twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jayamma Panchayathi Movie Review : జయమ్మ హిట్టు కొట్టిందా?.. సినిమా ఎలా ఉందంటే?

    |

    రేటింగ్:2.5/5
    నటీనటులు: సుమ కనకాల, దేవి ప్రసాద్ ,దినేష్ కుమార్, షాలిని, జబర్దస్త్ త్రినాధ్, తదితరులు
    దర్శకుడు: విజయ్ కుమార్ కలివరపు
    నిర్మాత: బలగ ప్రకాష్
    సంగీతం: ఎం.ఎం. కీరవాణి
    సినిమాటోగ్రఫీ: అనూష్ కుమార్


    తెలుగు సినీ పరిశ్రమకు యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీరియల్ నటిగా తెలుగు ప్రజలకు పరిచయం అయిన ఆమె ఎంతో కాలంగా తెలుగులో తిరుగులేని యాంకర్ గా తన ప్రస్థానం కొనసాగిస్తోంది. ఆమె అడపాదడపా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేయడమే కానీ ఇప్పటి వరకు నేరుగా ఏ సినిమాలో పూర్తి స్థాయి పాత్రలో నటించలేదు. ఆమె పూర్తి స్థాయి పాత్రలో నటించిన చిత్రం జయమ్మ పంచాయితీ. విజయ్ కుమార్ కలి వరపు అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మరో హీరోయిన్ ఎవరైనా నటించి ఉంటే ఇంత ప్రచారం జరిగి ఉండకపోవచ్చు. ఇండస్ట్రీలో అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తూ ఉంటే సుమ సినిమా చేసింది కాబట్టి సినీ పరిశ్రమలో అందరూ ముందుకు వచ్చి ఆమె సినిమాను ప్రమోట్ చేశారు, ఈ నేపథ్యంలో ఆమె నటించిన జయమ్మ పంచాయితీ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను జయమ్మ పంచాయితీ సినిమా అందుకుందా లేదా అనేది సమీక్షలో తెలుసుకుందాం.

    జయమ్మ పంచాయతీ కథ ఏమిటంటే:

    జయమ్మ పంచాయతీ కథ ఏమిటంటే:


    శ్రీకాకుళం జిల్లా పాలకొండ దగ్గర ఉన్న ఒక చిన్న పల్లెటూరిలో తన భర్త(దర్శకుడు దేవి ప్రసాద్), ఇద్దరు ఆడపిల్లలతో ప్రశాంతమైన జీవితం సాగిస్తూ ఉంటుంది జయమ్మ. భర్త మంచితనంతో ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకుని కౌలుకి పొలం చేస్తూ ఉన్నంతలో తృప్తిగానే బతుకుతూ ఉంటుంది. ఊరిలో అందరికీ తలలో నాలుకలా వ్యవహరించే జయమ్మ అంటే ఊరు అందరూ కూడా భయపడుతూ ఉంటారు. తన పెద్ద కుమార్తె పుష్పవతి అయిన సమయంలో భర్తకు గుండె జబ్బు ఉన్న సంగతి తెలుసుకుంటుంది. అయితే కుమార్తె పుష్పవతి ఫంక్షన్ రోజున తమ ప్రాంతంలో ఎంతో కాలంగా వస్తున్న చదివింపులు కార్యక్రమంతో వచ్చిన డబ్బుతో భర్త గుండె ఆపరేషన్ చేయించుకోవచ్చు అనుకుంటుంది. అయితే అనుకున్నంత డబ్బు రాక పోవడంతో భర్తను కాపాడుకోవడం కోసం ఏం చేసింది? గుండె జబ్బుతో బాధ పడుతున్న జయమ్మ భర్త బతికాడా? భర్తను బతికించుకోవడం కోసం జయమ్మ పెట్టిన పంచాయితీ ఏమైంది అనేదే ఈ సినిమా కథ.

