Jetlee Movie Review: జెట్లీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: సత్య, వెన్నెల కిషోర్, అజయ్, గెటప్ శ్రీను, వైవా హర్ష, కబీర్ బేడీ, శ్రీనివాసరెడ్డి, రియా సింఘా తదితరులు
దర్శకత్వం: రితేష్ రానా
నిర్మాతలు: చిరంజీవి, హేమలత
సమర్పణ: మైత్రీ మూవీ మేకర్స్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి
మ్యూజిక్: కాల భైరవ,
సినిమాటోగ్రఫి: సురేష్ సారంగం,
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్,
ప్రొడక్షన్ డిజైనర్: నార్ని శ్రీనివాస్
బ్యానర్: క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్
రిలీజ్ డేట్: 2026-01-05
బ్యాంక్ ఖాతాదారులను నిట్టనిలువునా ముంచేసి ఈ బ్యాంక్ యజమాని ప్రజాపతి (అజయ్) దుబాయ్‌కి పారిపోతాడు. అయితే భారత ప్రభుత్వం ప్రజాపతిని దుబాయ్‌లో అరెస్ట్ చేసి ఇండియాకు తరలించే బాధ్యతను శివానీ రాయ్ (రియా సింఘా)కు అప్పగిస్తారు. అయితే కేంద్ర మంత్రి మెల్కోటే (వడ్లమాని శ్రీనివాసరావు) ప్రజాపతిని ఫ్లయిట్‌లో చంపేందుకు ప్లాన్ వేస్తాడు. ప్రజాపతిని చంపేందుకు మరో గ్రూప్ స్కెచ్ వేస్తుంది. ఆ గ్రూప్‌లోకి బ్లైండ్ డాక్టర్ వేద వ్యాస్ (సత్య) జాయిన్ అవుతాడు. కోచికి చేరే ముందే ఫ్లయిట్‌ను హైజాక్ చేసి ప్రజాపతిపై ఎటాక్ చేస్తారు.

అయితే ప్రజాపతి తన బ్యాంక్‌ను ఎందుకు దివాళా తీయించాడు? బ్యాంక్ కార్యకలాపాలతో కేంద్ర మంత్రి మెల్కోటేకు ఉన్న సంబంధమేమిటి? డాక్టర్ వేదవ్యాస్ ఎందుకు వేరే గ్రూప్‌లో జాయిన్ అయ్యాడు? ఫ్లయిట్‌లో సీక్రెట్ ఆపరేషన్ ఎలా సాగింది? వేదవ్యాస్ మతిమరుపు డ్రామా రక్తికట్టిందా? ప్రజాపతిపై దాడి ప్లాన్ ఎలా సాగింది? ఇంతకు జెట్ లీ ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానమే జెట్ లీ సినిమా కథ.
ప్రజాపతి బ్యాంక్ దివాళాతో సినిమాను ఆరంభించిన దర్శకుడు రితేష్ రానా.. ప్రారంభంలో ఆసక్తికరంగా కథను చెప్పే ప్రయత్నం చేశాడనే ఫీలింగ్ కలుగుతుంది. కథ సాగుతున్న కొద్ది సన్నివేశాల్లో పసలేదనే విషయం సినిమా ఆరంభమైన కొద్ది సేపటికే అర్ధమవుతుంది. ఇక పొంతనలేని కథనం, అర్ధపర్థం లేని డైలాగ్స్, అసందర్భంగా సాగే కామెడీతో అనుక్షణం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా మూవీ సాగుతుంది. ఫస్టాఫ్ ముగిసే సమయానికే ఈ సినిమా గమ్యం లేని ఫ్లయిట్ దారి తప్పినట్టుగా అనిపిస్తుంది. ప్రేక్షకుల థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ మరీ దారుణంగా మారుతుంది. సెకండాఫ్‌లోనైనా సినిమా మీనింగ్ ఫుల్‌గా ఉంటుందా? అంటే ఏ కోశానా కూడా ఆ ఫీలింగ్ కల్పించదు. పరమ నసతో కూడిన సీన్లు డైలాగ్స్‌తో సాగదీసి సాగదీసి దర్శకుడు రానా ప్రత్యక్ష నరకాన్ని చూపించాడనే ఫీలింగ్ కలుగుతుంది. టోటల్‌గా సినిమాకు ముగింపు ఎప్పుడా అనే పరిస్థితి ప్రేక్షకుడిని వెంటాడుతుంది.
కథలో బలం, కథనం పేలవంగా ఉండటంతో సత్య లాంటి కమెడియన్ ఎఫర్ట్స్ కూడా వేస్ట్ అయ్యాయనేది స్పష్టంగా కనిపిస్తుంది. నాసిరకమైన స్క్రిప్టును కూడా సత్య తన పెర్ఫార్మెన్స్‌తో నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నాలు దారుణంగా విఫలమయ్యాయి. ఏ పాత్ర కూడా ఆడియెన్స్‌ను కనెక్ట్ చేసే విధంగా లేకపోవడం వల్ల అజయ్, కబీర్ సింగ్, రియా సింఘా, వెన్నెల కిషోర్ లాంటి యాక్టర్ల నటన నామమాత్రంగానే మిగిలిపోయిందని చెప్పాలి. ఈ చిత్రంలో ఫలానా యాక్టర్ బాగా చేశాడని చెప్పలేని పరిస్థితి ఎదురువుతుంది. టోటల్‌గా ఈ సినిమాలో పాత్రల డిజైన్, వాటి బిహేవియర్ చాలా దారుణంగా ఉన్నాయని చెప్పవచ్చు.
స్టోరీలో విషయం లేనప్పుడు సాంకేతిక నిపుణులు కూడా చేయడానికి ఏమీ ఉండదు. ఉన్నంతలో కాలభైరవ తన మ్యూజిక్‌తో కొంత బెటర్‌గా అనిపిస్తాడు. ఒకే లొకేషన్‌లో కథ నడవడం వల్ల సినిమాటోగ్రాఫర్ సురేష్ సారంగం కూడా చేయడానికి ఏమీ స్కోప్ లేకపోయింది. ఈ సినిమా నిడివిని ఇంకా గట్టిగా కట్ చేయడానికి స్కోప్ ఉందనిపిస్తుంది. ల మూవీ మేకర్స్ నుంచి ఇలాంటి సినిమా వచ్చిందనే విషయాన్ని నమ్మడానికే కష్టంగా ఉంటుంది. చెర్రీ, హేమలత ఎలాంటి నమ్మకంతో సినిమా చేశారు అనే అనుమానం కలుగుతుంది. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ఇలాంటి ప్రాజెక్ట్ డీల్ చేయడమే సరికాదనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాలో థియేట్రికల్ వాల్యూ ఎక్కడా కనిపించదు. కనీసం ఓటీటీలోనైనా ప్రేక్షకులను మెప్పించే సరుకు సినిమాలో కనిపించదు. కాబట్టి ఈ సినిమా తలరాత ఏమిటో మీకే అర్ధం అయి ఉంటుందనుకొంటా.


Click it and Unblock the Notifications