For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Jalsa Movie review విద్యా బాలన్ టెర్రిఫిక్ ఫెర్ఫార్మెన్స్.. ఎమోషనల్ థ్రిల్లర్‌గా...!

  |

  Rating:
  3.0/5
  Star Cast: విద్యా బాలన్, షెఫాలీ షా, రోహిణి హట్టంగడి
  Director: సురేష్ త్రివేణి

  నటీనటులు: విద్యాబాలన్, షెఫాలీ షా, రొహిణి హట్టంగడి, సోఫియా ఖాన్, గుర్పాల్ సింగ్ తదితరులు
  దర్శకత్వం: సురేష్ త్రివేణి
  రచన: ప్రజ్వల్ చంద్రశేఖర్, అబ్బాస్ దలాల్, హుస్సేన్ దలాల్, సురేష్ త్రివేణి
  నిర్మాతలు: భూషణ్ కుమార్, కిషన్ కుమార్, సురేష్ త్రివేణి
  మ్యూజిక్: గౌరవ్ చటర్జీ
  సినిమాటోగ్రఫి: సౌరభ్ గోస్వామి
  ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
  ఓటీటీ రిలీజ్ డేట్: 2022-03-22

  జల్సా మూవీ కథ..

  జల్సా మూవీ కథ..


  ఆన్‌లైన్ మీడియాలో టాప్ న్యూస్ యాంకర్ మాయా మీనన్ (విద్యా బాలన్) ఓ న్యాయమూర్తిని తనదైన శైలిలో ప్రశ్నలు వేసి ఇబ్బందుల్లోకి నెట్టుతుంది. న్యాయమూర్తితో చేసిన ఇంటర్వ్యూ దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌గా మారుతుంది. తన ఇంటర్వ్యూకు వైరల్ కావడంతో ఆనందంగా ఇంటికి బయలుదేరుతుంది. మార్గమధ్యంలో అలియా (కషిష్ రిజ్వాన్) అనే అమ్మాయిని కారుతో ప్రమాదవశాత్తు ఢీకొట్టుతుంది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువతిని అలాగే వదలేసి వెళ్తుంది.

  జల్సా మూవీలో ట్విస్టులు

  జల్సా మూవీలో ట్విస్టులు


  హిట్ అండ్ రన్ వ్యవహారంతో మాయా మీనన్ ఎలాంటి మానసిక సంఘర్షణకు గురైంది. కారు ప్రమాదం తర్వాత తన వంట మనిషి రుక్సానా (షెఫాలీ షా)తో ఘర్షణ పడటానికి కారణం ఏమిటి? యాక్సిడెంట్‌తో రెక్సానాకు సంబంధమేమిటి? మీడియా ఇన్వెస్టిగేషన్‌ మొదలు కావడంతో ఆమె ఎలాంటి ఆందోళనకు గురైంది. తాను చేసిన ప్రమాదం నుంచి మాయా మీనన్ ఎలా తప్పించుకోవాలని చూసింది. ఈ ప్రమాదం విషంలో రుక్సానాకు మాయా మీనన్ ఎలాంటి న్యాయం చేసింది? చివరకు హిట్ అండ్ రన్ వ్యవహారంలో చివరకు మాయా మీనన్ ఎలా రియలైజ్ అయింది అనే ప్రశ్నలకు సమాధానమే జల్సా మూవీ కథ.

  కథ, కథనాలు ఎలా ఉన్నాయంటే..

  కథ, కథనాలు ఎలా ఉన్నాయంటే..


  ఇద్దరు ప్రేమికుల మధ్య చిన్న ఎపిసోడ్‌తో జల్సా చిత్రం ఆసక్తికరంగా మొదలవుతుంది. జస్టిస్ గులాటిని ఇంటర్వ్యూ చేసిన విధానం తర్వాత విద్యా బాలన్ (మాయా మీనన్) బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉండటంతో సినిమాపై ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌గా మారుతుంది. యాక్సిడెంట్ సీన్‌తో కథ మొత్తం ఎమోషనల్‌గా మారుతుంది. తన కారు యాక్సిండెంట్‌కు గురైన యువతి తన పనిమనిషి కూతురు అనే పాయింట్ కథలో ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. మాయా తల్లి రుక్మిణి (రొహిణి హట్టంగడి), మానసిక అవిటితనంతో బాధపడే కొడుకు ఆయుష్ (సూర్య కాశిభట్ల) అలాంటి అంశాలు కథలో ఎమోషనల్‌గా కనిపిస్తాయి. చివరకు వరకు రకరకాల భావోద్వేగాలతో కథ ముగుస్తుంది.

