twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జీవం లేని 'జగపతి'

    By Staff
    |

    Jagapathi
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: జగపతి (ఏ సెంటరైనా ఓకె)
    విడుదల: 24-6-05
    నటీనటులు: జగపతిబాబు, రక్షిత, నవనీత్‌ కౌర్‌,
    సాయి కిరణ్‌, ప్రదీప్‌ రావత్‌, తనికెళ్ళ భరణి, సలీమ్‌ బేగ్‌,
    సుబ్బరాజు, కృష్ణ భగవాన్‌, కొండవలస లక్ష్మణరావు, దువ్వాసి మోహన్‌,
    ఎంఎస్‌ నారాయణ, చలపతిరావు, చంద్రమోహన్‌, సుధ, రాజారవీంద్ర తదితరులు.
    సంగీతం: ఎంఎం కీరవాణి
    మాటలు: జనార్ధన్‌ మహర్షి
    మూల కథ: విఎస్‌ శరవణన్‌
    పాటలు: చంద్రబోస్‌
    కెమెరా: వి.జయరాం
    ఎడిటింగ్‌: కళాభాస్కర్‌
    ఫైట్స్‌: విజయ్‌, రామ్‌-లక్ష్మణ్‌
    నిర్మాతలు: ఎం.రామలింగరాజు, వి.సత్యనారాయణ రాజు
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జొన్నలగడ్డ శ్రీనివాసరావు

    ఎంత బలహీనమైన కథ అయినా స్క్రీన్‌ప్లే బాగుంటే సినిమా విజయవంతమవుతుంది. జగపతి బాబు 'జగపతి'కి స్క్రీన్‌ప్లే నెగిటివ్‌ ఫలితాన్ని ఇచ్చింది. హీరో పాత్ర పాసివ్‌గా మారిపోవడం, కథ అంతా రక్షిత చుట్టూ తిరగడంతో సినిమా జీవం కోల్పోయింది.ు

    జగపతి (జగపతిబాబు) ఒక చిన్ని విలేజి పోలీసుస్టేషన్‌లో ఒక పోలీసు అధికారి. స్ధానిక ఎమ్మెల్యే నాగరాజ్‌ గౌడ్‌ (ప్రదీప్‌ రావత్‌) అడుగులకు మడుగులొత్తుతూ, అవినీతికి పాల్పడుతుంటాడు. పోలీసు స్టేషన్‌ను బార్‌లాగా మార్చుకుంటాడు. ఈ రౌడీ పోలీసును మార్చడానికి లావణ్య (రక్షిత) వస్తుంది. అనతికాలంలోనే జగపతిలో మానవత్వాన్ని ఆమె నిద్ర లేపగలుగుతుంది. అప్పటి నుంచి హీరో ఎమ్మెల్యే ఆగడాలను ఎదుర్కొంటూ ఉంటాడు. ఆ తర్వాత ఎప్పటికో తెలుస్తుంది లావణ్య భర్తను జగపతే చంపేశాడని. ఈ సినిమా కథలో చక్కటి సస్పెన్స్‌ ఇమిడి ఉంది. కానీ సరిగా హ్యాండిల్‌ చేయకపోవడం వల్ల సినిమా నీరుగారిపోయింది.

    అసలు జగపతి రౌడీగా ఎలా మారాడన్నది చూపించకుండా అతను ఎలా మారాడో చిత్రీకరించారు. బ్యాక్‌గ్రౌండ్‌ ఎస్టాబ్లిష్‌ కాకపోవడం వల్ల జగపతి క్యారెక్టర్‌ బలహీనమైపోయింది. ఇది స్క్రిప్ట్‌ లోపం. జగపతిగా జగపతి బాబు నటన బాగుంది. ఇటువంటి పాత్రలు ఆయనకు కొట్టినపిండి. అయితే సినిమాను మాస్‌ ప్రేక్షకులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని తీసినట్టు కన్పిస్తుంది. పాపం, సినిమా రెంటికి చెడిన రేవడి అయిపోయింది. వ్యాంప్‌గా నటించిన నవనీత్‌ కౌర్‌ వల్ల సినిమాకు ఏమాత్రం లాభం జరగలేదు. విలన్‌గా ప్రదీప్‌ రావత్‌ మెకానికల్‌గా నటించాడు. సినిమాకు క్లైమాక్స్‌ హైలైట్‌ అని ప్రచారం చేసుకున్నారు గానీ అంత సీన్‌ కన్పించలేదు. ఒక సీన్‌లో గ్రామం బోర్డు పులిచెర అని ఉండాల్సింది పులివెందుల అని స్పష్టంగా కన్పిస్తుంది. ఇది దర్శకుడి నిర్లక్ష్యానికి నిదర్శనం. తనికెళ్ళ భరణి కథకు పనికి రాలేదు. హీరో ఏవో వండర్స్‌ చేస్తాడని ప్రేక్షకులు ఎదురుచూసి నిరాశకు గురవుతారు. హీరో పాత్ర పాసివ్‌గా మారిపోవడమే ఈ సినిమాలోని ప్రధానలోపం. ఏమీ తోచకపోతే, మరో మార్గం లేకపోతే ఈ సినిమా చూడవచ్చు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X