Don't Miss!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్‌కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్‌లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Travel గుడ్‌ప్రైడే రోజున లాంగ్‌వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్‌లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
ప్రకాశించని జాబిలి
చిత్రం: జాబిలి
నటీనటులు: దిలీప్, రేఖ, ఎమ్మెస్ నారయణ, చలపతి, చంద్రమోహన్
నిర్మాత: అర్జునరాజు
కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి
యూత్ చిత్రాలు విజయవంతమవుతున్నాయని అందరూ అదే దారి పడుతున్నారు. ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రాలు తీసి..ఈ మధ్య చేతులు కాల్చుకున్న దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కూడా ఇదే రూట్ ఎన్నుకున్నాడు. కానీ రూట్ మారినంతా మాత్రానా స్టైల్ మారుతుందా? ఫలితం: అతి సాధారణ రోటీన్ చిత్రం. ఇప్పటి యూత్ చిత్రాల మాదిరిగానే కాలేజ్ నేపథ్యంలో జాబిలి చిత్రాన్ని తీసినా, ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశం లేదు. యూత్ నేఫథ్యం కాదు, కొత్తదనం ముఖ్యం అని దర్శకులు ఎప్పుడు తెలుసుకుంటారో! ఇది ఫక్కా ఎస్వీ కృష్టారెడ్డి చిత్రం. కాకపోతే సెంటిమెంట్ లేదు. మిగతా అంతా రోటీన్ చిత్రం. సినిమాలో ఎక్కడా 'ఫీల్ ' లేదు. అన్ని పాత జోకులో. అన్ని ప్రిడిక్టబుల్ సీన్సే. సినిమా పరిభాషలో 'వండడం' అనే పదం పాపులర్. ఇప్పుడు వస్తున్న చిత్రాల్లోని ముఖ్యమైన సీన్స్ తీసుకొని వండిన చిత్రం అని చెప్పవచ్చు. అంతే. అంతకన్నా ఇంకా ఏమీలేదు ఈ చిత్రంలో. సంగీతం మాత్రం వినడానికి బాగుంది.
దిలీప్, రేఖ కాలేజ్ మేట్స్. వీరికో గ్యాంగ్. వీరంతా పిచ్చిపిచ్చిగా జోకులు వేసుకుంటూ, కాలేజ్ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. సడెన్ గా హీరో గారికి ఎందుకో రేఖని ప్రేమించాలనిపిస్తుంది. సో..ప్రేమిస్తాడు. హీరోయిన్ కూడా పనేమీ లేదు కాబట్టి ప్రేమిస్తుంది. కానీ వీరి తల్లితండ్రులు ఒప్పుకోరు. ఇక బాగా డబ్బు సంపాదించి ప్రయోజకులమై, తల్లితండ్రులకు తమ సత్తా నిరూపించాలని అనుకుంటారు. వీరి కోసమే అన్నట్లు, వీరి ఫ్రెండ్ తండ్రి చనిపోతాడు. ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్. సో..ఆ వ్యాపారాన్ని వీరు చేపట్టి డెవలప్ చేస్తారు. ప్రేమ అంటే బైక్ ల మీద తిరగడమే కాదు 'శ్రమ దానం' కూడా చేయాలన్నది ఈ సినిమా పాయింట్.
దిలీప్ ను తెరపై చూస్తుంటే ఒకప్పుడు ఎస్వీ కృష్ణారెడ్డి పరిచయం చేసిన లైలా గుర్తుకువస్తుంది. ఇద్దరూ చక్కగా నవ్వుతారు. అంతే. అంతకుమించి వారికి ఏమీ రాదు. ఇక మాటలే మాత్రం సింక్ కాలేదు. రేఖ బాగానే చేసింది. సంగీతం వినడానికి బాగుంది. కానీ సినిమాలో అర్థంపర్థం లేకుండా వస్తాయి.