Calling Sahasra Review సుడిగాలి సుధీర్ హిట్ కొట్టాడా? కాలింగ్ సహస్ర సమీక్ష

Rating:
2.5/5

న‌టీన‌టులు: సుధీర్ ఆనంద్ బయానా, డాలీషా, శివబాలాజీ మనోహరన్, రవితేజ నన్నిమాల త‌దిత‌రులు
రచన, దర్శకత్వం: అరుణ్ విక్కీరాల
నిర్మాతలు: వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి, విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి
సినిమాటోగ్రఫీ: సన్నీ డి
ఎడిటర్: గ్యారీ బి.హెచ్‌
మ్యూజిక్: మోహిత్ రేహమేనియాక్, మార్క్ కె రాబిన్ (బీజీఎం)
బ్యాన‌ర్స్‌: షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్
రిలీజ్ డేట్: 2023-12-01

సైబర్ సెక్యూరిటీ నిపుణుడైన అజయ్ శ్రీవాస్తవ (సుడిగాలి సుధీర్) కొత్తగా ఉద్యోగంలో చేరుతాడు. అయితే తన జీవితంలో చోటు చేసుకొన్న విషాద ఘటన కారణంగా మరే అమ్మాయికి అన్యాయం జరగకూడదని నిర్ణయం తీసుకొంటాడు. ఆపదలో ఉన్న మహిళలను రక్షించడానికి రెస్క్యూ (RESQ) అనే యాప్‌ను కనిపెడుతాడు. ఈ క్రమంలో కొత్తగా సిమ్ కార్డును తీసుకొన్న తర్వాత గుర్తు తెలియని మొబైల్ నంబర్ నుంచి సహస్ర పేరుతో ఫోన్ కాల్స్ వస్తుంటాయి. ఈ క్రమంలో అజయ్ ఓ హత్య కేసులో ఇరుక్కొంటాడు.

అజయ్ ఇంటిలో జరిగిన విషాద సంఘటన ఏంటి? రెస్క్యూ యాప్‌ను ఎందుకు డిజైన్ చేశాడు? తనకు కాల్ చేస్తున్న సహస్ర ఎవరు? అజయ్‌కి సహస్రకు సంబంధమేమిటి? అజయ్‌ను సహస్ర ఎందుకు వెంటాడింది? అజయ్ హత్య కేసులో ఎలా ఇరుక్కొన్నాడు? హత్య కేసు ఇరుక్కొన్న తర్వాత అజయ్ ఏం చేశాడు? తన జీవితంలోకి వచ్చిన స్వాతి, సారాకు కలిగిన ముప్పు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే కాలింగ్ సహస్ర (Calling Sahasra) సినిమా కథ.

Jabardasth Sudigali Sudheers Calling Sahasra Review and Rating

దర్శకుడు అరుణ్ విక్కిరాల రాసుకొన్న పాయింట్ కొత్తగా అనిపిస్తుంది. కానీ ఆ పాయింట్‌ను స్టోరీగా మలిచి.. మంచి స్క్రీన్ ప్లేతో సినిమాను ముందుకు నడిపించడంలో కాస్త తడబాటు కనిపించింది. కథలో లవ్ స్టోరి, అమ్మాయిలపై అఘాయిత్యాలు, హీరోకు సంబంధించిన క్యారెక్టర్ మెప్పించేలా ఉన్నాయి. కానీ సినిమాకు కావాల్సిన ఎమోషన్స్, ఫీల్ మిస్ అయిందనిపిస్తుంది.

నటినటులు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్ేత.. అజయ్ పాత్ర సుధీర్‌కు కష్టతరమైంది కాకపోవడంతో సులభంగా తన పాత్రలో దూరిపోయాడనిపిస్తుంది. కీలక సన్నివేశాల్లో ఆయన ఫెర్ఫార్మెన్స్ బాగుంది. డాలీషా, స్పందన పాత్రలు పర్వాలేదనిపిస్తాయి. ఇక ఈ సినిమాలో శివ బాలాజీ సర్‌ప్రైజింగ్ రోల్‌లో కనిపిస్తారు. మిగితా పాత్రల్లో నటించిన వారి ఒకే అనిపించారు.

Jabardasth Sudigali Sudheers Calling Sahasra Review and Rating

సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. మార్క్ కే రాబిన్ అందించిన రీరికార్డింగ్ బాగుంది. అలాగే మోహిత్ ఇచ్చిన పాటలు కథకు తగినట్టు ఉన్నాయి. గ్యారీ బీ హెచ్ ఎడిటింగ్, సన్నీ డీ సినిమాటోగ్రఫి ఫర్వాలేదనిపిస్తుంది. వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి, విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సస్పెన్స్, థ్రిల్లర్స్‌కు, నావెల్టీ పాయింట్‌తో వచ్చే సినిమాను ఆదరించే వారికి ఈ మూవీ నచ్చుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X