twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జంబలకిడి పంబ మూవీ రివ్యూ: కామెడీ‌తో ఫ్యామిలీ డ్రామా!

    By Rajababu
    |

    Recommended Video

    Jamba Lakidi Pamba Movie Review జంబలకిడి పంబ మూవీ రివ్యూ

    Rating:
    2.5/5

    సుమారు రెండు దశాబ్దాల కాలంగా తనదైన స్టయిల్‌లో తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నారు కమెడియన్, హీరో శ్రీనివాస్ రెడ్డి. రెగ్యులర్‌గా హస్యనటుడిగా మెప్పిస్తూనే, మంచి కథ దొరికితే హీరోగా వెండి తెరపైన మెరుస్తున్నారు. గీతాంజలి, జయమ్ము నిశ్చయంబురా, ఆనందోబ్రహ్మ చిత్రాలతో శ్రీనివాసరెడ్డి మెప్పించారు. ఇక సంచలన విజయ సాధించిన దృశ్యం చిత్ర నిర్మాణంలో భాగంగా మూడు భాషల్లో దర్శకత్వం శాఖలో, అలాగే మనం చిత్ర స్కిప్టులో సహకారం అందించిన జేబీ మురళీ కృష్ణ అలియాస్ మనుతో తాజాగా జతకట్టి జంబలకిడి పంబ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జంబలకిడి పంబ అంటే కామెడీకి ట్రేడ్ మార్క్‌గా నిలిచిన పాత చిత్రం గుర్తుకు వస్తుంది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడి పంబ టైటిల్‌తో జూన్ 22న రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

     జంబలకిడి పంబ స్టోరి

    జంబలకిడి పంబ స్టోరి

    వరుణ్ (శ్రీనివాస్‌రెడ్డి), పల్లవి (సిద్ది ఇద్నాని) ప్రేమించి పెళ్లి చేసుకొంటారు. అయితే కొన్నేళ్ల తర్వాత వారి మధ్య వ్యక్తిగత అభిప్రాయాలు తలెత్తుతాయి. అమితంగా ప్రేమించుకొన్న వారి మధ్య మనస్పర్థలు చోటుచేసుకొంటాయి. దాంతో విడిపోవాలని విడాకులకు దరఖాస్తు చేసుకొంటారు. లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్ విడాకులు ఇప్పించడంలో సిద్ధహస్తులు. 99 మంది దంపతులకు విడాకులు ఇప్పించి 100 కేసుగా వరుణ్, పల్లవి విడాకుల కేసును టేకప్ చేస్తారు. కానీ హరిశ్చంద్రప్రసాద్ జీవితంలో చేసుకొన్న ఊహించని ఓ సంఘటనతో వరుణ్, పల్లవి జీవితాలు తారుమారవుతాయి. వరుణ్ దేహంలోకి పల్లవి ఆత్మ, పల్లవి దేహంలోకి వరుణ్ ఆత్మ ప్రవేశించడం వల్ల కథ కొత్త మలుపుతిరుగుతుంది. దంపతులను విడగొట్టడంలో ఫేమస్ అయిన లాయర్ హరిశ్చంద్రప్రసాద్‌కు వరుణ్, పల్లవి దంపతులను కలిపే బాధ్యత నెత్తిపై పడుతుంది.

    స్టోరీలో ట్విస్టులకు..

    స్టోరీలో ట్విస్టులకు..

    ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో హరిశ్చంద్రప్రసాద్‌కు ఏమి జరిగింది? లాయర్ హరిశ్చంద్రప్రసాద్ జీవితంలో చోటుచేసుకొన్న సంఘటన ఏంటి? వరుణ్, పల్లవి విడాకులు తీసుకోవడానికి కారణం ఏమిటి? ఒకరి దేహంలోకి మరొకరి ఆత్మలు మారిన తర్వాత ఏం జరిగింది? ఇంతకీ వరుణ్, పల్లవికి విడాకులు లభించాయా? అనే ప్రశ్నలకు సమాధానమే జంబలకిడి పంబ కథ.

    ఫస్టాఫ్ అనాలిసిస్

    ఫస్టాఫ్ అనాలిసిస్

    సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన శ్రీనివాస్‌రెడ్డి, ఫ్యాషన్ డిజైనింగ్ వృత్తిలో ఉన్న సిద్ది ఇద్నానీ జీవితంలో చోటుచేసుకొన్న విభేదాలతో కథ మొదలవుతుంది. వారి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరడానికి గల కారణాలతో సినిమాను లాగించే ప్రయత్నం జరుగుతుంది. కథా గమనంలో పోసాని కృష్ణమురళీ, వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్‌తో ముందుకు సాగుతుంది. పోసాని జీవితంలో విషాదం చోటుచేసుకోవడం, ఆ తర్వాత ఓ తమాషా సంఘటనతో ఇంటర్వెల్ పడుతుంది.

