twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జెర్సీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    Jersey Movie Review || జెర్సీ మూవీ రివ్యూ | Filmibeat Telugu

    Rating:
    4.0/5

    టాలీవుడ్‌లో సినిమా... సినిమాకు తన స్టార్ రేంజ్‌‌ను పెంచుకొంటూ వెళ్తున్న హీరోల్లో నాని ఒకరు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి ఆ రోల్‌కు వందశాతం న్యాయం చేస్తాడనే ఫీలింగ్ కలుగజేయడంతోనే నానిని నేచురల్ స్టార్ అని పిలుచుకొంటారు. గత చిత్రాలు అనుకున్నంతగా మేరకు సంతృప్తి పరచకపోవడం, నాని తన స్వభావానికి భిన్నంగా సినిమాలు చేస్తున్నాడనే కామెంట్ల మధ్య నాని జెర్సీతో రూట్ మార్చినట్టు కనిపించింది. టీజర్లు, ట్రైలర్లు అదే ఇంపాక్ట్‌ను కలిగించాయి. భావోద్వేగభరితమైన పాత్రలతో రూపొందిన జెర్సీ చిత్రం నానికి ఏ రేంజ్ విజయాన్ని అందించింది? బరువైన పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ ఆకట్టుకొన్నదా? గౌతమ్ తిన్ననూరి ద్వితీయ విఘ్నాన్ని అధిగమించారా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    జెర్సీ స్టోరీ

    జెర్సీ స్టోరీ

    అర్జున్ (నాని) భారత జట్టుకు ఎంపికయ్యే సత్తా ఉన్న క్రికెటర్. క్రికెటర్‌గా అర్జున్‌ను అభిమానించిన సారా( శ్రద్ధా శ్రీనాథ్) అతడి ప్రేమలో పడుతుంది. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకొంటారు. వారికి నాని (రోనిత్ కమ్రా) అనే కుమారుడు ఉంటాడు. ఇలా జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో తన 26 ఏళ్ల వయసులో క్రికెట్‌కు గుడ్‌బై చెబుతాడు. దాంతో అర్జున్‌ తీసుకొన్న నిర్ణయం సారాను హార్ట్ చేస్తుంది. ఆ తర్వాత లంచ తీసుకొన్నారనే ఆరోపణతో అర్జున్ ఉద్యోగం పోతుంది. అలా అర్జున్ రకరకాల సమస్యల్లో కూరుకుపోయి కొడుకు చిన్న గిఫ్ట్ కొనివ్వలేని పరిస్థితి వస్తుంది. అయితే 36 ఏళ్ల వయసులో ఇండియా జట్టుకు ఆడాలనే కోరికతో క్రికెట్ ఆడాలనుకొంటాడు?

     జెర్సీ స్టోరీ‌లో మలుపులు

    జెర్సీ స్టోరీ‌లో మలుపులు

    మంచి క్రికెటర్‌గా ఎదుగుతున్న సమయంలో అర్జున్ క్రికెట్‌కు ఎందుకు దూరమయ్యాడు? క్రికెట్‌కు అర్జున్ గుడ్‌బై చెప్పడం జీర్ణించుకోలేని సారా అతడికి ఎందుకు దూరం కావాలనుకొంటుంది? మళ్లీ 36 ఏళ్ల వయసులో క్రికెట్ బ్యాట్ పట్టాలని బలంగా కోరుకొంటాడు. తిరిగి క్రికెట్‌ ఆటలోకి ప్రవేశించడానికి బలమైన కారణం ఏమిటి? ఇంతకు తన కుమారుడికి ఇస్తామనుకొన్న గిఫ్ట్ ఏమిటి? తన కుమారుడి బర్త్ డేకు గిఫ్ట్ ఇస్తానని మాటిచ్చిన అర్జున్ తన మాటను ఎలా నిలబెట్టుకొన్నారు అనే ప్రశ్నలకు సమాధానమే జెర్సీ కథ.

