Jailer Telugu Movie Review భావోద్వేగమైన ఫ్యామిలీ డ్రామా..రజనీ వన్ మ్యాన్ షో.. జైలర్ మూవీ రివ్యూ!

Rating:
3.0/5
Star Cast: Rajinikanth, Mohanlal, Shiva Rajkumar, Jackie Shroff, Sunil, Tamannaah Bhatia, Ramya Krishnan
Director: Nelson Dilipkumar

నటీనటులు: రజినీకాంత్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్‌ కుమార్, నాగబాబు, తమన్నా భాటియా, సునీల్, రమ్యకృష్ణ, వినాయకన్, మిర్నా మీనన్, వసంత్ రవి, యోగిబాబు తదితరులు
దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్
నిర్మాత: కళానిధి మారన్
సినిమాటోగ్రఫి: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటింగ్: ఆర్ నిర్మల్
మ్యూజిక్: అనిరుధ్ రవిచంద్రన్
బ్యానర్: సన్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2023-08-10

టైగర్ ముత్తు పాండ్యన్ (రజనీకాంత్) రిటైర్డ్ జైలర్. భార్య, కొడుకు, కోడలు, మనవడు ( రమ్యకృష్ణ, వసంత్ రవి, మిర్నా మీనన్)తో ప్రశాంతంగా కాలం గడుపుతుంటాడు. పోలీస్ ఆఫీసరైన కొడుకు ( వసంత్ రవి) ఆలయంలో దేవుడి విగ్రహం చోరీ గురించిన కేసును దర్యాప్తు చేస్తుంటారు. ఈ క్రమంలో విగ్రహాలను అక్రమంగా తరలించే ముఠా నాయకుడు (వినాయన్) చేతిలో ముత్తు కుమారుడైన పోలీస్ ఆఫీసర్‌ను మాఫియా ముఠా చంపేస్తుంది. నిజాయితీగా ఉద్యోగం చేసే తన కొడుకును చంపిన మాఫియా ముఠాపై ముత్తు ప్రతీకారం తీర్చుకొనేందుకు సిద్దమవుతాడు?

Jailer Telugu Movie Review and Rating: Rajinikanths family and Emotional drama on Temple backdrop

జైలర్ ముత్తు గత జీవితం ఏమిటి? తీహార్ జైలులో ముత్తు ఉద్యోగం ఎలా చేశాడు? ముత్తుకు నరసింహ (శివరాజ్ కుమార్)‌కు కనెక్షన్ ఏమిటి? ముత్తుకు మ్యాథ్యూస్ (మోహన్ లాల్) సంబంధమేమిటి? ఉత్తరాదిలో మాఫియా డాన్ (జాకీ ష్రాఫ్)తో ముత్తుకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? మంగళగిరిలోని ఆలయానికి సినీ నటుడు బ్లాస్ మోహన్ (‌సునీల్)కు సంబంధం ఏమిటి? సినీ నటుడు బ్లాస్ మోహన్‌కు కామ్నా (తమన్నా భాటియా)కు సంబంధం ఏమిటి? మంగళగిరి ఆలయంలోని అరుదైన కిరిటాన్ని ముత్తు ఎందుకు దొంగిలించాలని ప్లాన్ చేశాడు? విగ్రహాల అక్రమ రవాణా చేసే మాఫియా ముఠా నాయకుడి సామ్రాజ్యాన్ని ముత్తు ఎలా దెబ్బ తీశాడు? మరణించిన తన కొడుకుకు సంబంధించిన ఓ షాకింగ్ నిర్ణయం తెలిసిన తర్వాత ముత్తు ఎలాంటి ప్లాన్ వేశాడు? అనే ప్రశ్నలకు సమాధానమే జైలర్ (Jailer Telugu Movie Review) సినిమా కథ.

నిజాయితీగా బతకడమే కాకుండా ఉద్యోగంలో విలువలు పాటించాలనే ఓ రిటైర్డ్ అధికారి ఫ్యామిలీకి ఎదురైన కష్టాలను పాయింట్‌ను కథగా మలచుకొని.. వాటికి ఎమోషనల్ అంశాలను దట్టించిన తీరుతో దర్శకుడు నెల్సన్ మరోసారి తన ప్రతిభను చాటుకొన్నాడు. రజనీకాంత్ పాత్రను మలిచిన తీరు, ముత్తుగా రజనీ గెటప్‌ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. అలాగే పక్కాగా నరసింహా, మ్యాథ్యూస్, బ్లాస్ మోహన్, కామ్నా, ఇతర పాత్రలను కథలోకి తీసుకొచ్చి సినిమాను కమర్షియల్‌గా నడిపించిన తీరు సినిమాకు మరో హైలెట్‌గా మారింది. ఫస్టాఫ్‌ కొంత స్లోగా నడిచినప్పటికీ.. కామెడీతో సినిమాను నడిపించిన విధానం బాగుంది. (Jailer Telugu Movie Review) సీరియస్‌గా ఉండే రజనీ పాత్ర స్వభావంతో హాస్యాన్ని అందించిన తీరు ప్రేక్షకుడికి మంచి ఫీల్‌ను కలిగిస్తుంది.

