Jee Karda OTT Review ఘాటుగా శృంగారం.. నాటు రొమాన్స్‌తో తమన్నా భాటియా
Rating: 2.75/5
నటీనటులు: తమన్నా భాటియా, సుహైల్ నయ్యర్, ఆశీం గులాటీ, ఆన్య సింగ్, హుస్పేన్ దలాల్, సిమోన్ సింగ్, కైరా నారాయణ్ తదితరులు
రచన: అనురిమా శర్మ, హుస్సేన్ దలాల్, అబ్బాస్ దలాల్
దర్శకత్వం: అనురిమా శర్మ
మ్యూజిక్: సచిన్ జిగర్
నిర్మాతలు: దినేష్ విజన్, ఆశీష్ నికమ్
ఎడిటింగ్: దీపిక కల్రా, నేహా మెహతా
బ్యానర్: మాడోక్ ఫిల్మ్స్
ఓటీటీ బ్యానర్: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ రిలీజ్ డేట్: 2023-06-15
లావణ్య సింగ్, రిషి రాథోడ్, ప్రీత్, అర్జున్, శీతల్, మెర్లోయ్, షాహిద్ ఏడుగురు ఒకే స్కూల్‌లో చదివిన చిన్ననాటి స్నేహితులు. లావణ్య సింగ్ (లావణ్య సింగ్) పెళ్లి విషయంలో ఓ క్లారిటీ లేని అర్కిటెక్ట్. కానీ తన చిన్ననాటి స్నేహితుడు రిషి రాథోడ్ (సుహైల్ నాయర్) అంటే చెప్పలేనంత ప్రేమ. ప్రీత్ ( అన్య సింగ్) ఎప్పుడూ సమస్యల్లో కూరుకుపోయే సింగర్ అర్జున్ (ఆషిమ్ గులాటీ)ను ప్రేమిస్తుంటుంది.
శీతల్ ( సమ్‌వేదన సువాల్క), సమీర్ (మల్హర్ థక్కర్) పెళ్లి చేసుకొంటారు. కానీ ఉమ్మడి కుటుంబం వల్ల శృంగార జీవితానికి చాలా అడ్డంకులు ఏర్పడుతాయి. టీచర్‌గా పనిచేసే షాహిద్ (హుస్సేన్ దలాల్) తన స్కూల్‌లో టీచర్‌తో రిలేషన్, ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటాడు. హోమో సెక్సువల్ మెర్లోయ్ (సాయన్ బెనర్జీ) బాయ్‌ఫ్రెండ్‌తో రిలేషన్‌లో ఉంటాడు.

లావణ్య, రిషి మధ్య పెళ్లికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? లావణ్య ఆలోచనలకు తగినట్టుగా రిషితో పెళ్లి జరిగిందా? ఉమ్మడి కుటుంబం కారణంగా దాంపత్య జీవితానికి సంబంధించి శీతల్‌కు ఉన్న అసంతృప్తి ఏమిటి? ప్రీత్, అర్జున్ సింగ్ డేటింగ్ వ్యవహారంలో ఏం జరిగింది? షాహిద్ ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కాడా? మెర్లోయ్ బాయ్‌ఫ్రెండ్‌తో ఎలాంటి చేదు అనుభవం ఎదురైంది అనే ప్రశ్నలకు సమాధానమే జీ కర్దా వెబ్ సిరీస్ కథ.
చిన్నతనంలో లావణ్య సింగ్ (తమన్నా) తన స్నేహితులతో స్కూల్ లైఫ్‌తో కథ ప్రారంభమవుతుంది. ఓ జ్యోతిష్కుడు ఈ ఏడుగురికి కొన్ని సూచనలు చేస్తాడు. అలాంటి సూచనలను వారు మైండ్‌లో పెట్టుకొని 30 ఏళ్లు జీవిస్తారు. 30 ఏళ్ల వయసులో మళ్లీ వాళ్లు కలుస్తారు. లావణ్య, రిషి ప్రపోజల్, ఎంగేజ్‌మెంట్, సంగీత్ అంశాలతో కథ నడుస్తుంది. రిషి కంటే ముందు అర్జున్‌తో డేటింగ్ లైఫ్‌ను ఎంజాయ్ చేసిన లావణ్యకు అబార్షన్లు కూడా జరుగుతాయి. ఎంగేజ్‌మెంట్‌లో సంప్రదాయాలు, పార్టీ విషయంలో రిషితో లావణ్యకు కొన్ని అభిప్రాయ బేధాలు తలెత్తాయి. అలాంటి అభిప్రాయ బేధాలను అధిగమించి పెళ్లి చేసుకొన్నారా అనేది ఆసక్తికరంగా పాయింట్‌గా కనిపిస్తుంది.