    సెకండాఫ్ అనాలిసిస్

    సెకండాఫ్ అనాలిసిస్

    జంబలకిడి పంబ రెండో భాగంలో శ్రీనివాస్‌రెడ్డి, సిద్ది ఆత్మల మార్పుతో కథ మరోమెట్టు ఎక్కుతుంది. ఆడవాళ్ల బాధలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడం, అలాగే మగవాళ్ల సమస్యలు ఏ విధంగా ఉంటాయనే అంశంతో కథలో వేగం పెరుగుతుంది. కథ శ్రీనివాస్‌రెడ్డి సొంతూరుకు చేరడం, అక్కడ నుంచి కథ అనేక మలుపులు తిరుగుతూ ప్రేక్షకులకు వినోదం పంచుతుంది. చివర్లో ఆసక్తికరమైన అంశంతో సినిమా ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌తో ముగిస్తుంది.

    డైరెక్టర్ మను గురించి

    డైరెక్టర్ మను గురించి

    దర్శకుడు మను ప్రతిభావంతుడైన దర్శకుడు అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టి ఉంటే జంబలకిడి పంబ మంచి హిట్‌గా మిగిలేదు. కథలో కాన్‌ఫ్లిక్ట్‌పైనే దృష్టిపెట్టారనిపిస్తుంది. అలా కాకుండా సినిమా ఆదిలో శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధి మధ్య లవ్ ఎపిసోడ్ రన్ చేసి ఉంటే కథ మరింత ఫీల్‌గుడ్‌గా మారేదేమో. అలా కాకుండా నాసిరకమైన సీన్లతో తొలిభాగాన్ని లాగించేశాడా అనిపిస్తుంది. కాకపోతే సెకండాఫ్‌లో డీల్ చేసిన విధానం అతడి ప్రతిభకు అద్దంపట్టింది. ఆత్మలు మారిన తర్వాత దర్శకుడు ఎలాంటి తడబాటు లేకుండా కథను నడిపించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

    శ్రీనివాస్ రెడ్డి యాక్టింగ్

    శ్రీనివాస్ రెడ్డి యాక్టింగ్

    భార్య ప్రేమకు దూరమై నిలిగిపోయే పాత్రలో శ్రీనివాస్‌రెడ్డి నటన బాగుంది. ఎలాంటి పాత్రతోనైనా హాస్యాన్ని పండిస్తారనే పేరు ఆయనకు ఉంది. ఇక జంబలకిడి పంబ విషయానికి వస్తే హీరోగా తన క్యారెక్టర్ అండర్ ప్లే చేస్తూనే ఆడవాళ్ల హావభావాలతో తెరపైన అద్భుతంగా కనిపించాడు. పాత్రలో ఒదిగిపోయాడనిపిస్తుంది. సెకండాఫ్‌లో కామెడీ పండించే సీన్లు పడి ఉంటే సినిమా అదిరిపోయేది. వరుణ్ పాత్రలో నటుడిగా కొత్త శ్రీనివాస్‌రెడ్డిని చూడటానికి అవకాశం కలిగింది.

    తొలిచిత్రంలో సిద్ది ఇద్నాని

    తొలిచిత్రంలో సిద్ది ఇద్నాని

    పల్లవి పాత్రలో సిద్ధి ఆకట్టుకొన్నారు. తొలి చిత్రమైనప్పటికి అభినయంతో ఆకట్టుకొన్నది. ఐటెమ్ సాంగ్‌, ఫైట్ సీన్లలో సిద్ధి ఫెర్ఫార్మెన్స్ హైలెట్‌గా నిలుస్తుంది. డైలాగ్స్ చెప్పడంలో మెచ్యురిటీ కనిపించింది. ప్రధానంగా సిగరెట్ తాగడం, మందు కొట్టే లాంటి సీన్లలో పురుషుడి హావభావాలతో అదరగొట్టింది. భారమైన పాత్రను అవలీలగా పోషించింది.

    పోసాని మార్కు కామెడీ

    పోసాని మార్కు కామెడీ

    దంపతులను విడగొట్టే లాయర్ పాత్రలో పోసాని కృష్ణమురళీ ఆకట్టుకొన్నాడు. అయితే కథలో మలుపుతో రెండో భాగంలో ఆయన క్యారెక్టర్ పాజిటివ్‌గా మారుతుంది. ఇది ప్రేక్షకులకు మెప్పించే అంశంగా మారిందని చెప్పవచ్చు. ఇక పోసాని అసిస్టెంట్‌గా వెన్నెల కిషోర్‌ నటనపరంగా మరోసారి మంచి మార్కులు కొట్టేశారు.

