Jatadhara Twitter Review: జటాధర ట్విట్టర్ రివ్యూ

జీ స్టూడియో సమర్పణలో ఉమేశ్ కేఆర్ బన్సాల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మించిన చిత్రం జటాధర. సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కీలకపాత్ర పోషిస్తున్నారు. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్‌లు ఈ జటాధర చిత్రానికి దర్శకత్వం వహించారు. శిల్పా శిరోద్కర్, దివ్య ఖోస్లా, శ్రేయా శర్మ, ఇందిరా కృష్ణన్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, రవి ప్రకాష్, ఝాన్సీ, రోహిత్ పాఠక్‌ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ జటాధర చిత్రానికి రాజీవ్ రాజ్ సంగీత దర్శకత్వం వహించారు. సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ప్రభాత్ ఠాకూర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, సంధ్య శర్మ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

విజయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు సుధీర్ బాబు. టీజర్, ట్రైలర్లు, ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. నవంబర్ 7వ తేదీన జటాధర ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో నెటిజన్లు, క్రిటిక్స్, సినీ ప్రమఖుల అభిప్రాయాల్లోకి వెళితే...

Jatadhara Movie Twitter Review in Telugu  Will Sudheer Babu hits bulls eye

జటాధర సాలీడ్ పర్ఫార్మెన్స్, గ్రిప్పింగ్ కథనంతో ఉత్కంఠభరితమైన అనుభవాన్ని అందిస్తుంది. సోనాక్షి సిన్హా ధన పిశాచినిగా మెరిసింది. ఇప్పటి వరకు ఆమె పోషించిన అత్యంత అద్భుతమైన పాత్రలలో ఇది ఒకటి. రొమాంటిక్ క్యారెక్టర్ల నుంచి డార్క్, ఇంటెన్స్ క్యారెక్టర్స్ వైపు తనను తాను మార్చుకుని తెరపై తనదైన ముద్ర వేసుకుంది. ఘోస్ట్ హంటర్‌గా సుధీర్ బాబు కూడా అంతే ఆకట్టుకున్నాడు. అతని ఉనికి కథకు డెప్త్‌ను జోడిస్తుంది. స్క్రీన్ ప్లే స్పష్టంగా ఉంది. కథ ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తుంది. నేపథ్య సంగీతం ఈ సినిమా వాతావరణాన్ని పరిపూర్ణంగా పెంచుతుంది. బ్లాక్ మేజిక్ గురించి అవగాహన కలిగిస్తుంది. ఫైనల్‌గా జటాధర అనేది పైసా - వసూల్, సూపర్ నేచురల్ హారర్ ఎంటర్‌టైనర్. బిగ్‌స్క్రీన్‌పై ఆస్వాదించడానికి రూపొందించబడింది.

జీ స్టూడియోస్, ప్రేరణ అరోరాలు బలమైన భావోద్వేగాలను రేకెత్తించే సాగాను అందించారు. జటాధర సూపర్ నేచురల్ థ్రిల్లర్‌లలో ఒకటి. భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతికతతో ఇంతటి అద్భుతమైన చిత్రాన్ని రూపొందించిన క్రెడిట్ జీ స్టూడియెస్, ప్రేరణ అరోరాలకు దక్కుతుంది. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్‌లు దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. పురాణాలు, సీక్రెట్, భావోద్వేగాలను మిళితం చేసి ఓ మంచి సినిమాటిక్ అనుభవంగా భారతీయ ఆధ్యాత్మిక లెన్స్‌ ద్వారా భయానక శైలిని తిరిగి ఊహించుకుంటుంది.

ఫస్ట్ ఫ్రేమ్ నుంచే ఇది టోన్‌ను సెట్ చేస్తుంది.. కథ గడిచేకొద్దీ సుధీర్ బాబు పోషించిన శివుడిని మనకు పరిచయం చేస్తుంది. ఓ పురాతన శాపంతో ముడిపడి ఉన్న ఓ వింతైన రహస్యంలోకి, సోనాక్షి సిన్హా పోషించిన ధన పిశాచిని వెంటాడే ప్రపంచంలోకి లాగబడతాడు. సాంకేతికంగా జటాధర ఆశ్చర్యపరుస్తుంది. అత్యున్నత స్థాయి సినిమాటోగ్రఫీ అందించేందుకు కృషి చేసిన బృందానికి ప్రత్యేక అభినందనలు. విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై ప్రభావాన్ని చూపుతాయి.

సుధీర్ బాబు అత్యంత శక్తివంతమైన పాత్రలో.. సవాల్‌తో కూడిన క్లైమాక్స్‌లో కెరీర్‌లో గుర్తుండిపోయే నటనను కనబరిచాడు. సోనాక్షి సిన్హా భయంకర రూపంలో అద్భుతమైన నటను అందించారు. ఈ పాత్రలు సినిమా చూసిన తర్వాత మిమ్మల్ని వెంటాడుతాయి. జటాధరను ప్రత్యేకంగా నిలబెట్టింది మాత్రం కథే చెప్పే విధానమే. మానసిక స్ధితి, నిశ్శబ్ధం, నమ్మకం ద్వారా భయాన్ని పెంచింది. మొత్తంగా జటాధర భావోద్వేగాలతో కూడిన ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్ అని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.

జటాధర మైథలాజికల్ థ్రిల్స్‌ను అందిస్తుంది. సుధీర్ బాబు సూపర్బ్, సోనాక్షి సిన్హా బాగుంది. ఈ సినిమా సుధీర్ బాబు పాత్ర చుట్టూ తిరుగుతుంది. అతను పురాతన అనంత పద్మనాభ స్వామి ఆలయంలో దాగిన ఆచారాలను పరిశోధిస్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X