     జర్సీ ఫస్టాఫ్ అనాలిసిస్

    జర్సీ ఫస్టాఫ్ అనాలిసిస్

    జెర్సీ అనే పుస్తకం హాట్ హాట్ అమ్ముడుపోయే అంశంతో కథ ప్రారంభమవుతుంది. ఆ పుస్తకం నేపథ్యంగా కథ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లడం జరుగుతుంది. పైసా సంపాదనలేని భర్త అర్జున్ పడే మానసిక సంఘర్షణ తొలిభాగంలో ప్రధానంగా సాగుతుంది. తనను ప్రాణంగా ప్రేమించిన అర్జున్‌ను సారా ఎందుకు ద్వేషించడం మరో కోణంలో కథ నడుస్తుంటుంది. ఇక తండ్రి కొడుకుల మధ్య హార్ట్ టచించ్ సీన్లతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. కొడుకు గిఫ్ట్ కొనివ్వడానికి మళ్లీ క్రికెట్ ఆడటం. తన ప్రతిభతో జట్టును ముందుకు నడిపించడం లాంటి అంశాలు ఫీల్‌గుడ్‌గా సాగుతాయి. ఇక తొలిభాగంలో తన కొడుకు గిఫ్ట్ కొనివ్వడానిక

     జర్సీ సెకండాఫ్ అనాలిసిస్

    జర్సీ సెకండాఫ్ అనాలిసిస్

    36 ఏళ్ల వయసులో బలమైన కారణంతో క్రికెట్ ఆడటం.. హైదరాబాద్ జట్టును రంజీ ఫైనల్‌కు చేర్చడం జరుగుతుంది. క్రికెట్ ఆట ముఖ్యమా? కుటుంబం ముఖ్యమా? అని సారా తేల్చుకోమనడం సినిమా కొంత ట్విస్ట్‌గా మారుతుంది. ఆ క్షణంలో కుటుంబం కోసం క్రికెట్‌ను వదిలి రావడం.. ఆ తర్వాత కొన్ని సంఘటనల కారణంగా సారా తిరిగి జట్టులోకి పంపడం లాంటి అంశాలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. ఇక సినిమాకు ఆయువు పట్టు క్లైమాక్స్. చివరి పది నిమిషాల్లో ప్రేక్షకుడి గుండెను పిండేసే సన్నివేశాలు సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తాయి.

    గౌతమ్ తిన్ననూరి దర్శకత్వ ప్రతిభ

    గౌతమ్ తిన్ననూరి దర్శకత్వ ప్రతిభ

    భావోద్వేగమైన ఒక చిన్న పాయింట్‌ చుట్టు ఎమోషన్స్‌ను భారీగా అల్లుకోవడం దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్రతిభకు అద్ధం పట్టింది. కథను భావోద్వేగాల ఒడిదుడుకుల మధ్య నడిపించిన తీరు హ్యాట్సాఫ్. ఒక్కడా చిన్న తడబాటు లేకుండా కథను కథగా చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. కమర్షియల్ విలువలతో కూడిన స్క్రీన్ ప్లేను, ప్రతీ ఆడియెన్ కట్టిపడేసే సన్నివేశాలను రాసుకోవడం.. వాటిని ప్రేక్షకుడి హృదయానికి హత్తుకునేలా చిత్రీకరించిన తీరు అమోఘం. దర్శకుడి ప్రతిభను మాటల్లో చెప్పడం చాలా కష్టమే.. కేవలం తెరపైన ఆస్వాదిస్తే ఓ మంచి కథను తెరకెక్కించడానికి పడిన తపన జెర్సీలో కనిపిస్తుంది.

     నాని ఫెర్ఫార్మెన్స్

    నాని ఫెర్ఫార్మెన్స్

    క్రికెటర్, ఓ మంచి భర్త, తండ్రి, స్నేహితుడు, త్యాగం చేసే గుణం ఇలా రకరకాల అంశాలు ఉన్న పాత్రను నాని అవలీలగా ఒంటిచేత్తో పోషించడాని చెప్పవచ్చు. తెరపైనా మచ్చుకైనా చూద్దామా అంటే నాని కనిపించడు. కేవలం అర్జున్ పాత్రనే కనిపిస్తుంటుంది. అంటే నాని చేసిన కసరత్తు, అతడి ప్రతిభ అర్జున్ పాత్రను ఆకాశానికి ఎత్తిందని చెప్పవచ్చు. సినిమా చూసిన తర్వాత అర్జున్ పాత్రకు నాని తప్ప మరొకరు న్యాయం చేకూర్చలేరేమో అనే ఫిలింగ్ ప్రతి ఒక్కరికి కలగడం గ్యారెంటీ. నటుడిగా తన కెరీర్‌లో ఇప్పటికే పది మెట్లు ఎక్కడానుకుంటే.. ఈ సినిమాతో నాని మరో పది మెట్లు ఎక్కాడనే భావన కలుగుతుంది.

