Janaka Aithe Ganaka Review: జనక అయితే గనక మూవీ రివ్యూ అండ్ రేటింగ్
మూవీ: జనక అయితే గనక
నటీనటులు సుహాస్, సంగీర్తన, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, మురళీశర్మ, ప్రభాస్ శ్రీను, గోపరాజు రమణ తదితరులు
సమర్పణ: శిరీష్
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి
రచన, దర్శకత్వం: సందీప్ రెడ్డి బండ్ల
మ్యూజిక్: విజయ్ బుల్గానిన్
డీవోపీ: సాయి శ్రీరామ్
ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్
ప్రొడక్షన్ డిజైనర్: అరసవిల్లి రామ్‌కుమార్
కాస్ట్యూమ్ డిజైనర్: భరత్ గాంధీ
బ్యానర్: దిల్‌రాజు ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2024-10-12
తండ్రి (గోపరాజు రమణ) తీసుకొన్న తప్పుడు నిర్ణయం కారణంగా ఆర్థిక సమస్యలతో మధ్య తరగతి కుటుంబానికే పరిమితమయ్యామనే ఫీలింగ్‌తో ఉండే యువకుడు ప్రసాద్ (సుహాస్). వాషింగ్ మిషన్ కంపెనీలో పని చేస్తూ భార్య (సంకీర్తన), స్నేహితుడు, లాయర్ పత్తి కిషోర్ (వెన్నెల కిషోర్) సరదాగా జీవితాన్ని ఆస్వాదిస్తుంటాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండటంతో పిల్లల్ని కనకూడదని ప్రసాద్ దంపతులు నిర్ణయం తీసుకొంటారు. కానీ ఉన్నట్టుండి భార్య గర్బవతి కావడంతో షాక్ గురైన ప్రసాద్.. కండోమ్ కంపెనీపై కోటి రూపాయలకు కేసు వేస్తాడు.

ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోవడం తండ్రిపై ప్రసాద్ అసహనంతో ఉంటాడు? పెళ్లైనా పిల్లల్ని కనకూడదని ప్రసాద్ ఎందుకు నిర్ణయం తీసుకొన్నాడు? మధ్య తరగతి జీవితంలో ఉండే కష్టాలు ప్రసాద్‌పై ఎలాంటి ప్రభావం చూపాయి? సమాజంలో ఉండే పరిస్థితులు ప్రసాద్‌ను ఎలాంటి గందరగోళంలోకి నెట్టాయి? కండోమ్ కంపెనీపై ఎందుకు దావా వేశాడు? కోర్టులో టాప్ లాయర్ అజయ్ శర్మ (మురళీ శర్మ) వాదనలను ప్రసాద్, తన లాయర్ పత్తి కిషోర్ ఎలా తిప్పి కొట్టాడు? కోటి రూపాయలు పరిహారాన్ని ప్రసాద్ పొందాడా? కండోమ్ వాడినా భార్య ఎందుకు? ఎలా గర్బవతి అయిందనే ప్రశ్నలకు సమాధానమే జనక అయితే గనక సినిమా కథ.
ప్రశాంత్ నీల్ వద్ద సలార్ లాంటి సినిమాలకు రైటర్‌గా పనిచేసిన సందీప్ రెడ్డి బండ్ల రాసుకొన్న కథ కొత్తగా అనిపించదు కానీ.. కథ చుట్టు అల్లుకొన్న సన్నివేశాలు, పాత్రలతో చెప్పించిన ఎమోషనల్ డైలాగ్స్ కొత్తగానే కాకుండా ఆలోచింపజేసేలా ఉంటాయి. కోర్టులో దావా అనే పాయింట్‌పై చాలా సినిమాలు వచ్చినా సామాజిక అంశాలు, ఎడ్యుకేషన్ సిస్టమ్‌లోని అవకతవకలతో డ్రామాను ఎలివేట్ చేసిన విధానం బాగుంది. కోర్డు డ్రామాను ఎమోషన్స్ జోడించి చూపించిన విధానంతో ఆయన ప్రతిభకు అద్దం పట్టిందని చెప్పవచ్చు.
చిన్న చిన్న పాత్రలతో హీరోగా మారి కంటెంట్ బేస్డ్ సినిమాలతో విజయాలు అందుకొంటున్న సుహాస్.. మరోసారి మంచి కంటెంట్ ఉన్న కథలో ప్రసాద్‌గా తానేంటో మళ్లీ నిరూపించుకొన్నాడు. ఎమోషనల్ క్యారెక్టర్‌లో ఆయన ఒదిగిపోయి నటించిన తీరు.. ఆయన నటనలోని పరిణతికి నిదర్శనంగా నిలిచింది. మిడిల్ క్లాస్ వైఫ్ పాత్రలో సంకీర్తన తన పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేసింది. వెన్నెల కిషోర్ యాక్టింగ్ ఈ సినిమాకు బ్యాక్ బోన్ లాంటింది. వినోదంతోపాటు ఎమోషన్స్ కూడా పండించడం స్పెషాలిటిగా చెప్పుకోవచ్చు.

