Jack Movie Review: జాక్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: సిద్దూ జొన్నలగడ్డ, వైష్ణవీ చైతన్య, ప్రకాశ్ రాజ్, వీకే నరేష్, రవి ప్రకాశ్, రాహుల్ దేవ్, బ్రహ్మాజీ తఇదితరులు
దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్
నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి, అచ్చు రాజమణి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సామ్ సీఎస్
సినిమాటోగ్రఫి: విజయ్ కే చక్రవర్తి
ఎడిటింగ్: నవీన్ నూలి
బ్యానర్: శ్రీవెంకటేశ్వర్ సినీ చిత్ర
రిలీజ్: 2025-04-10
పాబ్లో నెరుడా అలియాస్ జాక్ (సిద్దూ జొన్నలగడ్డ) అన్ని విషయాల్లో ఆరితేరిన యువకుడు. కానీ తనకు ఇష్టమైన ఉద్యోగం కోసం వచ్చి అవకాశాలన్నీ వదులుకొంటాడు. చివరకు రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ (RAW) లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కోసం వెళ్తాడు. దేశంలో అశాంతికి కారణమయ్యే ఉగ్రవాదులపై కన్నేస్తాడు. తనదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. రా ఆధికారి మనోజ్ (ప్రకాశ్ రాజ్) పోటీగా నిలుస్తాడు.

చిన్నతనంలో అన్ని విషయాల్లో ప్రతిభను చాటుకొన్న జాక్ ఏ అంశంలోను ఎందుకు సెటిల్ కాలేకపోతాడు? రా ఉద్యోగం కోసమే ఎందుకు ప్రయత్నిస్తాడు? రా విభాగంలో జాక్ ఉద్యోగం లభించిందా? ఉగ్రవాదులపై జాక్ ఎందుకు కన్నేశాడు? టెర్రరిస్టులను పట్టుకొని జాక్ ఏం చేశాడు? చివరకు తన లక్ష్యాన్ని జాక్ చేరుకొన్నాడా? అనే సింపుల్ ప్రశ్నకు సమాధానమే జాక్ సినిమా కథ.
దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ రాసుకొన్న పాయింట్‌లో బేసిక్‌గా స్కోప్ లేకపోయింది. ఆ పాయింట్ విస్తరించడానికి అవకాశాలు తక్కువగా ఉండటంతో సింగిల్ పాయింట్‌తో స్క్రీన్ ప్లేతో కథను నడిపించాలనే ప్రయత్నం కనిపించింది. ఫస్టాఫ్‌ను గ్రిప్పింగ్‌నే చెప్పాడు. కానీ బలమైన సన్నివేశాలు లేకపోయినా.. తనదైన శైలిలో స్క్రీన్ ప్లేతో నెట్టుకు వచ్చాడు. ఇక సెకండాఫ్‌లో ఏం చేయాలన్న విషయంలో క్లారిటీ లేకపోవడంతో చివరకు ఏదో ఒకలా ముగింపు ఇచ్చేందుకు తంటాలు పడ్డారనిపిస్తుంది. ఐడియా బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ అసలు సమస్యగా కనిపించింది.
ఇక డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకొన్న సిద్దూ జొన్నలగడ్డ ఈ తరహా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం కొంత ఆశ్చర్యం కనిపిస్తుంది. అయితే బలహీనమైన స్క్రిప్టును కూడా తన స్క్రీన్ ప్రజెన్స్, బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌తో మెప్పించాడు. సహాజంగా చెప్పే డైలాగ్స్ తన క్యారెక్టర్‌కు ఈ సినిమాలో ప్లస్ అయింది. సిద్దూ లుక్, స్టైల్ బాగుంది. కానీ బలమైన క్యారెక్టర్ లేకపోవడమే మైనస్‌గా కనిపిస్తుంది. జాక్ క్యారెక్టర్‌కు అసలు పర్పస్ ఏమిటనే విషయంలో అనేక సందేహాలు కనిపిస్తాయి. బేబీ తర్వాత వైష్ణవీ చైతన్య కోసం వెళితే.. నిరాశే మిగులుతుంది. సినిమాలో ఆమె నటించడానికి స్కోప్, గ్లామర్ పండించడానికి అవకాశం లేకపోవడంతో తను ఏమీ చేయలేకపోయింది. ప్రకాశ్ రాజ్ పక్కా రొటీన్ పాత్రగా ఉంటుంది. బ్రహ్మజీ, సుబ్బరాజ్ పాత్రలు పెర్ఫార్మ్ చేయడానికి స్కోప్ లేకపోయింది. మిగితా పాత్రల్లో కనిపించిన వారంతా వారి వారి క్యారెక్టర్ల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. విజయ్ కే చక్రవర్తి సినిమాటోగ్రఫి, సామ్ సీఎస్ బీజీఎం, నవీన్ నూలి ఎడిటింగ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్, పాటలకు స్కోప్ లేకపోయింది. టైటిల్ సాంగ్ పర్వాలేదనిపిస్తుంది. డ్యూయెట్ సాంగ్ పెద్దగా కిక్కిచ్చేలా కనిపించలేదు. శ్రీ వెంకటశ్వర సినీ చిత్ర బ్యానర్ తగిన విధంగా ప్రమాణాలను పాటించారు. సినిమా మేకింగ్ విషయంలో ఎలాంటి రాజీ కనిపించలేదు. మూవీ ఫుల్ రిచ్‌గా ఉంటుంది. కథ, కథనాలపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే ఇంకాస్త మంచి ఫలితం వచ్చి ఉండేదనిపిస్తుంది.
మదర్ సెంటిమెంట్ పాయింట్‌తో యాక్షన్ కామెడీగా తెరకెక్కిన చిత్రం జాక్. అయితే మదర్ సెంటిమెంట్ ఆధారంగా కథను నడిపించడానికి స్కోప్ ఉన్నా.. ఆ పాయింట్‌ను ఎందుకు విస్మరించారో అర్ధం కాని విషయం. కథలో బలం లేకపోవడం వల్ల స్క్రీన్ ప్లే ద్వారా సినిమాను లాగిద్దామనే ప్రయత్నం స్పష్టంగా కనిపించింది. సిద్దూ జొన్నలగడ్డ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. వైష్ణవీ చైతన్య తన అభిమానులకు నిరాశను మిగిల్చిందనే చెప్పాలి. సరైన కథ లేకుండా బొమ్మరిల్లు భాస్కర్ చేసిన ప్రయోగం అంతగా ఆకట్టుకొనేలా లేదనే చెప్పాలి. బీ, సీ సెంటర్ల ఆడియెన్స్ ఆదరించడంపైనే ఈ సినిమా సక్సెస్ ఏ రేంజ్ అనేది తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











