడి విమానం ఎక్కాలనుకొంటారు. ఇక కులం అడ్డుగోడగా మారడంతో లేచిపోయి పెళ్లి చేసుకొని దుబాయ్ వెళ్లాలని ప్లాన్ వేస్తారు. హైదరాబాద్‌కు చేరుకొన్న తర్వాత ఈ నలుగురి జీవితాల్లో భారీ ట్విస్టు మొదలవుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ వరకు ఉండే కథలో మలుపులు ఫీల్‌గుడ్‌గా ఉంటాయి. దర్శకుడు కథను ముగించిన విధానం ఆసక్తికరంగా ఆకట్టుకొంటుంది.

ప్రేమ విమానం సినిమాలో శాంతగా అనసూయ భరద్వాజ్ మరోసారి ఎమోషనల్ పాత్రలో కనిపించింది. ఇద్దరు పిల్లలకు తల్లిగా, భర్తను కోల్పోయిన గృహిణి పాత్రలో ఒదిగిపోయింది. పిల్లల కోరికలు, కుటుంబ భారాన్ని మోయలేక జీవితాన్ని కొనసాగించే భావోద్వేగమైన పాత్రతో మరోసారి ఆకట్టుకొన్నదనే చెప్పాలి. రాము, లక్ష్మణ్‌గా దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా తమ వయసుకు మించిన నటనను ప్రదర్శించారు. తొలిసినిమా అయినప్పటికి ఎలాంటి తొణుకుబెణుకు లేకుండా నటించారు. ఇక సంగీత్ శోభన్, శాన్వీ మేఘన ప్రేమ వ్యవహారంలో కొత్తదనం లేకపోయినా వారు తమ ప్రతిభతో లవ్ ట్రాక్‌‌ను పండించడానికి ప్రయత్నించారు. గోపరాజు రమణ, వెన్నెల కిషోర్, రవివర్మ, అభయ్ బేతిగంటి, సురభి ప్రభావతి, కల్పలత తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

Prema Vimanam movie released on ZEE5 on October 12th

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు మ్యూజిక్, ఆర్ట్, సినిమాటోగ్రఫి బలంగా కనిపించాయి. అనూప్ రూబెన్స్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రాఫర్ జగదీష్ చీకటి, గందీ నడికుడికర్ ఆర్ట్ విభాగం పనితీరు బాగుంది. ప్రతీ ఫ్రేమ్‌ను జగదీష్ రిచ్‌గా చూపించారు. పల్లెటూరు వాతావరణంలో సాగే ఈ సినిమాకు అనుసరించిన నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

గ్రామీణ వాతావరణం, తెలుగు నేటివిటితో మధ్య తరగతి కుటుంబాల భావోద్వేగాలు, లవ్, కామెడీ అంశాలతో సాగే చిత్రం ప్రేమ విమానం. అనసూయ, సాన్వీ మేఘన, దేవాన్ష్, అనిరుధ్, సంగీత్ శోభన్, వెన్నెల కిషోర్ తదితరుల ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు స్పెషల్‌గా కనిపిస్తాయి. అయితే ఫస్టాఫ్‌లో కథ, కథనాలు మరింత మెరుగ్గా ఉంటే బాగుండేదనిపిస్తుంది. క్లైమాక్స్‌లో 30 నిమిషాల కథ థ్రిల్లింగ్‌గా, కొత్తగా అనిపిస్తుంది. జీ5 ఓటీటీలో ప్రేమ విమానం స్ట్రీమింగ్ అవుతున్నది. తీరిక వేళల్లో అంచనాలు లేకుండా సినిమా చూస్తే నిరాశ పరచదు. అన్ని రకాల ఎమోషన్స్ మీకు కనెక్ట్ అయితే ఈ సినిమా మీకు నచ్చొచ్చు. కాబట్టి ఓటీటీలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X