Jailer Telugu Movie Review and Rating: Rajinikanths family and Emotional drama on Temple backdrop

ఇక (Jailer Telugu Movie Review) సెకండాఫ్‌లో మాస్, కమర్షియల్ ప్రేక్షకులకు పండుగలా ఉంటుంది. సినిమా రెండో భాగంగా సునీల్, బ్లాస్ మోహన్, మ్యాథ్యూస్, జాకీ ష్రాఫ్ పాత్రలతో కథ నడిపించిన విధానం బాగుంది. అయితే సునీల్, తమన్నా మధ్య నడిచే ట్రాక్ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో సినిమా కాస్త డీలా పడినట్టు అనిపిస్తుంది. కానీ వ్యక్తిగతంగా సునీల్ పాత్ర, తమన్నా గ్లామర్ మెప్పించేలా ఉంటాయి. సినిమా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్‌ వరకు నడిచే డ్రామా ఎమోషనల్‌గా ఉండటంతో భావోద్వేగానికి గురిచేస్తుంది. సెకండాఫ్‌లో పడుతూ లేస్తూ సాగే కథ కొంత ఇబ్బందికి గురి చేసేలా ఉంటుంది.

ఇక నటీనటులు ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జైలర్ (Jailer Telugu Movie Review) వింటేజ్ లుక్‌తో రజనీ కొత్తగా కనిపించారు. తీహార్ జైలు ఎపిసోడ్‌లో పాత రజనీని చూసే అవకాశం కలుగుతుంది. ఇక ఫ్యామిలీ కోసం ప్రాణాలు పణంగా పెట్టే రిటైర్డ్ జైలర్‌గా చాలా హుందాగా, గౌరవప్రదమైన క్యారెక్టర్‌లో జీవించారు. రజనీ గెటప్, బాడీ ల్వాంగేజ్ ఫ్యాన్స్‌కు పండుగలా ఉంటుంది. మిగితా క్యారెక్టర్లలో కామెడీ టచ్‌తోపాటు కథకు కీలకంగా ఉండే ట్రాక్‌లో సునీల్ క్యారెక్టర్ ఆకట్టుకొంటుంది. తమన్నాతో కలిసి సెకండాఫ్‌లో హ్యూమర్‌ను పడించే ప్రయత్నం చేశారు.

Jailer Telugu Movie Review and Rating: Rajinikanths family and Emotional drama on Temple backdrop

శివ రాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం పెట్టిన క్యారెక్టర్స్ అని చెప్పవచ్చు. కథలో కీలకమే కాని.. గొప్పగా గుర్తుండిపోయే పాత్రలు మాత్రం కాదు. ఇక ప్రధాన విలన్‌గా నటించిన వినాయక్ తన ప్రతిభతో సినిమాకు ప్లస్ అయ్యారనే చెప్పాలి. నాటు విలనిజంతో తన పాత్రను బాగా పడించాడు. కొత్త రకమైన హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌తో రజనీతో పోటాపోటీగా వినాయకన్ నటించాడు. ఇక సినిమాలో కీలక ట్విస్ట్‌గా ఉండే పాత్రలో రజనీకాంత్ కొడుకుగా నటించిన వసంత్ రవి మెప్పించాడు. యోగిబాబు తనదైన కామెడీతో తన పని తాను చేసుకొంటూ వెళ్లిపోయాడు. మిగితా పాత్రల్లో నటించిన వారు వారి పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ మరో హైలెట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సన్నివేశాలనే కాకుండా సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాడు. కేవలం బీజీఎం కారణంగా కొన్ని నాసిరకమైన సీన్లు కూడా ఎలివేట్ అయ్యేలా చేశారు. ఇక విజయ్ కార్తీక్ కన్నన్ అందించిన సినిమాటోగ్రఫి అదనపు ఆకర్షణ. ఇతర విభాగాల పనితీరు కూడా బాగుంది. సన్ పిక్చర్స్ అనుసరించిన నిర్మాణ విలువలు, అలాగే పాత్రల కోసం ఎంపిక చేసిన నటీనటులను చూస్తే.. వారికి సినిమాపై ఉండే అభిరుచి తెలుస్తుంది.

Jailer Telugu Movie Review and Rating: Rajinikanths family and Emotional drama on Temple backdrop

ఫ్యామిలీ ఎమోషన్స్, డ్రామా, కమర్షియల్ ఎలిమెంట్స్, రజనీ స్టెయిల్స్‌ను కలబోసిన సినిమా జైలర్ అని చెప్పవచ్చు. నిజాయితీ, విలువల కోసం ఎంతకైనా తెగించే ఓ జైలర్ కథ. ముత్తు పాండ్యియన్ పాత్ర చుట్టూ ఆంధ్రా నుంచి అక్రమ విగ్రహాల తరలింపు బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కించారు. (Jailer Telugu Movie Review) నెల్సన్ టేకింగ్, మేకింగ్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఎప్పటిలానే రజనీ తన అభిమానులకు విందు భోజనాన్ని పెట్టినట్టు ముత్తు పాండ్యన్ పాత్ర ఉంటుంది. ఆంధ్రా పాలిటిక్స్‌పై చిన్న సెటైర్ వేసినట్టు అనిపిస్తుంది. 30 ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు నన్ను ఏం చేయలేరు అంటూ చెప్పే డైలాగ్స్ ఆసక్తికరంగా ఉంటాయి.

Jailer Telugu Movie Review and Rating: Rajinikanths family and Emotional drama on Temple backdrop

కాకపోతే సినిమా స్లోగా సాగడం (Jailer Telugu Movie Review), మాస్ ఆడియెన్స్‌ ఆశించే కొన్ని ఎలిమెంట్స్ మిస్ అయినట్టు కనిపిస్తాయి. సింగిల్ పాయింట్‌ను సాగదీసి చెప్పినట్టు అనిపిస్తుంది. (Jailer Telugu Movie Review) శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్‌, సునీల్, తమన్నా పాత్రలను కథను బలవంతంగా నడిపించడానికి చేసిన ప్రయత్నంగా అనిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే.. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని చెప్పవచ్చు. అక్కడక్కడా కొంత పడుతూ లేస్తూ ఈ సినిమా సాగినట్టు అనిపించినా.. మంచి ఫీల్‌గుడ్ మూవీ అనిపిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X