Bawaal Review: భార్యాభర్తల బంధం మార్చిన వరల్డ్ వార్ 2.. 'బవాల్' రివ్యూ.. ఎలా ఉందంటే?
రేటింగ్: 2.75/5
టైటిల్: బవాల్
నటీనటులు: జాన్వీ కపూర్, వరుణ్ ధావన్, మనోజ్ పహ్వా, అంజుమన్ సక్సెనా, ముఖేష్ తివారి, ప్రతీక్ పచోరి తదితరులు
సినిమాటోగ్రఫీ: మితేష్ మిర్చందాని
సంగీతం: మిథున్, తనిష్క్ బాగ్చి, అక్షదీప్ సేన్ గుప్తా (పాటలు), డేనియల్ బి జార్జ్ (బీజీఎం)
కథ: అశ్విని అయ్యర్ తివారి
రచన నితేష్ తివారి, పియూష్ గుప్త, నిఖిల్, శ్రేయస్ జైన్
దర్శకత్వం: నితేష్ తివారి
నిర్మాత: సాజిద్ నడియాడ్ వాలా, ఐశ్వర్య అయ్యర్ తివారి
విడుదల తేది: జూలై 21, 2023
ఓటీటీ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో
అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ తెలుగులో 'దేవర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు అలరించేందుకు రెడీ అయింది. కానీ, దానికంటే ముందే ఓటీటీలో 'బవాల్' (Bawaal Movie) మూవీతో సందడి చేసింది. హిందీలో తెరకెక్కిన 'బవాల్' సినిమాను హిందీతోపాటు తెలుగు, తమిళంలో కూడా నేరుగా అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల చేశారు. 'దంగల్', 'చిచ్చోరే' సినిమాలతో సౌత్ ఆడియెన్స్ కు దగ్గరైన నితేష్ తివారి 'బవాల్'కు దర్శకత్వం వహించారు. ఇందులో జాన్వీ సరసన వరుణ్ ధావన్ నటించాడు. జూలై 21 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న 'బవాల్' (Bawaal Review Telugu) ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ: అజయ్ దీక్షిత్ అలియాస్ అజ్జు భాయ్ (వరుణ్ ధావన్) సాధారణ హిస్టరీ టీచర్. కానీ, అతనికి లక్నోలో బీభత్సమైన పాపులారిటీ ఉంటుంది. కంటెంట్ లేకున్నా కటౌట్ బాగుండాలన్న ఉద్దేశంతో లేనిపోని గొప్పలు, అబద్ధాలతో తన ఇమెజ్ ను క్రియేట్ చేసుకుంటాడు.
అలాగే నిషాను (జాన్వీ కపూర్) పిట్స్ ఉందని తెలిసినా పెళ్లి చేసుకుంటాడు. కానీ, పెళ్లయిన రోజు నుంచి భర్తగా మాత్రం ఉండడు. ఒకే గదిలో ఉన్న వేర్వేరుగా ఉంటారు. ఈ సమయంలోనే ఎమ్మెల్యే కోపానికి గురై నెలరోజులు సస్పెండ్ అవుతాడు అజ్జు భాయ్. దీంతో భార్య నిషాతోపాటు ఫారెన్ టూర్ వేస్తాడు.

ఆసక్తిర విషయాలు: ఎమ్మెల్యేకు కోపం రావడానికి అజ్జు చేసిన పనేంటి? అసలు ఆ ఫారెన్ టూర్ ఎందుకు? నిషాను తీసుకుని వెళ్లేందుకు కారణం ఏంటీ? వరల్డ్ వార్ 2 ఘటన అజయ్, నిషాలో ఎలాంటి ఆలోచనలను తీసుకొచ్చింది? మరి అజయ్ టీచర్ గా సస్పెండ్ అయ్యాడా? నిషాను భార్యగా అజయ్ అంగీకరించాడా? వంటి అంశాలు తెలియాలంటే బవాల్ మూవీ (Bawaal Movie Review) చూడాల్సిందే.

