Jana Nayagan twitter Review: జన నాయగన్ ట్విట్టర్ రివ్యూ
తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్, అందాల తార పూజా హెగ్డే జంటగా నటించిన తాజా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జన నాయగన్. ఈ సినిమాను కన్నడ భారీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కే నిర్మించారు.
ఈ చిత్రంలో మమితా బైజు కీలక పాత్రను పోషించారు. బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి తదితరులు నటించారు. ఈ సినిమాకు సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం 7 నెలలపాటు సెన్సార్‌తో పోరాటం చేసిన తర్వాత జూలై 23వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా గురించి రివ్యూవర్లు ఏం చెప్పారు? ఈ సినిమా గురించి నెటిజన్ల అభిప్రాయాలు ఏమిటి? ఈ చిత్రంపై సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

జన నాయగన్ తప్పక చూడాల్సిన సినిమా. ఫస్టాఫ్‌లో ఎలివేషన్ లాంటివి ఎక్కువగా ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ సెకండాఫ్‌లో అన్నింటినీ సమానంగా బ్యాలెన్స్ చేశారు. దయచేసి థియేటర్‌కి వెళ్లి చూడండి అని ఓ విజయ్ అభిమాని ట్వీట్ చేశారు.
జన నాయగన్ కేవలం ఓ సినిమా కాదు. ఫ్యాన్ డమ్ విషయంలో గ్రేటెస్ట్ ఫర్ ఆల్ ది టైమ్స్ అని నిరూపించిన చిత్రం. 6 నెలల క్రితం ఈ సినిమా పైరసీకి గురైనా అభిమానులు అండగా నిలిచారు. ఈ సినిమా థియేటర్లలో సెలబ్రేట్ చేసేందుకు సిద్దమయ్యారు. విజయ్ ఫ్యాన్స్‌కు చీర్స్ అని కామెంట్స్ చేశాడు.
ఎన్నో ఏళ్లుగా లెక్కలేనన్నీ మెమొరీస్‌ను ఆడియెన్స్ ఇచ్చారు. విజయ్ సార్.. మీ అపురూపమైన జర్నీలో జన నాయగన్ మరో మైలురాయిగా నిలుస్తుందని నమ్ముతున్నాను. దళపతి, గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రిగా మీరు జన నాయకుడిగా పేరును సార్థకం చేసుకొన్నారు. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు, డైరెక్టర్ వినోద్‌కు, మొత్తం చిత్ర యూనిట్ నా శుభాకాంక్షలు. ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయేలా విజయం సాధించాలని, మీ సినిమాకు అలాంటి అర్హత ఉందని నమ్ముతున్నాను అని దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.
ఓ అభిమాని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ రివ్యూ ఇచ్చారు. 'జన నాయగన్' ఫస్ట్ హాఫ్ ఓల్డ్ స్కూల్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా సాగిందని, మొత్తం సినిమాను దళపతి విజయ్ తన మాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఒంటిచేత్తో మోశారని పేర్కొన్నారు. ముఖ్యంగా యాక్షన్, ఎమోషన్, కామెడీ, డ్యాన్స్.. అన్ని అంశాల్లో విజయ్ అదరగొట్టారని, ఇది పూర్తిగా "వన్ మ్యాన్ షో" అని కొనియాడారు. సినిమా అంతా విజయ్ తన ఎనర్జీతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారని తెలిపారు. ఇక సినిమాలోని ఇంట్రో సీన్, దళపతి కచేరి సాంగ్, అలాగే ఇంటర్వెల్ బ్లాక్ థియేటర్లలో అభిమానులకు గూస్‌బంప్స్ అని అభిప్రాయపడ్డారు.
ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు పెద్ద ప్లస్ అని చెప్పారు. 'రావణ దా' థీమ్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయని పేర్కొన్నారు. దర్శకుడు హెచ్. వినోద్, 'భగవంత్ కేసరి' కథలోని కోర్ ఐడియాను తీసుకుని, దానికి కొత్త విలన్ ట్రాక్ జోడించి, మరింత పెద్ద మోటివ్‌తో కథను మలిచారని అభిప్రాయపడ్డారు. దీంతో సినిమా కేవలం రీమేక్‌లా కాకుండా కొత్త అనుభూతిని ఇస్తోందని తెలిపారు. మొత్తానికి ఫస్ట్ హాఫ్ వరకు జన నాయగన్ ఒక ఎంటర్‌టైనింగ్, ఎంగేజింగ్ కమర్షియల్ ప్యాకేజ్ అని పేర్కొన్నారు.
ఓ అభిమాని 'జన నాయగన్' ఫస్ట్ హాఫ్ పూర్తి స్థాయి మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా సాగిందని పేర్కొన్నారు. సినిమాలో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలివేషన్ సీన్లు, కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్, ఆ తర్వాత వచ్చే దళపతి విజయ్ పంచ్ డైలాగ్ థియేటర్లలో అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించాయని కొనియాడారు. అలాగే సినిమా కథలో 'భగవంత్ కేసరి'ని గుర్తు చేసే కొన్ని సన్నివేశాలు కనిపించినప్పటికీ, దర్శకుడు హెచ్. వినోద్ వాటిని తనదైన ట్రీట్‌మెంట్‌తో కొత్తగా తెరకెక్కించారని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, విజయ్ తన స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ ఎలివేషన్స్‌తో ఆ సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు.
'జన నాయగన్' ఫస్ట్ హాఫ్ తనకు యావరేజ్ గా అనిపించిందని ఓ నెటిజన్ ట్విట్టర్‌లో రివ్యూ ఇచ్చాడు. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం సినిమాకే హైలైట్ అని పేర్కొన్నాడు. దాన్ని తప్పించి కొన్ని రెగ్యులర్ మాస్ ఎలివేషన్ సీన్లు మాత్రమే ఆకట్టుకున్నాయని, కానీ మొత్తం ఎగ్జిక్యూషన్ మాత్రం అంతగా మెప్పించలేదని అభిప్రాయపడ్డాడు. అలాగే బాబీ డియోల్ విలన్ ట్రాక్ చాలా అసంబద్ధంగా ఉందని, వీఎఫ్‌ఎక్స్ నాణ్యత నిరాశపరిచిందని, కథలో కీలకమైన తండ్రి-కూతురు ఎమోషన్ పూర్తిస్థాయిలో కనెక్ట్ కాలేదని వ్యాఖ్యానించాడు. అయితే దళపతి విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్, అనిరుధ్ సంగీతమే ఇప్పటివరకు సినిమాను నిలబెట్టాయని తన ట్విట్టర్ రివ్యూలో పేర్కొన్నాడు.
మరో నెటిజన్ ట్విట్టర్‌లో 'జన నాయగన్' సెకండ్ హాఫ్ గురించి పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. మమితా బైజుకు సంబంధించిన 'భగవంత్ కేసరి' నుంచి తీసుకున్న కొన్ని సన్నివేశాలు మినహా.. సెకండ్ హాఫ్ పూర్తిగా దర్శకుడు హెచ్. వినోద్ సొంత రచన, స్క్రీన్‌ప్లేతో రూపొందిందని పేర్కొన్నాడు. ముఖ్యంగా 45 నిమిషాల ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని, అది పూర్తిగా హెచ్. వినోద్ క్రియేట్ చేసిన కథ అని ప్రశంసించాడు. రాజకీయ అంశాలతో నిండిన ఆ ఫ్లాష్‌బ్యాక్‌ను దళపతి విజయ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా డిజైన్ చేశారని, అందుకే సెకండ్ హాఫ్ మరింత ఆసక్తికరంగా అనిపించిందని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications