Jetlee Twitter Review: జెట్‌లీ మూవీ ట్విట్టర్ రివ్యూ..

Jetlee Twitter Review: టాలీవుడ్‌లో పూర్తి స్థాయి వినోదాన్ని అందించే లక్ష్యంతో రూపొందిన కామెడీ-యాక్షన్ థ్రిల్లర్ 'జెట్ లీ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ప్రముఖ కమెడియన్లు సత్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించగా, అజయ్, గెటప్ శ్రీను, వైవా హర్ష, కబీర్ బేడీ, శ్రీనివాసరెడ్డి, రియా సింఘా తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాను క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి, హేమలత నిర్మించగా, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి సమర్పించారు. ఈ సినిమాకి రిథేష్ రానా దర్శకత్వం వహించారు.

ఇక సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సంగీతాన్ని కాల భైరవ అందించగా, సినిమాటోగ్రఫీని సురేష్ సారంగం నిర్వహించారు. ఎడిటింగ్ బాధ్యతలను కార్తీక శ్రీనివాస్ చేపట్టగా, ప్రొడక్షన్ డిజైన్‌ను నార్ని శ్రీనివాస్ చూసుకున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ నేపథ్యంలో సినిమా గురించి నెటిజన్లు, క్రిటిక్స్ వెల్లడించిన ట్వీట్లు, వారి అభిప్రాయాల వివరాల్లోకి వెళితే..

Jetlee Twitter Review in telugu  Positive Buzz for Satya s Comedy Action Entertainer

జెట్ లీ సినిమా చూసిన ఓ ప్రేక్షకుడు తన అభిప్రాయాన్ని ఇలా పంచుకున్నాడు. ఈ సినిమాలో సత్య వన్ మ్యాన్ షో చూపించాడని పేర్కొన్నాడు. సత్య స్క్రీన్‌పై కనిపించే ప్రతి సన్నివేశం నవ్వుల పండుగలా మారిందని, అతని కామెడీ టైమింగ్ సాధారణ సన్నివేశాలనైనా హిలేరియస్‌గా మార్చిందని తెలిపాడు. అలాగే వెన్నెల కిషోర్ తో అతని కాంబినేషన్ కూడా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచిందని చెప్పాడు. మొత్తం సినిమా స్టోరీ, స్క్రీన్‌ప్లే కంటే సత్య పెర్ఫార్మెన్స్‌నే ఎక్కువగా మోసుకెళ్లిందని, ఈ మూవీని చూడాలంటే కేవలం అతని కామెడీ కోసం చూడాలని సూచించాడు.

ఈ సినిమాపై మరో ప్రేక్షకుడు ట్విట్టర్‌లో తన రివ్యూ పంచుకుంటూ.. దర్శకుడు రితేష్ రానా స్టైల్‌లో మరో క్రేజీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ నిలిచిందని పేర్కొన్నారు. ఈ చిత్రంలో సత్య తన కామెడీతో షో దొంగిలించాడని, వెన్నెల కిషోర్,హర్ష కాంబినేషన్ టైమింగ్ పీక్స్‌లో ఉందని చెప్పారు. అలాగే ఫరియా అబ్దుల్లా తన పాత్రలో న్యాయం చేసిందని అభిప్రాయపడ్డారు. ఇంకా కాల బైరవా అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉందని, ముఖ్యంగా ఫ్లైట్ సీక్వెన్స్‌లు థ్రిల్‌తో పాటు ఎంజాయ్ చేసే విధంగా తెరకెక్కించారని ట్వీట్‌లో వెల్లడించారు. మొత్తం మీద ఈ సినిమాకు 3/5 రేటింగ్ ఇస్తూ ప్రేక్షకుడు తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ సినిమాపై మరో ప్రేక్షకుడు ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, ఈ మూవీ మొత్తం సత్య వన్ మ్యాన్ షోగా నిలిచిందని పేర్కొన్నారు. సత్య జెట్ లీ పాత్రలో అద్భుతంగా అలరించాడని, అతని కామెడీ రెండు గంటల పాటు నాన్-స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిందని చెప్పారు. అలాగే వెన్నెల కిషోర్, హర్ష కామెడీ కూడా సినిమాకు పెద్ద ప్లస్ అయిందని తెలిపారు.చాలా కాలం తర్వాత ఇంతగా నవ్వుకున్నానని, ఒక ఫన్ సర్‌ప్రైజ్ కామియో కూడా ఉందని చెబుతూ-మొత్తంగా ఈ మూవీ తప్పకుండా చూడాల్సిందే అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరో ప్రేక్షకుడుతన రివ్యూ పంచుకుంటూ, ఈ మూవీ పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా నిలిచిందని తెలిపారు. సత్య తన కామెడీ టైమింగ్‌తో మొత్తం సినిమాను ముందుకు నడిపించాడని చెప్పారు. అలాగే వెన్నెల కిషోర్, హర్ష చెముడు ప్రీ-క్లైమాక్స్‌లో పీక్ కామెడీతో ప్రేక్షకులు బాగా నవ్వించారని అభిప్రాయపడ్డారు. క్రేజీ ఫ్లైట్ సీక్వెన్స్‌లు, కాలా భైరవ అందించిన ఎనర్జిటిక్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయని, రియా సింగ్ తన పాత్రకు సరిపడగా నటించిందని పేర్కొన్నారు. మొత్తంగా నవ్వులు పంచే ఈ సినిమాను ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలంటే తప్పక చూడాలని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ సినిమా చూసిన మరో ప్రేక్షకుడు ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, దర్శకుడు రితేష్ రానా స్టైల్‌లో ఈ మూవీ పూర్తి స్థాయి "టర్బులెన్స్" ఎంటర్‌టైనర్‌లా ఉందని పేర్కొన్నారు. ఫస్ట్ హాఫ్‌లో వన్ లైనర్స్, మీమ్ రిఫరెన్సులు బాగా వర్క్ అయ్యాయని, అయితే అవి అందరికీ కనెక్ట్ కాకపోవచ్చని అన్నారు. సెకండ్ హాఫ్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇక సత్య తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడని, వెన్నెల కిషోర్, హర్ష కాంబో కూడా బాగుంది. మొత్తంగా సినిమా కామెడీ ఎలిమెంట్స్‌తో ఎంటర్‌టైనర్ గా నిలిచిందని పేర్కొన్నారు.

Read more about: satya vennela kishore JETLEE
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X