    మొదటి భాగం ఎలా ఉందంటే

    మొదటి భాగం ఎలా ఉందంటే


    సినిమా మొదలవడంతోనే పూర్తిగా శ్రీకాకుళం జిల్లాలోని ఒక మారుమూల పల్లెటూరిలో మొదలవుతుంది. మొదటి భాగం చాలా వరకు ఊరు, ఊరులో ఉన్న వ్యక్తుల పరిచయం అలాగే జయమ్మకు వచ్చిన కష్టాన్ని పూర్తిగా పరిచయం చేసే ప్రయత్నం చేశారు. మొదటి భాగం ఎక్కడా కూడా సాగదీసినట్లు అనిపించకుండా చెప్పాల్సిన విషయాన్ని ప్రేక్షకులకు అర్థం అయ్యే విధంగా రూపొందించారు. ఎక్కడా కూడా సినిమా చూస్తున్న ఫీలింగ్ కలగదు నిజంగా మనం అదే శ్రీకాకుళం జిల్లాలోని ఊరిలో ఉన్నామేమో అనే అనుభూతి కలిగించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. మొదటి భాగం అంతా కూడా జయమ్మకు పంచాయితీ పెట్టే అవసరం ఏమి వచ్చింది అని చూపించడంలో దర్శకుడు సక్సెస్ సాధించాడు.

    ఇక రెండవ భాగం ఎలా ఉందంటే

    ఇక రెండవ భాగం ఎలా ఉందంటే


    ఎవరూ ఊహించని విధంగా పంచాయితీకి ఎక్కిన జయమ్మ తన భర్తను ఆ పంచాయితీ వల్ల కాపాడుకో గలిగిందా లేదా అనే విషయాన్ని రెండో భాగంలో చూపించారు. మొదటి భాగం అంతా కూడా జయమ్మకు పంచాయితీ పెట్టే అవసరం ఏమొచ్చింది అని చూపించడంలో సఫలమైన దర్శకుడు రెండో భాగం మాత్రం కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. జయమ్మ పెట్టిన పంచాయితీలో ఆమెకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? తమ ఊరి వాళ్ళ మీదే పంచాయతీ పెట్టిన జయమ్మ చివరికి ఏం చేసింది? ఫైనల్ గా జయమ్మ తన భర్తను ఎలా కాపాడుకుంది అనే విషయాన్ని ఆసక్తికర రీతిలో తెరకెక్కించారు.

     దర్శకుడి టేకింగ్ విషయానికి వస్తే

    దర్శకుడి టేకింగ్ విషయానికి వస్తే

    అద్దిల్లు అనే ఒక షార్ట్ ఫిలిం చేసి ఇండస్ట్రీ వర్గాలలో మంచి పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్, తమ ప్రాంతాన్ని సినిమాగా చూపించాలని ఉద్దేశంతో ఈ సినిమా తెరకెక్కించారు. సినిమా ఆద్యంతం కూడా శ్రీకాకుళం జిల్లాలో షూట్ చేశారు. బహుశా అందుకేనేమో ఎక్కడా కూడా సినిమా చూస్తున్న భావన కలగదు నిజంగా మనం కూడా అదే ఊరిలో ఉన్నామనే భావన కల్పించడంలో దర్శకుడు సఫలం అయ్యారు. శ్రీకాకుళం భాష, యాస బాగా తెలియడంతో అక్కడి మాండలికాన్ని ఆ మాండలికంలో ఉన్న ఆప్యాయతను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి ఆకట్టుకున్నాడు. కథ కథనం కూడా బాగా కుదిరాయి కానీ రెండో భాగంలోనే కొంత తగ్గించి ఉండొచ్చనే అభిప్రాయం ఏర్పడుతుంది. ఇప్పటికీ పల్లెటూరు వ్యక్తులు, వారి మనస్తత్వాలు ఎలా ఉన్నాయి? కులాల పట్ల వారి అవగాహన ఎలా ఉంది? అనే విషయాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. మొదటి సినిమాతోనే విజయ్ కుమార్ మంచి పేరు తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