     శ్రద్ధా శ్రీనాథ్

    శ్రద్ధా శ్రీనాథ్

    జెర్సీ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్‌కు మూడు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్ర లభించింది. తొలిభాగంలో గ్లామరస్‌ పాత్రలో ఒదిగిపోయింది. చాలా ఇంటెన్సివ్‌గా నడిచే సెకండాఫ్‌లో ఫర్‌ఫెక్ట్ ఎమోషన్స్‌ను పలికించింది. గ్లామర్‌తో కూడిన రొమాంటిక్ సిన్లలో అదరగొట్టింది. పైసా సంపాదించలేని భర్త ఉన్న ఇంటిలో సంసార బాధ్యతలను భుజాన వేసుకొనే ఓ భార్యగా సారా పాత్రలో ఒదిగిపోయింది. నటనపరంగా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ.. అవి పెద్దగా పట్టించుకునేలా లేవు.

    రొనిత్ కమ్రా

    రొనిత్ కమ్రా


    నాని, శ్రద్ధా కుమారుడిగా నటించిన రోనిత్ అద్భుతమైన ప్రతిభను కనబరిచాడు. తండ్రి ప్రతిభను చూసి స్ఫూర్తి పొందే చిన్నారిగా ఆకట్టుకొన్నాడు. తొలి పిల్లల వద్ద ఉన్న వస్తువులు తన వద్ద లేవని ప్రతీ ఇంట్లో మారం చేసే ఓ అబ్బాయి తెర మీద కనిపిస్తాడు. నానితో కలిసి రొనిత్ చేసిన సీన్లు ప్రతీ ప్రేక్షకుడిని టచ్ చేస్తాయి. ఈ సినిమాకు వెళ్లే ప్రేక్షకుడికి రోనిత్ (నాని) నటన ఓ బోనస్ పాయింట్.

     ఇతర నటీనటులు

    ఇతర నటీనటులు

    సత్యరాజా పాత్ర ప్రతీ ఇంట్లో ఉండే పెదనాన్నో, బాబాయిలా ఉంటుంది. నానితో కలిసి సత్యరాజ్ చేసిన సీన్లు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. కమెడియన్ ప్రవీణ్, ఇతర కమెడియన్ల సీన్లు హాస్యాన్ని పంచుతాయి. సెకండాఫ్‌లో సంపత్ రాజ్ సినిమాకు మరింత బలంగా మారింది. ఈ చిత్రంలో నటించిన ప్రతీ నటుడిది గుర్తుంచుకోతగినదే.

     సినిమాటోగ్రఫి

    సినిమాటోగ్రఫి

    జెర్సీ సినిమాకు సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్. జాన్ సినిమాటోగ్రఫి లేకుండా ఈ సినిమాను ఊహించుకోలేం. టాప్ యాంగిల్ షాట్స్ విజువల్ ట్రీట్‌ అని చెప్పవచ్చు. క్రికెట్ సీన్లను చాలా లైవ్లీగా తెరకెకించారు. నిజంగా క్రికెట్ మ్యాచ్ చూస్తున్నామా అనే ఫీలింగ్ కల్పించడంలో జాన్ సక్సెస్ అయ్యాడు. ఇక ఎడిటర్ నవీన మరోసారి తన కత్తెరకు మరింత పదును అని చెప్పాడు. సినిమాను క్రీస్పీగా ఉంచుతూ కథ చెప్పే ప్రాసెస్‌ను ఆహ్లాదకరంగా మలిచారు.

