Jatadhara Movie Review: జటాధర మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
1.5/5

శివ (ఘోస్ట్ హంటర్). ఆత్మలు, దయ్యాలు కోసం పాడుబడిన పురాతన భవనాలను శోధిస్తుంటాడు. ఆత్మలు ఉన్నాయా? లేదా? అనే విషయంపై ఓ గ్రంథాన్ని రాయాలని నిర్ణయించుకొంటారు. సితార (దివ్య ఖోస్లా)తో ప్రేమలో ఉంటాడు. తన పరిశోధనలో భాగంగా రుద్రాయ నగరం గ్రామానికి వెళ్లడం చూసి తల్లిదండ్రులు (రాజీవ్ కనకాల, ఝాన్సీ) ఆందోళనకు గురి అవుతారు. ఆ గ్రామానికి వెళ్ల కూడదని ప్రాధేయపడుతారు. శివ గతం గురించి అసలు విషయం చెబుతారు.

శివ గతం ఏమిటి? రుద్రాయపురానికి శివకు ఉన్న సంబంధమేమిటి? ఆ గ్రామంలో పురాతన భవనంలో ధన పిశాచి (సోనాక్షి సిన్హా) ఎందుకు తిష్ట వేసింది? రుద్రాయపురంలో నిధుల వేట విషయంలో ఏం జరిగింది? తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి శివ చేసిన ప్రయత్నం ఏమిటి? తన తల్లిదండ్రుల ఆత్మలు శాంతింప చేయడానికి, వారికి మోక్షం కలిగించడానికి శివ ఏం చేశాడనే ప్రశ్నలకు సమాధానమే జటాధర సినిమా కథ.

Jatadhara Movie Review and Rating in Telugu  Sudheer Babu fails to impact as Ghost hunter

పేరేంట్స్ సెంటిమెంట్ ప్రధాన అంశాన్ని ఎంచుకొని దాని చుట్టూ తాంత్రిక శక్తులు, ధన పిశాచి లాంటి ఎలిమెంట్స్‌తో తాను ఊహించిన కొన్న పాయింట్ బాగుంది. కానీ పూర్తిస్థాయి కథగా, పక్కాగా సన్నివేశాలను రాసుకోవడంలో దర్శకులు వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దారుణంగా విఫలమయ్యారు. సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్ లాంటి స్టార్ యాక్టర్లు ఉన్నా వారికి సరైన క్యారెక్టర్‌ను డిజైన్ చేయలేకపోవడం తమ ప్రయత్నాలు బెడిసికొట్టేలా చేశాయి. పేలవమైన కథను కూడా సుధీర్ బాబు నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరైందనే చెప్పాలి. సుధీర్ బాబు క్యారెక్టర్‌ను కూడా సరిగా డిజైన్ చేయలేకపోవడం, ఆయనకు జోడిగా నటించిన క్యారెక్టర్‌ను సరిగా కనెక్ట్ చేయలేకపోవడం మరో మైనస్. ఇక పేరెంట్స్ సెంటిమెంట్ అనే పాయింట్‌ను బలంగా చెప్పలేకపోవడం ఈ సినిమాకు ఉన్న పర్పస్ నీరు గారిపోయింది. ఓవరాల్‌గా ఈ సినిమాను యావరేజ్‌గా కూడా దర్శకులు మార్చలేకపోరారు.

ఇక నటీనటులు విషయానికి వస్తే.. తన పాత్ర సరిగా లేకపోవడం వల్ల సుధీర్ బాబు కూడా ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకుపోలేకపోయాడనిపిస్తుంది. తన వంతు ప్రయత్నంగా కొత్త అనుభూతిని పంచేందుకు శాయశక్తుల ప్రయత్నించాడనిపిస్తుంది. నిజాయితీగా తన పాత్రలో దూరిపోయి తన ప్రతిభను చాటుకొనేందుకు కృషి చేశాడనిపిస్తుంది. ఇక సోనాక్షి సిన్హా పాత్ర గురించి ఎంత తక్కువగా చెప్పుకొంటే అంత మంచిది. తెలుగులో ఎంట్రీ అంటే ఆమెపై అంచనాలు పెట్టుకోవడం సహజం. ధన పిశాచి అనే పాత్రకు ఎలాంటి బలం లేకపోవడం వల్ల పూర్తిగా తేలిపోయింది. శిల్పా శిరోద్కర్ కూడా ఈ సినిమాపై ప్రభావం చూపలేపోయింది. ఈ సినిమాలో కనిపించిన ప్రతీ పాత్ర కూడా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయిందని అనిపిస్తుంటుంది.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమా వరకు కొంతలో కొంత మ్యూజిక్ హడావిడి చేసింది. సినిమాటోగ్రఫి ఫర్వాలేదనిపిస్తుంది. కలర్‌పుల్‌గా స్క్రీన్‌ కనిపించేలా సినిమాటోగ్రాఫర్ తన లెవెల్‌లో అవుట్ పుట్ అందించారు. గ్రాఫిక్స్ కూడా పేలవంగా ఉన్నాయి. పూర్తిగా చెప్పాలంటే.. హడావిడిగా సినిమాను చుట్టేశారా? అనే విధంగా ప్రొడక్షన్ వాల్యూస్ తెర మీద కనిపించాయి. థియేటర్‌కు వచ్చి చూడాల్సిందే అనేంతగా ఈ సినిమాలో గొప్ప కథ, కథనం, నటీనటుల పెర్ఫార్మెన్స్ కనిపించవు. ఈ సినిమా చూడాలనుకొంటే.. మరి కొద్ది రోజుల్లో ఓటీటీలోకి రావడం ఖాయం. అంత వరకు వెయిట్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X