యావరేజి జైచిరంజీవ

By Staff

Jai Chiranjeeva
-జోశ్యుల సూర్యప్రకాష్‌
సినిమా: జై చిరంజీవ
నటీనటులు: చిరంజీవి, సమీరారెడ్డి, భూమిక, అర్బాజ్‌ఖాన్‌,
బ్రహ్మానందం, వేణుమాధవ్‌, ఎంఎస్‌ నారాయణ, సునీల్‌,
ధర్మవరపు సుబ్రమణ్యం, రాహుల్‌దేవ్‌, ఎవిఎస్‌, సుధ తదితరులు
సంగీతం: మణిశర్మ
ఆర్ట్‌: ఆనంద్‌ సాయి
కెమెరా: వేణు
కథ, మాటలు: త్రివిక్రం
దర్శకత్వం: విజయభాస్కర్‌
నిర్మాత: సి. అశ్వనీదత్‌

'ఇంద్ర', 'టాగూర్‌' వంటి సామాజిక స్పృహగల సబ్జెక్టులతో ప్రేక్షకులను అలరించిన చిరంజీవి రూటు మార్చి లైటర్‌వీన్‌ డైరెక్టర్‌ విజయభాస్కర్‌తో చేసిన చిత్రం 'జై చిరంజీవ'. వ్యక్తిగత పగ తీర్చుకునే హాలివుడ్‌ హిట్‌ 'పే బ్యాక్‌'ను ఆధారంగా చేసుకుని ఈ చిత్రం రూపొందించారు. మాస్‌ను అలరించే అంశాలు ఉన్నా కథనం పూర్తిగా ఇంగ్లీషు సినిమాలా సాగడంతో ఫీల్‌ మిస్సై నిరాశ కలిగిస్తుంది. కథనంలో నేటివిటీ లేకపోయినా చిరంజీవి నటన చెప్పుకోదగిన స్ధాయిలో ఉంది.

సత్యనారాయణ మూర్తి (చిరంజీవి) అమలాపురం నుంచి హైదరాబాద్‌ రావడంతో చిత్రం ప్రారంభమవుతుంది. మిత్రుడు వేణు (వేణు మాధవ్‌)తో కలిసి ఓ అపార్టుమెంటులో దిగుతాడు. పక్క ఫ్లాట్‌లో ఉండే శైలజ (సమీరారెడ్డి)తో పరిచయమై ప్రేమకు పాటలకు దారితీస్తుంది. సత్యం హైదరాబాద్‌ రావడానికి పెద్ద ఫ్లాష్‌బ్యాక్‌ ఉంది. అతని మేనకోడలు నాలుగేళ్ళ పాప స్కూల్‌లో చేరడానికి అమలాపురం నుంచి వచ్చి హత్యకు గురవుతుంది. ఆ హత్య చేసింది అంతర్జాతీయ ఆయుధ వ్యాపారి. తుపాకి అమ్ముకుంటూ డిమాన్ర్‌స్టేషన్‌ నిమిత్తం జరిపిన కాల్పుల్లో పాప మరణిస్తుంది. ప్రాణాధికంగా పెంచిన పాప ఇలా బలి కావడంతో సత్యం ఆవేశంతో రగిలిపోతుంటాడు. హైదరాబాద్‌ వచ్చి ఆరా తీస్తాడు. ఒకొక్కరిని పట్టుకుని ఆరా తీస్తూ చంపుతూ ప్రధాన విలన్‌ అమెరికాలో ఉన్నాడని తెలుసుకుంటాడు. ప్రవాస భారతీయురాలైన నీరజ (భూమిక) సాయంతో అమెరికా చేరి పగ ఎలా తీర్చుకున్నాడన్నది మిగితా కథ.

సాధారణంగా ఆంగ్ల చిత్రాలను తెలుగులోకి మార్చేటప్పుడు సాధ్యమైనంత వరకు నేటివిటీ ఉండేలా చూసుకుంటారు రచయితలు. ఆ విషయంలో ఈ సినిమా సక్సెస్‌ అయినా, కొన్ని సన్నివేశాలను యధాతధంగా తీయడంతో ఆంగ్ల సినిమాను చూస్తున్న అనుభూతే కలుగుతుంది. 'పే బ్యాక్‌' సినిమాలో హీరో భార్య తన వ్యాపార భాగస్వామితో కలిసి డబ్బుతో సహా లేచిపోతుంది. హీరో మారణకాండ మొదలుపెట్టి తన డబ్బును తిరిగి సంపొదించుకుని బుద్ధి చెబుతాడు. అయిన వాళ్ళు మోసం చేయడం డ్రైవింగ్‌ ఫోర్స్‌లా ఆ సినిమాలో కథనం పరుగులు పెడుతుంది. ఈ సినిమాలో చంపిన వాళ్ళను చంపడం అనేది వ్యక్తిగత కక్షలా మారింది. తన మేనకోడలు వంటి వారు బలికాకూడదన్న లక్ష్యంతో కక్షబూనితే బాగుండేది. ఫార్ములా ప్రకారం పోవడంతో కొన్నిసార్లు యాక్షన్‌ ఎపిసోడ్‌లో పైకిలేచిన ఇంటెన్షన్‌ గ్రాఫ్‌కు పాటలు అడ్డుపడ్డాయి. అలాగే ఎదురులేకుండా హీరో అజేయుడిలా దూసుకుపోవడం మంచి ప్రయోగమే కానీ ఎమోషన్స్‌ని రిజిస్టర్‌ కానివ్వదు. ఇంటర్వల్‌ వద్ద సరైన ముడిపడలేదు. ఇంటర్వల్‌ వద్ద రెండు నెలల టైం లాక్‌ పెట్టి మర్చిపోయారు. కథలో రెండో మలుపు లేకపోవడంతో క్లెయిమాక్స్‌లో నిండుదనం రాలేదు.

ఏది ఏమైనా చిరంజీవి నిత్య నూతన నటుడు. కథ డిమాండ్‌ మేరకు కసిగానే నటించాడు. పెద్దగా పబ్లిసిటీ చేసిన ఆంజనేయ విగ్రహం ప్రాముఖ్యత చిన్న ప్లాంటింగ్‌కు పరిమితమైంది. కథాత్మ సరిగా ఉంటే మరో 'పసివాడి ప్రాణం'లా ఉండాల్సిన సినిమా ఇది. త్రివిక్రం సెటైర్లు, చిరంజీవి తాగుడు సీను, బ్రహ్మానందం వచ్చినప్పుడు మాత్రమే కన్పించాయి. సునీల్‌ ఉన్న కాసేపు బాగా నవ్వించాడు. వినాయకుడిపై పాట, థిల్లానా పాట బాగున్నాయి. ఇప్పటి వరకు ఫ్లాప్‌ అంటూ లేని దర్శకుడు విజయభాస్కర్‌ శైలి ఈ సినిమాలో కన్పించలేదు. చిరంజీవి సినిమా కాబట్టి ఓ రేంజి కలెక్షన్లు ఉండవచ్చు.

గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X