     మ్యూజిక్

    మ్యూజిక్

    తెలుగు సినిమాలకు అనిరుధ్ రవిచందర్ చేసిన మ్యూజిక్ ఒక ఎత్తు.. జెర్సీ సినిమాకు ఆయన అందించిన మ్యూజిక్ మరో ఎత్తు. జెర్సీ సినిమాలో సింగల్ కార్డు లిరిక్ రైటర్‌గా కృష్ణ కాంత్ అన్ని పాటలు రాశారు. అదేంటో గానీ ఉన్నపాటుగా పాట మెలోడియస్‌గా హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది. పదే పదే, ప్రపంచమే అలా, నీదా పడదని పాటలు తెరపైన ఫీల్‌గుడ్‌గా ఉంటాయి. ఈ పాటలకు అనిరుధ్ సమకూర్చిన సంగీతం చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత పాటల్లో గొడవ లేకుండా పదాలు వినిపించడం హాయిగా అనిపిస్తుంది.

    ప్రొడక్షన్ వాల్యూస్

    ప్రొడక్షన్ వాల్యూస్

    జెర్సీలో పాత్రలకు ఎంపిక చేసిన నటులను చూస్తే సితార బ్యానర్‌కు సినిమా పట్ల ఉన్న అభిరుచి తెలుస్తుంది. సాంకేతిక నిపుణులు, లొకేషన్ల ఎంపికలో నాగవంశీ టేస్ట్‌ను అభినందించాల్సిందే. మంచి సినిమాలు ఇక రావా అనే సమయంలో మళ్లీ రావా అనే చిత్ర దర్శకుడితో నాగవంశీ ఓ మ్యాజికల్ మూవీని అందించాడని చెప్పవచ్చు.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    జెర్సీ చిత్రం యూత్‌కే కాకుండా కుటుంబంలో ప్రతీ ఒక్కరు చూడదగిన చిత్రం. ఇటీవల కాలంలో ఇంత ఎమోషనల్ కంటెంట్, ఎంటర్‌టైన్‌మెంట్‌ను బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన చిత్రాలు చాలా అరుదే. నాని నటన, గౌతమ్ దర్శకత్వం ప్రతిభ, రోనిత్ అమాయకత్వంతో కూడిన నటన, శ్రద్ధాదాస్ భావోద్వేగమైన పాత్ర సినిమాకు వెన్నుముక. ఇక సత్యరాజ్ పాత్ర సినిమాకు మరో హైలెట్. సినిమాటోగ్రఫి, రీరికార్డింగ్ తదితర అంశాలను సినిమాను తెర మీద ఓ జీవితాన్ని ఆవిష్కరించాయి. ఈ సినిమా విజయం ఏ రేంజ్ అనేది ఈ వీకెండ్ కల్లా తెలుస్తుంది. తెలుగు తెర మీద మ్యాజిక్ చేసిన సినిమాల్లో జెర్సీ మరో మ్యాజిక్‌ అని చెప్పవచ్చు.

    ప్లస్ పాయింట్స్

    ప్లస్ పాయింట్స్

    నాని.. నాని.. నాని..
    శ్రద్ధా శ్రీనాథ్, రొనిత్ కమ్రా ఫెర్ఫార్మెన్స్
    గౌతమ్ దర్శకత్వ ప్రతిభ
    సినిమాటోగ్రఫి
    మ్యూజిక్

    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: నాని, శ్రద్ధా శ్రీనాథ్, సత్యరాజ్, బ్రహ్మాజీ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, సంపత్ రాజ్, ప్రవీణ్, రోనిత్ కమ్రా
    స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
    నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
    మ్యూజిక్: అనిరుధ్ రవిచంద్రన్
    సినిమాటోగ్రఫి: సాను జాన్ వర్గీస్
    ఎడిటింగ్: నవీన్ నూలి
    ఆర్ట్: కొల్ల అవినాశ్
    బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్
    రిలీజ్: 2019-04-19

    English summary
    Jersey is sports drama written and directed by Gowtham Tinnanuri which is produced by Suryadevara Naga Vamsi under his production banner Sithara Entertainments. The film stars Nani and Shraddha Srinath in the lead roles while Sathyaraj, Sampath Raj, Brahmaji, Subbaraju and Ronit Kamra play pivotal roles. Film music was scored by Anirudh Ravichander with cinematography handled by Sanu Varghese. Movie released on 19 April 2019. In this occassion, Telugu filmibeat brings exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X