    కమెడియన్స్ బృందం

    కమెడియన్స్ బృందం

    ధన్ రాజ్, సత్యం రాజేష్, చిత్రం శ్రీను, అప్పారావు కామెడీ సీన్లు సెకండాఫ్‌కు బలంగా మారాయి. ఇక క్లైమాక్స్‌లో జబర్దస్త్ అప్పారావు సీన్లు షాకింగ్‌గా ఉంటాయి. ఇక మిగితా పాత్రలు పెద్దగా ఆకట్టుకునే రేంజ్‌లో లేకపోవడం కొంత మైనస్. పాత్ర పరిధి లేకపోవడం వల్ల తనికెళ్ల భరణి, సుధా పాత్రలు పెద్దగా రిజిస్టర్ కాలేకపోయాయి. చాలా మంది హాస్య నటులున్నప్పటికీ వారిని ప్రభావవంతంగా వాడుకోలేదనే ఫీలింగ్ కలుగుతుంది.

    గోపి సుందర్ మ్యూజిక్

    గోపి సుందర్ మ్యూజిక్

    జంబలకిడి పంబ చిత్రానికి ప్లస్ పాయింట్స్‌లో గోపి సుందర్ మ్యూజిక్ ప్రధానంగా చెప్పుకోవాలి. ఆడియో పరంగానే కాకుండా తెరమీద కూడా పాటలు బాగున్నాయి. రీరికార్డింగ్ ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌కు కారణమైంది.

    సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ

    సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ

    జంబలకిడి పంబలో సతీష్ ముత్యాల అందించిన సినిమాటోగ్రఫి అదనపు ఆకర్షణ. పచ్చటి పంటపొలాలు అందంగా చూపించారు. అలాగే పబ్ కల్చర్‌ను యూత్‌ను టచ్ చేసే విధంగా రూపొందించారు. చివర్లో వచ్చే పాట చాలా బాగుంది.

    రిచ్‌గా ప్రొడక్షన్ వ్యాల్యూస్

    రిచ్‌గా ప్రొడక్షన్ వ్యాల్యూస్

    జంబలకిడి పంబ చిత్ర నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా కనిపించాయి. క్లాలిటీగా రూపొందించే క్రమంలో ఖర్చుకు వెనుకాడలేదనేది లోకేషన్ల ఎంపిక, ఆర్టిస్టుల సెలెక్షన్, మ్యూజిక్, సాంకేతిక నిపుణల ఎంపిక లాంటి అంశాల ద్వారా స్పష్టమైంది. ప్రథమార్థంలో కథపై మరింత దృష్టిపెట్టి ఉంటే మంచి విజయం చేజిక్కేది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    తొలిభాగంలో, అలాగే సెకండాఫ్‌లో సన్నివేశాల్లో భావోద్వేగం లేకపోవడం కొంత మైనస్ అనిచెప్పవచ్చు. కానీ కామెడీని ఆస్వాదించే ప్రేక్షకులకు మాత్రం జంబలకిడి పంబ తప్పకుండా నచ్చుతుంది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్
    శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధి యాక్టింగ్
    మ్యూజిక్
    సాంకేతిక అంశాలు
    క్లీన్ కామెడీ
    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    మైనస్ పాయింట్స్
    కథ, కథనం
    రొటీన్ సన్నివేశాలు

    తెరవెనుక, తెర ముందు

    తెరవెనుక, తెర ముందు

    శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధి ఇద్నాని, పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిశోర్‌, స‌త్యం రాజేశ్‌, ధ‌న్‌రాజ్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, హ‌రి తేజ‌ తదితరులు
    స్టోరి, ద‌ర్శ‌క‌త్వం: జె.బి. ముర‌ళీకృష్ణ (మ‌ను)
    నిర్మాతలు: ర‌వి, జోజో జోస్‌, ఎన్ శ్రీనివాస్‌రెడ్డి
    సంగీతం: గోపీసుంద‌ర్
    సినిమాటోగ్రఫి: స‌తీశ్ ముత్యాల‌
    బ్యానర్: శివ‌మ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడ‌క్ష‌న్స్
    రిలీజ్ డేట్: 22 జూన్ 2018

    English summary
    The first look poster of Srinivas Reddy starrer Jamba Lakidi Pamba was released today by actor Naresh Vijaya Krishna. In an event held Sarathi Studios, the poster was unveiled in the presence of actor Ali and director Maruthi Dasari. The cast and crew of the film were also present. Actor Naresh was the hero of Jamba Lakidi Pamba which was released in 1993. “I never thought someone will use this title again for a movie. It was director and my best friend EVV Satyanarayana coined the term Jamba Lakidi Pamba. This movie completed censor and set release on June 22nd.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X