twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Gunjan Saxena: The Kargil Girl మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    2.5/5
    Star Cast: జాన్వీ కపూర్, పంకజ్ త్రిపాఠి, అంగద్ బేడి
    Director: శరణ్ శర్మ

    దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కపూర్ నటించిన గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ చిత్రం ఆగస్టు 12వ తేదీ అర్ధరాత్రి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారతీయ వైమానిక దళంలో తొలి మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా జీవితంలోని కొన్ని ముఖ్య అంశాలను, ముఖ్యంగా కార్గిల్‌లో ఆమె చూపిన ధైర్య సాహసాలను తీసుకొని ఈ సినిమాను రూపొందించడంతో ఈ సినిమాపై ఎక్కువ ఆసక్తిని కలిగించేలా చేసింది. కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ నేపథ్యంలో థియేటర్ల మూసివేత కొనసాగతున్న కారణం ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయకతప్పలేదు. సైరత్ రీమేక్ ధడక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఆ తర్వాత చాలా సమయం తీసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జాన్వీ కపూర్ ద్వితీయ విఘ్నాన్ని అధిగమించారా? గుంజన్ సక్సేనా మూవీ ఎలాంటి అనుభూతిని పంచిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథ, కథనాల గురించి చర్చించాల్సిందే.

    గుంజన్ సక్సేనా కథ

    గుంజన్ సక్సేనా కథ


    గుంజన్ సక్సేనా అలియాస్ గుంజూ (జాన్వీ కపూర్)కు ఊహ తెలిసినప్పటి నుంచే పైలెట్ కావాలనే కోరిక ఉంటుంది. వయసుతోపాటు ఆ కోరిక కూడా మనసులో పెరుగుతూనే ఉంటుంది. ఇంటా, బయటా ఎన్నో కష్టాలు, సమస్యలను అధిగమించి గుంజన్ సక్సేనా చివరికి ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ పైలెట్ అవుతుంది. తన కలను సాకారం చేసుకొని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోకి అడుగుపెడుతుంది.

    గుంజన్ సక్సేనా కథలో మలుపులు

    గుంజన్ సక్సేనా కథలో మలుపులు

    తొలి మహిళా పైలెట్‌గా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోకి వెళ్లిన గుంజన్ సక్సేనాకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? తనకు ఎదురైన సమస్యలను ఎలా ఎదురించింది? మహిళ అనే ఓ కారణంగా తనను చిన్నచూపు చూసిన అధికారులకు ఎలాంటి జవాబుచ్చింది? కార్గిల్ యుద్ధంలో ఎలాంటి ధైర్య సాహసాలు ప్రదర్శించింది? అనే ప్రశ్నలకు సమాధానమే గుంజన్ సక్సేనా చిత్ర కథ.

    ఫస్టాఫ్‌లో కీలక అంశాలు

    ఫస్టాఫ్‌లో కీలక అంశాలు

    ఆడపిల్ల అంటే కొన్ని ఉద్యోగాలకు పనికిరాదు అనే భావన ఉన్న సమయంలో గుంజన్ సక్సేనా తన కలను సాకారం చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నదనే అంశాలతో కథ మొదలవుతుంది. కూతురు కలకు తండ్రి అండగా నిలిస్తే.. తల్లి, సోదరుడు వ్యతిరేకించడమనే ఎమోషనల్ సీన్లతో కథ సాగుతుంది. పైలెట్ కావాలనుకొనే కల కోసం చదువును కూడా వదిలేయడానికి సిద్ధమైన గుంజన్‌ను ఎలా డిగ్రీ పూర్తి చేయించారనే ఎపిసోడ్ ఫీల్‌గుడ్‌గా ఉంటుంది. తొలి భాగం వరకు చూస్తే ఇలాంటి ఫ్యామిలీ, ఎమోషనల్‌ విషయాలకు పెద్ద పీట వేశారు.

    సెకండాఫ్‌లో కీలక అంశాలు

    సెకండాఫ్‌లో కీలక అంశాలు

    ఇక రెండో భాగంలోనే జాన్వీ పోరాటం మొదలవుతుంది. అబల సబల అని నిరూపించుకోవడానికి ఎన్నో అగ్నిపరీక్షలకు సిద్ధమయ్యే తీరు ఆకట్టుకొనేలా ఉంటుంది. ఇక ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగం కేవలం పురుషులకే అన్నట్టు ప్రవర్తించే అధికారులకు బుద్ధి చెప్పే తీరు, లింగ వివక్ష, పురుషాంకారం లాంటి సన్నివేశాలు హృదయాన్ని తాకుతాయి. చివర్లో కార్గిల్ యుద్ధంలో గుంజన్ సక్సేనా ప్రదర్శించిన ధైర్య సాహసాలను సరిగా తెరకెక్కించలేదనే నిరాశ మాత్రం వెంటాడుతుంటుంది. గుంజన్ జీవితంలోని డ్రామాపైనే దృష్టిని కేంద్రీకరించినట్టు స్పష్టమవుతుంది. సినిమాకు ఆయువు పట్టుగా, గుంజన్‌ జీవితంలో గొప్పగా ఉండే ఉండే కార్గిల్ యుద్ద సన్నివేశాలు పెద్దగా చూపించకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా మారిందని చెప్పవచ్చు.

