Jana Nayagan Review by Kasthuri: జన నాయగన్ మూవీపై నటి కస్తూరి రివ్యూ.. విజయ్ సినిమా ఎలా ఉందంటే?

తమిళ సినీ దళపతి విజయ్ నటించిన జన నాయగన్ చిత్రం రిలీజ్‌కు పైరసీ బారిన పడి లీక్ కావడం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాజకీయ లబ్ది పొందడానికి ఈ సినిమాను ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారా? లేదా నిర్మాతకు నష్టం చేయాలని కుట్ర పన్నారా? అనే కోణంలో చర్చ సాగుతున్నది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాను రిలీజ్ కాకుండా సెన్సార్ అడ్డుకోవడం ఇప్పటికే వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెన్సార్ విషయం సుప్రీం కోర్టు వరకు వెళ్లడం జరిగింది.

అయితే సెన్సార్ కోసం రివ్యూ కమిటీని ఏర్పాటు చేయడంతో ఈ సినిమా రిలీజ్ విషయంలో జాప్యం జరిగింది. ఈ సమయంలోనే లీక్ కావడం అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ క్రమంలో రజనీ కాంత్, కమల్ హాసన్, చిరంజీవి లాంటి వాళ్లు ఈ చర్యను ఖండించారు. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని చూసిన టెలివిజన్ నటి, తమిళ రాజకీయ నేత కస్తూరి ఈ మూవీపై రివ్యూ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా గురించి ఆమె చెప్పిన విషయాలు, వివరాల్లోకి వెళితే..

Jana Nayagan Review by Actress Kasthuri

నటి కస్తూరి స్పందిస్తూ.. జన నాయగన్ సినిమాను నాకు కొందరు వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో పంపారు. దానిని ముక్కలు ముక్కలుగా అక్కడక్కడా చూశాను. ప్రస్తుతం జన నాయగన్ సినిమా లీక్ గురించే అంతా మాట్లాడుకొంటున్నారు. ఈ సినిమా లీక్ గురించి నేను కొంత సమాచారాన్ని తెలుసుకొంటున్నాను. ఒకవేళ ఈ సినిమాను ప్రేక్షకులు చూస్తే.. తప్పకుండా విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకే లబ్ది చేకూరుతుంది. బీజేపీకి గానీ, డీఎంకే పార్టీకి గాని ఎలాంటి మేలు చేయదు అని ఆమె అన్నారు.

జన నాయగన్ సినిమా మూడు గంటలపాటు సాగే ప్రాపగండా మూవీ. ఈ సినిమా పర్‌ఫెక్ట్ క్వాలిటీతో లీక్ చేశారు. సెన్సార్‌కు సమర్పించిన సినిమాను ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండా సినిమాను సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో అనధికారికంగా రిలీజ్ చేశారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో బట్టబయలు చేయడానికి సెన్సార్ బోర్డు, సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎల్ మురగన్ చర్యలు తీసుకోవాలి అని కస్తూరి డిమాండ్ చేశారు.

జన నాయగన్ సినిమా లీక్ వెనుక ఎవరి హస్తం ఉందో తెలియదు. కానీ వారి ఓ వర్గానికి మేలు చేసే ప్రచార కార్యక్రమంగా ఈ సినిమా ఉంది. ఈ సినిమా విడుదలైతే అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోతామనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది అని కస్తూరి ఆరోపించింది. ఈ సినిమా కథ మొత్తం తమిళనాడు పాలిటిక్స్ చుట్టే తిరుగుతుంది. కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు లేవు. అందుకే తమిళ ప్రజలు చూడకుండా ఈ సినిమాను ఆపించింది అని టీఎన్2026 సినిమా ఈవెంట్‌లో మాట్లాడుతూ కస్తూరి ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

జన నాయగన్ సినిమా చూస్తే తప్పకుండా విజయ్‌కి పాజిటివ్‌గా ఉంటుంది. టీవీకే పార్టీకి అనుకూలంగా మారుతుంది అని కస్తూరి అన్నారు. కస్తూరి చేసిన వ్యాఖ్యలు డీఎంకే పార్టీకి వ్యతిరేకంగా ఉండటం తమిళ మీడియాలోను రాజకీయ, సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి తీసింది. ఆమె చేసిన కామెంట్స్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more about: jana nayagan vijay kasthuri
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X