Jetlee First Review: జెట్‌లీ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్

స్టార్ కమెడియన్లు సత్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ జెట్ లీ. అజయ్, గెటప్ శ్రీను, వైవా హర్ష, కబీర్ బేడీ, శ్రీనివాసరెడ్డి, రియా సింఘా తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మైత్రీ మూవీ సీఈవో చిరంజీవి, హేమలత నిర్మించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి సమర్పించారు. ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. మ్యూజిక్: కాల భైరవ, సినిమాటోగ్రఫి: సురేష్ సారంగం, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్: నార్ని శ్రీనివాస్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ చిత్రం మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రంగా రూపొందిన జెట్ లీ సినిమా గురించి రిలీజ్‌కు ముందు వస్తున్న ఫీడ్ బ్యాక్, సెన్సార్ రిపోర్ట్, రన్ టైమ్ వివరాల్లోకి వెళితే..

JetLee CBFC Review

స్వింగ్ ఫిషర్ 6EB1CH అనే విమానంలో దుబాయ్ నుంచి కోచికి ప్రయాణిస్తున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త ప్రజాపతి (అజయ్) కోవర్డ్ ఏజెంట్స్, ఇతర గ్యాంగులు ఆకాశంలో దాడికి పాల్పడుతారు. అయితే ఫ్లయిట్‌లో ఓ సీక్రెట్ ఆపరేషన్‌ను స్పెషల్ ఏజెంట్ శివానీ రాయ్ (రియా సింఘా) యాక్టివేట్ చేస్తుంది. మతి మరుపు ఉన్న వ్యాస్ (సత్య)ను ఈ ఆపరేషన్‌లో భాగం చేస్తుంది. అసలు ప్రజాపతికి వ్యతిరేకంగా ఈ దాడి ఎందుకు జరిగింది? శివానీ రాయ్ ప్లాన్ చేసిన సీక్రెట్ ఆపరేషన్ ఏంటి? ఈ ఆపరేషన్‌లో మెమోరీ లాస్ ఉన్న వ్యాస్‌ను రంగంలోకి ఎందుకు దించింది? ఈ ఆపరేషన్‌ను వ్యాస్ సక్సెస్ ఎలా చేశాడానే ప్రశ్నలకు సమాధానమే జెట్ లీ సినిమా కథ.

యాక్షన్, కామెడీగా రూపొందిన ఈ సినిమాలోని పాత్రలు,సన్నివేశాలు పూర్తిగా వినోదాత్మకంగా సాగి ప్రేక్షకులకు ఫన్ క్రియేట్ చేసేలా ఉన్నాయనే విషయం ప్రమోషన్స్ స్పష్టం చేశాయి. ప్రోమోలు వెల్లడించిన కంటెంట్‌ను అనుగుణంగానే సన్నివేశాలు, డైలాగ్స్ క్లీన్ కామెడీగా మార్చాయి. రెండు గంటలపాటు లాజిక్స్ లేకుండా పూర్తిగా ఫన్ క్రియేట్ చేస్తుందనే విషయం సెన్సార్ రివ్యూ తర్వాత బయటకు వచ్చింది. లాజిక్స్, రీజన్స్ వెతక్కుండా చూస్తే వినోదాన్ని ఆస్వాదించడానికి అవకాశం ఉంటుందనే ఫీడ్ బ్యాక్ వచ్చింది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఈ సినిమాకు వీక్షించిన సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) ప్రతినిధులు, అధికారులు పూర్తిగా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సినిమాకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా క్లీన్ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సినిమాకు లభించిన యూఏ (UA13+) సర్టిఫికెట్ ప్రకారం.. 13 ఏళ్ల నిండిన వారు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుందని సర్టిపికెట్‌లో వెల్లడించారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

కంటెంట్‌ కాకుండా కామెడీ ప్రధానంగా సాగే ఈ చిత్రాన్ని తక్కువ నిడివితోనే ముగించారు. ఈ సినిమాను ల్యాగ్ లేకుండా ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్ జాగ్రత్తలు తీసుకొన్నదనే విషయం నిడివిని చూస్తే స్పష్టమవుతుంది. ఈ సినిమాను 2 గంటల 12 నిమిషాల నిడివి అంటే.. 132 నిమిషాల రన్‌టైమ్‌తో క్లోజ్ చేశారు. దాంతో ఈ సినిమా చాలా రేసీ స్క్రీన్ ప్లేతో సాగుతుందనే విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా గురించిన ఎక్స్‌క్లూజివ్ రివ్యూలు, బాక్సాఫీస్ రిపోర్టు గురించి ఫిలింబీట్‌ను ఫాలో అవ్వండి.

Read more about: satya vennela kishore
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X