   విద్యా బాలన్ నటన గురించి

  విద్యా బాలన్ నటన గురించి


  జల్సా సినిమాలో విద్యా బాలన్, షెఫాలీ షా ఇద్దరు కథకు బలమైన పిల్లర్లుగా కనిపిస్తారు. ఇద్దరు ఒకరితో మరొకరు పోటీ పడి నటించారనిపిస్తుంది. యాక్సిడెంట్‌కు ముందు విద్యా బాలన్ బాడీ లాంగ్వేజ్.. హిట్ అండ్ రన్ తర్వాత ఆమె పడే మానసిక సంఘర్షణ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తాయి. కూతురు యాక్సిడెంట్ గురైన తర్వాత షెఫాలీ షా తన ఫెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీసిందనే ఫీలింగ్ కలుగుతుంది. సీనియర్ నటి రొహిణి హట్టంగడి ఇతర నటీనటులు కథలో కీలకమైన పాత్రలను పోషించారు.

  దర్శకుడు సురేష్ త్రివేణి

  దర్శకుడు సురేష్ త్రివేణి


  దర్శకుడు సురేష్ త్రివేణి ఎంచుకొన్న పాయింట్‌ బాగుంది. కానీ ఆ పాయింట్‌ను పూర్తిస్థాయి థ్రిల్లర్‌గా మలచడంలో తడబాటుకు గురయ్యారనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే పాత్రలను డిజైన్ చేసిన విధానం.. కథను పలు రకాల ఎమోషన్స్ లింక్ చేసిన తీరు ఆకట్టుకొంటుంది. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు డీల్ చేసిన ఎపిసోడ్స్ కాస్త తేలిపోయినట్టే అనిపిస్తాయి. కథను అసంపూర్తిగా ముగించినట్టు అనిపిస్తుంది. 40 ఏళ్లకుపైడిన ఇద్దరు ఫెర్ఫార్మెన్స్‌తో కథను డీల్ చేసిన విధానం ఆయన ప్రతిభకు అద్దం పట్టింది. స్క్రీన్ ప్లే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

  తెరవెనుక విభాగాల పనితీరు..

  తెరవెనుక విభాగాల పనితీరు..


  సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. గౌరవ్ చటర్జీ అందించిన మ్యూజిక్ బాగుంది. పలు సన్నివేశాలను బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఎమోషనల్‌గా మార్చారు. సౌరభ్ గోస్వామి సినిమాటోగ్రఫి బాగుంది. నైట్ ఎఫెక్ట్ షాట్స్ కొత్తగా ఉన్నాయి. కలర్ ప్యాటర్న్, లైటింగ్ వాడుకొన్న విధానం కొత్త అనుభూతికి గురిచేస్తాయి. అబ్బాస్ దలాల్, హుస్సేన్ దలాల్ డైలాగ్స్ బాగున్నాయి. భూషణ్ కుమార్, కిషన్ కుమార్, సురేష్ త్రివేణి పాటించిన నిర్మాణ విలువలు సినిమాను మరింత రిచ్‌గా మార్చాయి.

   ఓవరాల్‌గా ఎలా ఉందంటే?

  ఓవరాల్‌గా ఎలా ఉందంటే?


  హై ఎమోషనల్ పాయింట్స్, నటీనటులు ఫెర్ఫార్మెన్స్‌తో స్లోగా సాగే భావోద్వేగమైన చిత్రం జల్సా. విద్యా బాలన్, షెఫాలీ షా నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. సాంకేతిక, రచనపరమైన అంశాలు కథను పాజిటివ్‌గా మార్చాయి. ఉత్కంఠకు, మానసిక సంఘర్షణకు గురిచే సన్నివేశాలు ఆకట్టుకొంటాయి. ఫ్యామిలీ ఆడియెన్స్‌ ఈ సినిమా తప్పక నచ్చుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ కావడం జరిగింది. తీరిక వేళలో కుటుంబ సభ్యులంతా కలిసి హై ఎమోషనల్ డ్రామాను ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది.

  English summary
  Vidya Balan's Jalsa released on Amazon prime Video on March 18th. Here is the filmibeat Telugu Exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X