ఇక శీతల్, సమీర్, ప్రీత్, షాహిద్ రొమాంటిక్ లైఫ్ కొంత బోల్డ్‌గా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా ఇరుకైన జీవితంలో బతికితే.. ఆ లైఫ్‌లో ఉంటే అసంతృప్తి, అసౌకర్యం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందనే విషయాన్ని దర్శకురాలు అనురిమా శర్మ యూత్‌ను టార్గెట్‌గా చేసుకొని కథను చెప్పే ప్రయత్నం చేసింది. నేటి తరం యువత ఆలోచనలు, భావనలు, లైఫ్ జర్నీ ఈ వెబ్ సిరీస్‌లో ప్రత్యక్షంగా కనిపిస్తాయి. పెళ్లికి ముందు సెక్స్, స్వలింగ సంపర్క జీవితం లాంటి అంశాలను బోల్డుగా తెరకెక్కించారు.
సింగిల్ పేరెంట్ జీవితాన్ని చూసిన లావణ్య తన తల్లి అంతారా సింగ్ ( షిమోన్ సింగ్)తో బాండింగ్ చాలా ఓపెన్‌గా ఉంటుంది. తల్లి, కూతుళ్లనే విషయాన్ని మరిచిపోయి వారిద్దరు శృంగార జీవితం గురించి షేర్ చేసుకొనే విధానం కొంత మోతాదు మించిందనిపిస్తుంది. కానీ అనురిమా సింగ్ డీల్ చేసిన విధానం బాగుంది. లావణ్య పెళ్లి తర్వాత అర్జున్‌తో రిలేషన్ విషయంలో రియలైజ్ అయిన విధానం కొంత ఎమోషనల్‌గా అనిపిస్తుంది.

ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. రొమాంటిక్ సీన్లు హాట్ హాట్‌గా చిత్రీకరించారు. ముంబై నైట్ లైఫ్ తెర మీద బాగుందనిపిస్తుంది. ప్రతీ ఫ్రేమ్ చాలా రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా చూసేందుకు ముచ్చటగా ఉంటుంది. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కాస్పోపాలిటన్ లుక్‌తో సినిమా కలర్‌ఫుల్‌గా అనిపిస్తుంది.

లవ్, రొమాన్స్, బ్రేకప్స్, స్వలింగ సంపర్కం లాంటి అంశాలతో రూపొందిన చిత్రం జీ కర్దా. జీవితం ప్లాన్ చేసిన విధంగా ఉండదు అనే కాన్సెప్ట్‌తో ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. రకరకాల ఎమోషన్స్‌ను అనురిమా శర్మ చక్కగా తెరకెక్కించారు. ఇలాంటి కథను నీట్‌గా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చే విధంగా తీయవచ్చు. బోల్డ్ కంటెంట్, బూతు డైలాగ్స్ విచ్చలవిడిగా చూపించారు. ఈ వెబ్ సిరీస్‌ను చిన్న పిల్లలను దూరంగా పెట్టండి. పిల్లలు లేని సమయంలో ఒంటరిగా చూడండి. పక్కా అడల్ట్ కంటెంట్ అనే విషయాన్ని గుర్తుంచుకొని చూడండి.


Click it and Unblock the Notifications











