twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జానకి వెడ్స్‌ శ్రీరామ్‌, ప్రేక్షకులకు బోర్‌ ఖాయం

    By Staff
    |

    Janaki Weds Sriram
    -జలపతి గూడెల్లి
    చిత్రం: జానకి వెడ్స్‌ శ్రీరామ్‌
    నటీనటులు: రోహిత్‌, గజాలా, రేఖ, ప్రేమ
    సంగీతం: ఘంటాడి కృష్ణ
    నిర్మాత: ఎస్‌.రమేష్‌ బాబు
    స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: అంజి శ్రీను

    కొత్తగా పరిచయం అవుతోన్న దర్శకులు కొత్తగానో లేదో, ఆసక్తికరంగానో చెప్పాలనే విషయాన్ని మర్చిపోవడం క్షమించరాని నేరం. చిరంజీవి నటిస్తోన్న 'అంజి' చిత్రానికి సహాయకుడిగా సూపర్‌ గా పనిచేశాడని పేరుతెచ్చుకొన్న 'అంజి' శ్రీను దర్శకుడిగా తన తొలి చిత్రంలో మాత్రం అటువంటి పనితనాన్ని ఏదీ చూపించలేదు.

    'మనసంతా నువ్వే' హిట్‌ అవడం చూసి ఇన్‌ స్పైర్‌ 'చిన్ననాటి ప్రేమ'ను మరోసారి రుద్దే ప్రయత్నమే 'జానకఇ వెడ్స్‌ శ్రీరామ్‌' అనే చెప్పవచ్చు. రోహిత్‌ హీరో అంటే ఖాయంగా సినిమా వెళ్ళకపోవడమే మేలని మరోసారి ఈ సినిమా రుజువు చేసింది. ఏ మాత్రం పసలేని సినిమా.

    కథ: సీతారామ్‌ (రోహిత్‌), సీత (గజాలా) బావమరదళ్ళు. బొమ్మలపెళ్ళి నాడే నిజమైన భార్యభర్తలయిపోతారు. సీత గయ్యాలి పిన్ని (అపూర్వ)ఇరు కుటుంబాలను వేరు చేస్తోంది. సో..సీతారామ్‌ కుటుంబం హైదరాబాద్‌ వెళ్ళి స్థిరపడుతుంది. మనవాడు, పెరిగి పెద్దయ్యాక కూడా సీతనే తలుచుకుంటాడు. సీత కూడా ఏనాటికైనా తన బావ వస్తాడనుకుంటుంది.

    ఇక సినిమా అంతా వీరిద్దరు ఎలా కలుసుకుంటారనే. ఇద్దరు ఒకరిఒకరికి పరిచయం అయ్యాక కూడా వాళ్ళ బంధం ఏమిటో తెలియదు, 'మనసంతా నువ్వే' టైప్‌ లో. కాకపోతే, 'మనసంతా నువ్వే' చక్కటి, వినోదాత్మక ప్రేమకథా చిత్రం. ఇది బోర్‌ చిత్రం. అదే తేడా.

    హీరోయిన్‌ కు ఆక్సిడెంట్‌ లో కిడ్నీలు పాడవ్వడం, మూడు గంటల్లో ఆపరేషన్‌ చేయకపోతే ప్రమాదం అని డాక్టర్లు అనడం, హీరో రెచ్చిపోయి కిడ్నీ డోనేట్‌ చేసి, వెంటనే లేచి వెళ్ళి సాంగ్‌ కాంపిటీషన్‌ లో పాల్గొనడం..అనే ఈ అత్యంత సిల్లీ కామెడీ ఈ సినిమా స్పెషాలిటీ.

    రోహిత్‌ నటన(వస్తుందా?) మామూలే. రేఖ ఎన్ని సినిమాల్లో చేసినా అదే తీరు. గజాలా ఫర్వాలేదు. ప్రేమకు పాట పెట్టడం మరీ దారుణం. బాలు పాడిన పాట మినహా ఘంటాడీ సంగీతంలో రొద తప్ప మెలోడి లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X