Natho Nenu Review దర్శకుడిగా జబర్దస్త్ శాంతికుమార్.. డైరెక్షన్ ఎలా ఉంది? నాతో నేను మూవీ రివ్యూ!

నటీనటులు: సాయికుమార్‌, ఆదిత్య ఓం, శ్రీనివాస్‌ సాయి. ఐశ్వర్య, దీపాళీ రాజ్‌పుత్‌, రాజీవ్‌ కనకాల, సమీర్‌, సివిఎల్‌ నరసింహరావు, గౌతంరాజు, భద్రం, సుమన్‌శెట్టి తదితరులు
దర్శకత్వం: శాంతికుమార్‌ తూర్లపాటి
నిర్మాత: ప్రశాంత్‌ టంగుటూరి
మ్యూజిక్: సత్య కశ్యప్
సినిమాటోగ్రఫి: ఎస్ మురళీమోహన్ రెడ్డి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్ చిన్నా
ఎడిటింగ్‌: నందమూరి హరి
ఆర్ట్‌: పెద్దిరాజు అడ్డాల
బ్యానర్‌: శ్రీ భవ్నేష్‌ ప్రొడక్షన్స్‌
సమర్పణ: ఎల్లలు బాబు టంగుటూరి
రిలీజ్ డేట్: 2023-07-21

జీవితంలో వివిధ దశల్లో చోటు చేసుకొన్న అనేక వైఫల్యాలను అధిగమించిన కోటేశ్వరరావు (సాయికుమార్) ఉన్నతస్థాయికి చేరుకొంటారు. తనను వేధిస్తున్న కొన్ని సమస్యల కారణంగా ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకోవాలని అనుకొంటాడు. ఆ సమయంలో ఆ ఊరికి వచ్చిన స్వామిజీ ఎదురుపడి కోటేశ్వరరావుకు ఓ వరం ఇస్తాడు. అయితే ఆ వరం గురించి ఎవరికీ చెప్పకూడదని కోటేశ్వరరావు దగ్గర స్వామిజీ మాట తీసుకొంటాడు.

Jabardasth Shanthi Kumars Natho Nenu Movie Review and Rating

కోటేశ్వరరావు జీవితంలో చోటు చేసుకొన్న వైఫల్యాలు ఏమిటి? ఉన్నత స్థితికి చేరుకొన్న కోటేశ్వరరావు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకొన్నాడు? కోటేశ్వరరావుకు స్వామిజీ ఎలాంటి ధైర్యం చెప్పాడు? స్వామిజీ ఎలాంటి వరాన్ని కోటేశ్వరరావుకు ఇచ్చాడు? వరాన్ని పొందిన కోటేశ్వరరావు జీవితంలోకి చీకట్లు పోయి వెలుగులు వచ్చాయా? స్వామిజీ వరంతో కష్టాలను తొలగించుకొని సంతోషాలు చేజిక్కించుకొన్నాడా? కోటేశ్వరరావు జీవితంలో దీప (ఐశ్వర్య), నాగలక్ష్మీ (దీపాళీ) ఎలాంటి ప్రభావం చూపారు అనే ప్రశ్నలకు సమాధానమే నాతో నేను సినిమా కథ.

జబర్దస్త్ కమెడియన్ శాంతికుమార్ దర్శకుడి అవతారం ఎత్తి రూపొందించిన భావోద్వేగ చిత్రం నాతో నేను. కథకు సంబంధించిన పాయింట్‌ను ఎంచుకొన్న తీరు బాగుంది. ఆ పాయింట్‌ను పూర్తిస్థాయి కథగా విస్తరించిన తీరు బాగుంది. కోటేశ్వరరావు అనే వ్యక్తి జీవితంలోని యుక్త, మధ్యస్థ జీవితానికి సంబంధించిన ఎపిసోడ్స్‌ను బాగా ఆలోచించారు. సాధారణంగా జబర్దస్త్ కమెడియన్ అంటే అందరూ కామెడీ సినిమాను ఆశిస్తారు.

కానీ అలాంటి అంచనాలకు భిన్నంగా మంచి ఎమోషనల్ కథతో ముందుకు రావడం సినిమాపై ఆయనకు ఉన్న అభిరుచి తెలియజెప్పింది. అయితే కథ, కథనాలపై ఇంకా బెటర్‌గా వర్క్ చేసి ఉంటే బెటర్‌ అవుట్‌పుట్ వచ్చి ఉండేదనిపిస్తుంది. తనచుట్టు ఉన్న పరిస్థితులు, వనరులను చక్కగా వినియోగించుకొని ఫీల్‌గుడ్‌ సినిమాను అందించే ప్రయత్నం చేశారని చెప్పవచ్చు.

నటీనటుల విషయానికి వస్తే.. సాయికుమార్ తన వయసుకు తగిన పాత్రలో చక్కగా ఇమిడిపోయారు. మరోసారి భావోద్వేగమైన నటనతో ఆకట్టుకొన్నారనే చెప్పాలి. ఎమోషనల్ సీన్లలో తనదైన మార్కు చూపించారు. అయితే కోటేశ్వరరావు జీవితంలో 20 ఏళ్ల వయసులో ఉన్న కోటీగాడు పాత్రలో సాయి శ్రీనివాస్, 40 ఏళ్ల వయసులో కోటేశ్వరరావుగా ఆదిత్య ఓం తమ పాత్రల పరిధి మేరకు తమ నటనతో ఆకట్టుకొన్నారు. ఐశ్వర్య, దీపాళీ రాజ్‌పుత్ తమ పాత్రలకు న్యాయం చేసే ప్రయత్నం చేశారు. రాజీవ్ కనకాల, సీవీఎల్, భద్రం మిగితా పాత్రల్లో నటించిన వారు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

Jabardasth Shanthi Kumars Natho Nenu Movie Review and Rating

నాతో నేను సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్, సినిమాటోగ్రఫి మూవీకి బాగా ప్లస్ అయ్యాయి. సత్య కశ్యప్ అందించిన పాటలు ముఖ్యంగా రెట్రో సాంగ్, ఐటెమ్ సాంగ్ అందర్నీ ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి. చిన్నా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. మురళీమోహన్ రెడ్డి సినిమాటోగ్రఫి బాగుంది. నందమూరి హరి ఎడిటర్‌గా, పెద్దిరాజు ఆర్ట్ విభాగాల పనితీరు బాగుంది. ప్రశాంత్ టంగుటూరి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. రాజీ లేకుండా రిచ్‌గా సినిమాను రూపొందించారు.

జీవితంలో డబ్బు సంపాదనే ప్రధానం కాదు.. డబ్బుపై మోజు పెంచుకొంటే విలువైన జీవితాన్ని కోల్పోతాం. డబ్బు ఉన్నా నిరాశ, నిస్పృహతలు తప్ప చివరు మిగిలేది ఏముండదు అనే ఫిలాసఫికల్ పాయింట్‌‌తో నాతో నేను రూపొందింది. దర్శకుడు శాంతి కుమార్ ఎంచుకొన్న పాయింట్ బాగుంది. కానీ దానిని ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నంలో చిన్న తడబాటు కనిపించింది. కథ, కథనాలపై మరింత కసరత్తు చేసి ఉంటే మంచి ఎమోషనల్ ఫ్యామిలీ మూవీ అయి ఉండేదనిపిస్తుంది. లైఫ్‌కు సంబంధించి ఫిలాసఫికల్ టచ్ ఉన్న సినిమాలను ఆదరించే వారికి నాతో నేను తప్పకుండా నచ్చుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X