    దర్శకుడు శరణ్ శర్మ గురించి

    దర్శకుడు శరణ్ శర్మ గురించి


    గుంజన్ సక్సేనా చిత్రంతో తొలి చిత్ర దర్శకుడిగా పరిచయమైన శరణ్ శర్మ తాను ఎంచుకొన్న సబ్జెక్ట్‌ను అభినందించాల్సిందే. కథను భావొద్వేగంగా మలచడంలో సఫలమయ్యాడనే చెప్పవచ్చు. బడ్జెట్ పరిమితుల కారణంగా కార్గిల్ యుద్ద సన్నివేశాలను పూర్తి స్థాయిలో చిత్రీకరించలేకపోయాడేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. జాన్వీ పాత్రను రాసుకొన్న తీరు.. తెరపైన ఆవిష్కరించిన విధానం హైలెట్‌గా ఉందని చెప్పవచ్చు. అయితే గుంజన్ సక్సేనా జీవితాన్ని అందరికి స్పూర్తిదాయకంగా ఉండే యుద్ధ సన్నివేశాలనే పూర్తిస్థాయిలో చిత్రీకరించలేకపోయారనే అసంతృప్తిని వెంటాడేలా చేశారనిపిస్తుంది.

    జాన్వీ కపూర్ ఫెర్ఫార్మెన్స్

    జాన్వీ కపూర్ ఫెర్ఫార్మెన్స్


    గుంజన్ సక్సేనా బయోపిక్‌లో జాన్వీ కపూర్‌దే వన్ ఉమెన్ షో. గుంజన్ పాత్రలో ఒదిగిపోయి పలికించిన భావోద్వేగాలు అద్భుతంగా ఉంటాయి. పురుషాధిక్యతతో విర్రవీగే ఎయిర్‌ఫోర్స్ అధికారులకు బుద్ది చెప్పే సీన్‌లో జాన్వీ కపూర్ నటన అద్భుతం. ఇక తండ్రి (పంకజ్ త్రిపాఠి)‌తో ఉండే సన్నివేశాల్లో జాన్వీ కపూర్ గుండెను పిండేసేలా నటించారు. తన పాత్రకు నూటికి నూరుశాతం న్యాయం చేసింది. కీలక సన్నివేశాల్లో కళ్లతో పలికించిన నటన ఆమె ప్రతిభకు అద్దంపట్టింది. ఇక మిగితా పాత్రల్లో వారి వారి పరిధి మేరకు నటించి మెప్పించారు.

    సాంకేతిక విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల పనితీరుకు వస్తే మనుష్ నందన్ అందించిన సినిమాటోగ్రఫి మూవీకి ప్రాణంగా నిలిచింది. కార్గిల్ యుద్ధ సన్నివేశాలను సహజంగా ఉండేలా చిత్రీకరించారు. ఈ సినిమాకు అమిత్ త్రివేది పాటలు అందిస్తే.. జాన్ స్టివార్ట్ ఎడూరి బ్యాక్ గ్రౌండ్ స్కోరును ఇచ్చారు. పాటలకు అంతగా ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపించదు. కాకపోతే పలు సన్నివేశాలను ఎమోషనల్‌గా మార్చేలా బీజీఎం ఉంటుంది. ఇతర శాఖల పనితీరు ఫర్వాలేదనిపిస్తుంది.

    ఫైనల్‌గా..

    ఫైనల్‌గా..

    గుంజన్ సక్సేనా మహిళ జాతికి స్ఫూర్తిని అందించే చిత్రమని చెప్పవచ్చు. అన్నిరంగాల్లో రాణిస్తున్న మహిళలకు తమకు ఎదురయ్యే సమస్యలను ఎలా అధిగమించవచ్చనే విషయాన్ని తెరపైన చక్కగా చూపించిన చిత్రమని చెప్పవచ్చు. పురుషాధిక్యత ఉండే ఆర్మీలో మహిళలు ఏ విషయంలోను తీసిపోరనే ఓ సందేశాన్ని అందించిన చిత్రంగా గుంజన్ సక్సేనా నిలిచిపోతుంది. కాకపోతే సైన్యంలో గుంజన్ సక్సేనా ధైర్య సహసాలను పూర్తిస్థాయిలో చిత్రీకరించి ఉంటే ఈ సినిమాకు మరింత సార్ధకత చేకూరి ఉండేదేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. బాలికలు, మహిళలే కాకుండా అందరూ తప్పక చూడాల్సిన చిత్రమని చెప్పవచ్చు.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    పాజిటివ్ పాయింట్స్
    కథ, కథనాలు
    జాన్వీ కపూర్ నటన
    ఎమోషనల్ సీన్లు

    మైనస్ పాయింట్స్
    పాటలు
    సాదాసీదాగా క్లైమాక్స్

    Recommended Video

    Nepotism పై Renu Desai హాట్ కామెంట్స్‌!
    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: జాన్వీ కపూర్, పంకజ్ త్రిపాఠి, అంగద్ బేడి, ఆయేషా రజా మిశ్రా, మానవ్ విజ్, వినీత్ కుమార్ సింగ్ తదితరులు
    దర్శకత్వం: శరణ్ శర్మ
    నిర్మాతలు: కరణ్ జోహర్, జీ స్టూడియోస్, హీరూ యష్ జోహర్, అపూర్వ మెహతా
    రచన: నిఖిల్ మెహ్రోత్రా, శరణ్ శర్మ
    మ్యూజిక్: జాన్ స్టివార్ట్ ఎడూరి, అమిత్ త్రివేది
    సినిమాటోగ్రఫి: మనుష్ నందన్
    ఎడిటింగ్: నితిన్ బేడి
    బ్యానర్: ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్
    ఓటీటీ రిలీజ్: నెట్‌ఫ్లిక్స్
    ఓటీటీ రిలీజ్ డేట్: 2020-08-12

    English summary
    Bollywood star Janhvi Kapoor's Gunjan Saxena: The Kargil Girl is a movie directed by Sharan Sharma. Produced under Dharma Productions and Zee Studios. The film stars Janhvi Kapoor as First Indian Air Force pilot Gunjan Saxena. Pankaj Tripathi and Angad Bedi in supporting roles. This movie released Netflix OTT platform on August 12th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X