twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమర్షియల్‌ దేశభక్తికి 'జై'

    By Staff
    |

    Jai
    చిత్రం: జై
    నటీనటులు: నవదీప్‌, సంతోషి, తనికెళ్ళ భరణి,
    వేణుమాధవ్‌, అభినయశ్రీ, తదితరులు
    సంగీతం: అనూప్‌
    కథ, మాటలు, నిర్మాత, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజ

    భావోద్వేగాలను రేకెత్తేంచి హిందూ-ముస్లిం, భారత్‌-పాక్‌ అంశాలను పెట్టుకొని కమర్షియల్‌గా టైట్‌ స్క్రీన్‌ప్లేతో సినిమా రూపొందిస్తే మినిమమ్‌ గ్యారెంటీ అని భారతీయ సినిమా ఇండస్ట్రీలో నమ్మకం పాతుకుపోయింది. ఇదే ఫార్మూలాను తేజ 'జై' చిత్రంలో విజయవంతంగా అమలు చేశాడు. కొత్త సీసాలో పాత సారాను నింపడంలో కృతకృత్యుడయ్యాడు. సెకాండాఫ్‌లో ఈ పాకిస్థాన్‌-భారత్‌ కోణాన్ని కమర్షియల్‌గా బాగా చెప్పడంతో పాటు, కొత్త జంట నవదీప్‌, సంతోషిల చక్కటి నటన, అనూప్‌ ప్రతిభావంతమైన సంగీతం, రీరికార్డింగ్‌ బాగా కలిసింది. ఇవీ కమర్షియల్‌గా సినిమా గురించి చెప్పుకోదగ్గ అంశాలు.

    ఐతే, క్రిటికల్‌గా చెప్పాలంటే సినిమాలో అడుగడుగునా భావదారిద్య్రం కన్పిస్తుంది. సక్సెస్‌ కోసం దర్శకుడు కృష్ణవంశీ 'ఖడ్గం' లో ఇదే రెటోరిక్‌ (అదే సోది)ను వాడుకున్నట్లు తేజ అదే పనిచేశాడు. భావోద్వేగాల కమర్షియల్‌ ఎక్స్‌ప్లాయేటేషన్‌. ఏ సినిమాకు ఆ సినిమా అప్పటివరకు ఆసక్తిని కలిగిస్తే చాలనుకునే ప్రస్తుత ధోరణిలో ఆలోచిస్తే సినిమా బాగుందనే చెప్పాలి. సెకాండాఫ్‌ సినిమాకు అసలు, సిసలు ప్రాణం.

    కథ విషయానికొస్తే, జైరామ్‌(నవదీప్‌) పందొమ్మిదేళ్ళ కాలేజ్‌ కుర్రాడు. తల్లి పెద్ద బిజినెస్‌ ఉమెన్‌. ప్రేమరాహిత్యంతో నవదీప్‌ బాధపడుతుంటాడు. జైరామ్‌ను తొలిచూపులోనే ఫరా (సంతోషి) ప్రేమిస్తుంది. కాలేజ్‌ విలన్‌ను ఎదుర్కొనేందుకు బాక్సింగ్‌ నేర్చుకోవాలని ఫరా జైరామ్‌ను ఒప్పించి, తన తండ్రి(తనికెళ్ళ భరణి) కోచింగ్‌ ఇచ్చేలా ఒప్పిస్తుంది. జైరామ్‌ తల్లి పాకిస్థాన్‌-భారత్‌ల మధ్య బాక్సింగ్‌ పోటీలను హైదరాబాద్‌లో జరిగేలా చూస్తుంది. ఆ పోటీలో భారత్‌ ఆటగాళ్ళు ఓడిపోతారు.

    ఆ సందర్భంగా పాకిస్థాన్‌ ఆటగాడు..భారత్‌లో మగాళ్లే లేరని హేళన చేయడంతో హీరో రెచ్చిపోయి...యాభై రోజుల్లో బాక్సింగ్‌ నేర్చుకొని వాడిని ఓడిస్తానని శపథం చేస్తాడు. హీరో ఇరవై రోజుల్లోనే బాక్సింగ్‌ బాగా నేర్చుకున్నాడని తెలుసుకున్న పాకిస్తాన్‌లోని ఐ ఎస్‌ ఐ కేంద్రంలోని ఓ తీవ్రవాద నాయకుడు ఇతని చేతి, పక్కటెముకలు విరిగేలా కొట్టిస్తాడు. ఇక చేతి విరిగిన హీరో...భారతదేశం పరువును ఎలా నిలబెట్టాడనేది క్లైమాక్స్‌.

    సినిమాటిక్‌గా సెకాంఢాఫ్‌ బాగుంది. కానీ నువ్వు-నేను, జయం చిత్రాల తాలూకు (అవే పాత సినిమాల కాపీ చిత్రాలు)పభావం నుంచి దర్శకుడు తేజ బయటపడలేదనిపిస్తోంది. హీరోనో (నువ్వునేను), హీరోయినో (చిత్రం) ప్రేమరాహిత్యంతో బాధపడడం, తండ్రో, తల్లో వ్యాపార వ్యవహారాలు పట్టించుకోవడం వంటి కథనే మళ్ళీ, మళ్ళీ రుద్దుతున్నాడు. కాలేజ్‌లో దృశ్యాలు మరీ చవకబారుగా ఉన్నాయి.

    స్వీపర్‌తో కాలేజ్‌లో పాఠాలు (అభినయశ్రీ) చెప్పించడం..వంటి దృశ్యాలను చూస్తే సినిమావాళ్ళ పరిజ్ఞానానికి బాధేస్తుంది. కొత్త హీరో, హీరోయిన్‌ జంట చూడడానికి బాగున్నారు. నటన కూడా బాగా చేశారు. పాటల కన్నా నూతన సంగీత దర్శకుడు అనూప్‌ రీరికార్డింగ్‌ చాలా బాగుంది. ఇలాంటి చిత్రాల్లో దర్శకుడి గొప్పతనం ఏమీ ఉండదు, దేశభక్తి రగిలేలా సీన్లను 'పిండడమే'.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X