విశ్లేషణ: ఇదొక సింపుల్ స్టోరి. ప్రతి ఒక్కరూ జీవితంలో తమకు లేని దాని గురించే ఆరాటపడుతుంటారు. కానీ, మన దగ్గర ఉన్నదాన్ని చూసి సంతోషించరు. గొప్పలతో ఒక సూపర్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తిని వరల్డ్ వార్ 2 తాలుకు భయానక ఘటనలు ఎలా మార్చాయన్నదే బవాల్ సినిమా. నిజానికి అజ్జు భాయ్ లాంటి క్యారెక్టర్లు మనకు రెగ్యులర్ గా తగులుతూనే ఉంటారు.
విషయం ఏం లేకపోయినా నలుగురిలో గొప్పగా, హుందాగా గౌరవంగా ఉండాలని ఆరాటపడుతూ ఊహల్లో జీవిస్తుంటారు. కానీ, రియాలిటీని యాక్సెప్ట్ చేయకుండా తప్పించుకుంటూ బాధపడుతుంటారు. అదే విషయాన్ని బవాల్ లో చెప్పారు మేకర్స్.

వరల్డ్ వార్ 2 సీన్స్: బవాల్ కొత్త కథేం కాకున్నా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తలకు. కాకపోతే సినిమా స్టార్టింగ్ తోనే ఎండింగ్ ఏంటో గెస్ చేయొచ్చు. సినిమా ఊహించినట్లుగానే సాగుతుంది. కానీ కొన్ని డైలాగ్స్, సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. వరల్డ్ వార్ 2 జరిగిన సిటీల్లో అజయ్-నిషా తిరిగే సన్నివేశాలు, బాండిగ్ మెరుగుపడే సీన్స్ బాగున్నాయి. వరల్డ్ వార్ 2 గురించి చెప్పే సీన్స్ కూడా బాగున్నాయి. కానీ కొంచెం అవి సాగదీతలా ఉన్నాయి.
క్లైమాక్స్ అలా: మనం జీవిత కాలంలో బాధపడే విషయాలు వరల్డ్ వార్ 2 తర్వాత బందీలుగా మారిన వారు గడిపే ఒక్కరోజుకు సమానం అంటూ పలు సంభాషణతో ఎమోషన్ చూపించారు. ఇతరుల స్వేచ్ఛ కోసం సైనికులు అమరులైన తీరు, భార్యాభర్తలకు కామన్ ఇష్టాలు ఉండాల్సిన అవసరం లేదు వంటి పలు సన్నివేశాలతో హృద్యంగా సినిమాను ఆవిష్కరించారు. ఇక క్లైమాక్స్ ఎలా ఉంటుందో ముందే ఊహించవచ్చు. పాటలు బాగున్నాయి. బీజీఎమ్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు, వరల్డ్ వార్ 2 సీన్స్ సినిమాటోగ్రఫీ అంతా చక్కగా ఉన్నాయి.

ఎవరెలా చేశారంటే?: సోషల్ మీడియాలో అదిరిపోయేలా అందాల విందు చేసే జాన్వీ కపూర్ నటనలో ఎమోషన్స్ తో ఆకట్టుకుంది. రియాలీటీలో బతికే నిషా పాత్రలో ఒదిగిపోయింది. ఇక అజ్జు భాయ్ గా వరుణ్ ధావన్ సైతం మెప్పించాడు. మిగతా నటీనటులందరు ఆకట్టుకున్నారు. ఫైనల్ గా చెప్పాలంటే.. ఊహించనట్లుగా సాగిన ఎలా జీవించాలో హృదయానికి హత్తుకునే సీన్లతో చెప్పే సినిమా 'బవాల్'. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేని ఈ సినిమాను వీకెండ్ లో టైమ్ చూసుకుని ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. (Bawaal Movie Review)


Click it and Unblock the Notifications