    సుమ కనకాల నటన విషయానికి వస్తే

    సుమ కనకాల నటన విషయానికి వస్తే


    తన యాంకరింగ్ తో ప్రేక్షకుల అందరినీ ఆకట్టుకునే సుమ మొట్టమొదటిసారి చేసిన పూర్తి స్థాయి పాత్రలో లీనమైపోయింది. సుమ జయమ్మ పాత్రలో నటించింది అనేకంటే జీవించింది అనడం మేలు. ఎక్కడో కేరళలో పుట్టి తెలుగు యాంకర్ గా స్థిరపడిన సుమ ఏ మాత్రం పరిచయం లేని శ్రీకాకుళం మాండలికంలో డైలాగులు పలకడమే కాక అసలు పుట్టి పెరిగింది శ్రీకాకుళంలోని అనిపించేంతగా పాత్రలో ఇమిడిపోయింది. ఒక గృహిణిగా భర్త ప్రాణాల కోసం పాకులాడే వ్యక్తిగా, ఎలాంటి విషయంలో వెనకడుగు వేయని వ్యక్తిగా ఇలా అనేక షేడ్స్ ఉన్న పాత్రలో నటించి సుమ మెప్పించింది.

    మిగతా నటీనటుల విషయానికి వస్తే

    మిగతా నటీనటుల విషయానికి వస్తే


    సినిమాలో సుమ భర్త పాత్రలో నటించిన దేవి ప్రసాద్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. నటుడిగా మారిన ఆయన లో మరింత ఈజ్ కనిపించింది. ఇక జబర్దస్త్ త్రినాథ్ తప్ప మిగతా పాత్రలు ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. కానీ నిజంగా ఆ గ్రామస్తులు అనే భావన కలిగించే విధంగా తమ తమ పాత్రల్లో ఇమిడిపోయారు. ఎక్కడా కూడా సినిమా చూస్తున్న ఫీలింగ్ కలగకుండా నిజంగానే ఆ ఊరిలో ఎక్కడైనా సీక్రెట్ కెమెరాలు పెట్టారేమో అనిపించేంత న్యాచురల్ గా నటీనటుల పెర్ఫార్మెన్స్ ఉంది.

    టెక్నికల్ పరంగా చూస్తే

    టెక్నికల్ పరంగా చూస్తే


    ఈ సినిమాకి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విజయ్ కుమార్ తన మొదటి ప్రయత్నంలోనే అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక ఈ సినిమాకు బాగా ప్లస్ సినిమాటోగ్రఫీ. సాధారణంగా శ్రీకాకుళం జిల్లా అంటే బాగా వెనుకబడిన ప్రాంతం అని చెబుతూ ఉంటారు. కానీ చుట్టూ కొండలతో ప్రకృతి తో కూడిన అందాలను కూడా చూపించవచ్చు అని సినిమాటోగ్రాఫర్ అనూష్ కుమార్, ఈ సినిమా ద్వారా నిరూపించారు. సినిమాకి సంగీతం అందించిన కీరవాణి నేపథ్య సంగీతం బాగా ప్లస్ అయ్యింది. నిర్మాతలు కొత్త వారు అయినా ఎక్కడా కూడా రాజీ పడినట్లు కనిపించలేదు. అయితే రెండో భాగం ఈ విషయంలో ఎడిటింగ్ టేబుల్ మీద కొంచెం శ్రద్ధ వహిస్తే బాగుండు అనిపిస్తుంది.

    ఫైనల్ గా

    ఫైనల్ గా


    యాంకర్ సుమ మొదటి సారి చేసిన పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమిది. యాంకర్ సుమ మొదటి ప్రయత్నంలోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీకాకుళం యాస లో అక్కడక్కడ దొర్లే కొన్ని బూతు పదాలు(వారు వాటిని బూతులు అని కూడా అనుకోరు) తప్ప మిగతా ఎక్కడా కూడా అశ్లీలత, అసభ్యతకు తావు లేకుండా పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుంది. యాంకర్ సుమలో ఇంత మంచి నటి కూడా ఉందా అని తెలిసేలా చేసిన ఈ సినిమా వన్ టైమ్ వాచబుల్.

    English summary
    Jayamma Panchayathi Movie Review : Suma kanakala steals the show
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X