సాధారణ జయం!

By Staff

Jayam
- జలపతి
చిత్రం: జయం
నటీనటులు: నితిన్‌, సదా, గోపీచంద్‌, షకీల
సంగీతం: ఆర్పీ పట్నాయక్‌
కథ, మాటలు, నిర్మాత, దర్శకత్వం: తేజ

ఒక్కముక్కలో ఈ సినిమా గురించి చెప్పాలంటే - యావరేజ్‌ చిత్రం. చక్కగా ప్రారంభమై పేలవంగా ముగిసిన చిత్రం ఇది అని చెప్పాలి. మంచి పట్టుతో సాగి..దర్శకుడు తేజ ఎలా ముగించాలో తెలియక, కన్ఫ్యూజ్‌ అయ్యి రోటీన్‌ క్లైమక్స్‌ పెట్టడంతో సినిమా అతి సాధారణంగా అన్పిస్తుంది. చూస్తున్నంత సేపు బాగుంది అనిపించి..క్లైమాక్స్‌ లో ఇదేంటి ..ఇంత పేలవంగా ముగిసింది.. ఇంత ఇమెచ్యుర్‌ గా ఉందేంటి అని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. కథనం, చక్కటి టెక్నికల్‌ విలువలున్నా, అంతకన్నా ఎక్కువ లోపాలతో తీసిన సాధారణ చిత్రం- జయం. అయితే, ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలే ఎక్కువగా ఉన్నాయి. చక్కటి సంగీతం, చిత్రీకరణ, నటీనటుల అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్‌, బోర్‌ కొట్టించకుండా తీసిన విధానం..ఇలా అన్ని కలిసి సినిమాను చూడదగ్గట్టుగా తయారు చేశాయి.

అయితే ప్రథమార్థంలో ఉన్న పట్టు సెకండాఫ్‌ లో లేకపోవడం పెద్ద మైనస్‌ పాయింట్‌. కథ చాలా పాత కథ. అర్థం లేని కథ ఒక విధంగా. కానీ ప్రథమార్థంలో ప్రేమను ఫాస్ట్‌ గా ...పాటలతో రూపొందించడంతో హాయిగా సాగుతుంది. ద్వితీయార్థంలోనే లోపాలు ఎక్కువ. హీరోను ఎంత కొట్టినా, దేవుడి జెండా పట్టుకుంటే...బలం వచ్చేస్తుందనేది ఏ లాజిక్‌ కు అందదు. ఇలాంటి ఛీఫ్‌ ఫాంటసీ ట్రిక్స్‌ తో సినిమాను చివర్లో తేజ చెడగొట్టాడు.

సదాను చూడగానే నితిన్‌ ప్రేమిస్తాడు. ఇద్దరూ బి.కాం ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులు. నితిన్‌ మరీ నిరుపేదవాడు. సదాకు చిన్నప్పుడే వాళ్ళ బావ గోపీచంద్‌ తో పెళ్ళి ఖాయమవుతుంది. సదా అంటే గోపిచంద్‌ కు ఇష్టముండదు. కానీ ఆమె అందమంటే ఇష్టం. అందుకే పెళ్ళి ఒప్పుకుంటాడు. సో..హీరో..హీరోయిన్ల ప్రేమకు ఇతనే విలన్‌. ఈ విలన్‌ ఎదుర్కొని అడవిలో పెళ్ళిచేసుకోవడంతో సినిమా ముగుస్తుంది.

ఇలాంటి 'బాల్యవివాహాల' మీద దర్శకుడి తేజకు మక్కువ ఏమిటో అర్థం కాదు కానీ...నువ్వునేను..హ్యాంగోవర్‌ నుంచి ఆయన బయటపడలేదు. ప్రేమలో పడడం, అడ్డంకులు రావడం...ఆ తర్వాత కలవడం అనే అంశం మీదే సినిమా అంతా నడిపించడం అనేది ఆయన నువ్వునేనులో చూపించాడు. అదే జయంలోనూ చూపించాడు. కానీ హీరోను గొడ్డలితో కొట్టినా...పారిపోయి...ట్రెయిన్‌ ఎక్కడం అనేది పక్కా సినిమాటిక్‌ అంశం. హీరోను గోపిచంద్‌ చితకబాదుతాడు. వాడు సొమ్మసిల్లిపడిపోతే..హీరోయిన్‌ కపిరాజు ఉన్న జెండా ఇస్తే..ఒక్కసారిగా విలన్‌ హీరో చావగొడుతాడు. ఇలాంటి సినిమాటిక్‌ అంశాలు చాలా చికాకుగా అన్పిస్తాయి. బి.గోపాల్‌ సినిమాలాంటి టెక్నిక్స్‌ తేజ సినిమాలో చూడడం విషాదకరమైన విషయం.

అందరికన్నా విలన్‌ గా నటించిన గోపిచంద్‌ నటన అద్భుతం. చాలా బాగా నటించాడు. కొత్త కుర్రాడు నితిన్‌, హీరోయిన్‌ సదా కూడా ఇద్దరు ఎస్టాబ్లిషడ్‌ యాక్టర్స్‌ లా నటించారు. ఆర్పీ పట్నాయక్‌ సంగీతం, సమీర్‌ రెడ్డి ఫోటోగ్రఫీ ఈ చిత్రానికి హైలెట్‌. సెకండ్‌ హాఫ్‌ లో 'యాక్షన్‌ ' మీద కాకుండా...కథనం మీద దర్శకుడు తేజ దృష్టిపెట్టివుంటే..మరో మంచి చిత్రం అయ్యేది. షకీలా ఈ చిత్రంలో ఎందుకో అర్థం కాదు. ఆమె పాత్రకు అర్థంపర్థం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X