Jack Twitter Review: జాక్ మూవీ ట్విట్టర్ రివ్యూ
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలో హిట్లు కొట్టిన స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ, బేబీ ఫేమ్ వైష్ణవీ చైతన్య జంటగా నటించిన సినిమా జాక్. ఈ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, రవి ప్రకాశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమాను టాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించారు. ఈ సినిమాపై నెటిజన్లు సోషల్ మీడియాలో వెల్లడించిన అభిప్రాయాలు, రివ్యూల వివరాల్లోకి వెళితే..

జాక్ సినిమా చూశాను. యావరేజ్‌గా ఉంది. సిద్దూ జొన్నలగడ్డ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాను కాపాడిందని చెప్పాలి. బొమ్మరిల్లు జోన్‌లోనే ఈ సినిమా కథ ఉండటం ఓ పాజిటివ్ అంశం. ఈ సినిమాకు సిద్దూ, కామెడీ సీన్లు, బీజీఎం పాజిటివ్ అంశాలు. వీఎఫ్ఎక్స్ వర్క్ బాగాలేకపోవడం వల్ల కనెక్ట్ కాలేకపోతారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
జాక్ సినిమా సగం ఉడకని వంటలాగుంది. రా అంటే రాయల్‌గా చూపించాలి. ఇలా రోతగా చూపించకూడదు. ప్రతీసారి వన్ లైనర్‌తో సినిమా వర్కవుట్ అవదని ఇంకా ఎప్పుడు అర్ధం అవుతుందో. ఇంత చెప్పినా థియేటర్‌లో చూస్తా అంటే మా లాగా బుగ్గ అవ్వండి అని ఓ నెటిజన్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
జాక్ సినిమా చూశాను. చాలా బోరింగ్‌గా ఉంది. ఈ సినిమాకు నా రేటింగ్ 2 అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడుే.
జాక్ ట్రైలర్ చాలా ఫన్‌గా ఉంది. రిప్రెషింగ్‌గా ఉంది. విభిన్నమైన సినిమా బొమ్మరిల్లు భాస్కర్ నుంచి వస్తుందని ఆశిస్తున్నాను అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
జాక్ సినిమా చూశాను. సెకండాఫ్‌లో లాజిక్ లేని సీన్లు ఉన్నాయి. కథపరంగా సరిగా వర్కవుట్ కాలేదు. ఈ సినిమాకు నా రేటింగ్ 2.25 అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
జాక్ సినిమా రిలీజ్ నేపథ్యంలో హీరో సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్‌లో విషెస్ అందించారు. సిద్దూ బ్రో.. ఆరెంజ్ నుంచి జాక్ వరకు మీ జర్నీ నిజంగా స్పూర్తిని కలిగిస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్, మీకు ఈ సినిమా భారీ విజయాన్ని అందించాలని కోరుకొంటున్నాను. వైష్ణవీ చైతన్య, బీవీఎస్ఎన్ ప్రసాద్ గారికి, బాపినీడు గారికి, చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అని ట్వీట్ ద్వారా విషెస్ అందించారు.
జాక్ సినిమాపై అంచనాలు పెరగడంతో భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఒక కోటి రూపాయల కలెక్షన్లు సాధించింది. సిద్దూ జొన్నలగడ్డ కెరీర్‌లోనే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. ఈ సినిమాకు 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకొన్నారు. అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ చూస్తే.. కొంత మెరుగ్గా ఉండాల్సిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