సెకండాఫ్‌లో ఎంట్రీ ఇచ్చే మురళీ శర్మ ఈ సినిమా గ్రాఫ్‌ను అమాంతం పెంచేస్తాడు. జడ్జీగా రాజేంద్ర ప్రసాద్, లాయర్‌గా ప్రభాస్ శ్రీను, తండ్రిగా గోపరాజు రమణ, ఇలా ప్రతీ ఒక్కరికి తమ ప్రతిభను చాటుకొనేందుకు అవకాశం దక్కింది. ఈ సినిమాలో కనిపించిన వారాంత గుర్తుండిపోయేలా నటించారు. నానమ్మగా నటించిన నటి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. విజయ్ బుల్గానిన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో మెట్టు ఎక్కించింది. కోర్డు డ్రామాను, అలాగే నైట్ ఎఫెక్ట్ సీన్లను డీవోపీ సాయి శ్రీరామ్ బాగా ఎలివేట్ చేశారు. నటుడిగానే కాకుండా ఎడిటర్‌గా కోదాటి పవన్ కల్యాణ్ తన మార్కు చూపించాడు. కంటెంట్ నమ్ముకొనే చిన్న సినిమాలతో మ్యాజిక్ చేయాలనే తపన, అభిరుచి నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డిలో కనిపిస్తుంది. వారు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
కండోమ్ కంపెనీపై కేసు ఆధారంగా నడిచే ఈ సినిమాలో అంతకంటే ఎక్కువగానే విషయాలను చర్చించడం ఈ సినిమాకు బ్యూటీ. తల్లిదండ్రుల బలహీనతను క్యాష్ చేసుకోవాలనుకొనే బట్టల దుకాణాల యాజమాన్యం.. అలాగే అత్యధిక ఫీజులను వసూలు చేస్తూ పేరెంట్స్ వేధించే విద్యా సంస్థలపై తిరుగలేని సెటైర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. దర్శకుడు సందీప్ మాత్రమే కాదు.. ప్రతీ తండ్రి పడే మానసిక సంఘర్షణ తెరపైన కనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. ప్రతీ తండ్రి, ప్రతీ ఫ్యామిలీ చూడాలనే విధంగా దిల్ రాజు ప్రొడక్షన్స్ ఈ సినిమాను రూపొందించింది. థియేటర్లలో చూస్తూ.. వినోదం, ఎమోషన్స్‌తో సమాజంలో జరుగుతున్న కొన్ని అంశాలు ఆలోచింప చేస్తాయి. కాబట్టి ఈ సినిమాను మిస్ చేసుకోకండి.. గ్యారెంటీగా మంచి అనుభూతిని అందిస్తుంది.


Click it and Unblock the Notifications











