JVAS Re Release Review: జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ రివ్యూ

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సీ అశ్వినీదత్ నిర్మించిన చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, లెజెండరీ హీరోయిన్, స్వర్గీయ శ్రీదేవీ జంటగా నటించారు. ఈ సినిమా 1990 సంవత్సరంలో మే 9వ తేదీన రిలీజై ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమా మళ్లీ 26 ఏళ్ల తర్వాత రీ రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా గురించిన రివ్యూ, ఇతర విశేషాల వివరాల్లోకి వెళితే..

రాజు (చిరంజీవి) అనే టూరిస్ట్ గైడ్ కొంత మంది అనాథ పిల్లలని చేరదీసి పెంచుతుంటాడు. తన వద్ద ఉన్న పిల్లల్లో ఓ చిన్నారి గాయపడుతుంది. ఆ గాయం నయం కావాలంటే హిమాలయల్లో దొరికే అరుదైన వైద్య మూళికలను తీసుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో రాజు హిమాలయకు వెళ్తాడు. అప్పుడే దేవలోకం నుంచి భూలోకం వచ్చిన అతిలోక సుందరి ఇంద్రజ (శ్రీదేవీ) తన చేతికి ఉన్న మహిమ గల ఉంగరాన్ని జార విడుచుకొంటుంది. దాంతో దేవలోకానికి వెళ్లడానికి సమస్య ఎదురువుతుంది.

JVAS Re Release Review

ఇంద్రజ ఉంగరం రాజు వద్దకు ఎలా వచ్చింది? ఆ ఉంగరాన్ని చేజిక్కించుకొని దేవలోకానికి వెళ్లడానికి ఇంద్రజ ఎలాంటి ఎత్తులు వేసింది? ఆ ఉంగరం కోసం ఓ మాఫియా ముఠా (రాంరెడ్డి, కన్నడ ప్రభాకర్, తనికెళ్ల భరణి) ఎలాంటి ప్రయత్నాలు చేశారు? మహాద్రష్ట (అమ్రిష్ పురి) అనే మాంత్రికుడు ఇంద్రజను ఎందుకు బలి ఇచ్చే ప్రయత్నం చేశాడు? చిన్నారికి గాయం నయమైందా? ఇంద్రజతో రాజు ప్రయాణం ఎలా సాగింది అనే ప్రశ్నలకు సమాధానమే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కథ.

ఇంద్రలోకం నుంచి వచ్చిన అతిలోక సుందరి, భూలోకంలో ఉన్న టూరిస్టు రాజును ఎలా కలిసింది? వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా కొనసాగింది అనే పాయింట్స్ ఆధారంగా చేసుకొని జంధ్యాల, యండమూరి, సత్యమూర్తి, సత్యానంద్ తదితరులు రాసిన కథ, సన్నివేశాలు, స్క్రీన్ ప్లేతో దర్శకుడు రాఘవేంద్రరావు వెండితెర మీద అద్బుతమే సృష్టించారని చెప్పాలి. చిరంజీవి మాస్ ఎలిమెంట్స్, శ్రీదేవి అందచందాలు సినిమాకు ప్రధానంగా హైలెట్. ఇక అమ్రీష్ పురి విలనిజం, రాంరెడ్డి, తనికెళ్ల భరణి సపోర్టింగ్ క్యారెక్టర్లు సినిమాలోని యాక్షన్, మాస్ పార్ట్‌కు బలంగా మారాయి.

చిరంజీవి, శ్రీదేవీ కలిసి చేసిన డ్యాన్సులు, వేసిన స్టెప్పులు నభూతో నభవిష్యత్. ఇళయ రాజా సంగీతంలో వచ్చిన పాటలు ఇప్పటి తరానికి కూడా గిలిగింతలు పెడుతాయి. ఒక్కోపాట చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. విన్సెంట్, కేఎస్ ప్రకాశ్ కెమెరా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ఈ సినిమాకు మరో రేంజ్‌లో నిలబెట్టాయి. అశ్వినీదత్ పాటించిన నిర్మాణ విలువలు అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఈ సినిమా కోసం వేసిన సెట్స్ దక్షిణాదిలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి.

జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాను అప్పట్లో భారీగా అంటే.. 2 కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందించారు అని ట్రేడ్ వర్గాలు చెప్పుకొంటాయి. ఈ సినిమా రిలీజైన ప్రతీ సెంటర్‌లోను కలెక్షన్ల కుంభవృష్టిని కురిపించింది. భీభత్సమైన తుఫాన్ పరిస్థితులను ఎదురించి ఈ సినిమా పలు చోట్ల శత దినోత్సవం, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ సాధించి రికార్డు కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాను ప్రస్తుతం 4K క్వాలిటీతో 3డీ, 2డీ టెక్నాలజీతో తీసుకొస్తున్నారు. ఈ తరం ప్రేక్షకులకే కాకుండా అప్పటి తరం వారికి ఈ సినిమా మరోసారి కొత్త అనుభూతిని పంచే అంశాలు చాలానే ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X