For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Jetty movie Review మత్స్యకారుల సమస్యలపై పోరాటం.. జెట్టీ కోసం ఎమోషనల్ ప్రేమకథతో..

  |

  నటీనటులు: మాన్యం కృష్ణ, నందిత శ్వేతా, శివాజీ రాజా, సుమన్ శెట్టి, తేజస్విని బెహెర, ఎంఎష్ చౌదరి, జీ కిషోర్, గోపి, జీవ,
  నిర్మాత : కే వేణు మాధవ్
  బ్యానర్ : వర్థని ప్రొడక్షన్స్
  దర్శకత్వం : సుబ్రహ్మణ్యం పిచ్చుక
  సంగీతం : కార్తీక్ కొడకండ్ల
  విడుదల తేదీ : నవంబర్ 04, 2022

  సముద్ర తీర ప్రాంతంలోని కఠారిపాలెంలో మత్స్యకారుల కుటుంబానికి పెద్ద కాపుగా జాలన్న (ఎంఎస్ చౌదరీ) మంచి, చెడులను చూసుకొంటుంటాడు. ఊరి కట్టుబాట్ల కోసం ప్రాణాలు తీయడానికైనా వెనుకాడడు జాలన్న. గ్రామంలో ఉన్నత విద్యను అభ్యసించిన జాలన్న కూతురు మీనాక్షి (నందితా శ్వేత) ఊరి బాగోగుల గురించి అనునిత్యం ఆలోచిస్తుంటుంది. అన్ని రకాలుగా వెనుకబడి ఉన్న గ్రామానికి ఉపాధ్యాయుడిగా శ్రీను (మాన్యం కృష్ణ) వస్తాడు. ఊరి పరిస్థితులు, మత్స్యకారులకు సముద్ర తీరం నుంచి సముద్రంలోకి వెళ్లేందుకు జెట్టీ లేకపోవడం అతడిని ఆలోచింపజేస్తుంటుంది. ఈ క్రమంలో మీనాక్షి, శ్రీను ఊరి నుంచి హైదరాబాద్‌కు వెళ్లిపోతారు. దాంతో కట్టుబాట్లను ఉల్లంఘించారనే కారణంతో జాలన్నను ఊరి పెద్ద పదవి నుంచి దించేసి.. గ్రామం నుంచి బహిష్కరిస్తారు. గ్రామ బహిష్కరణ తర్వాత జాలన్న ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకొన్నాడనేది సినిమా కథ.

  కఠారి పాలెం నుంచి మీనాక్షి, శ్రీను ఎక్కడికి వెళ్లారు? మీనాక్షి, శ్రీను గ్రామాన్ని విడిచి ఎందుకు వెళ్లారు? గ్రామానికి తిరిగొచ్చిన ఇద్దరిని జాలన్న ఏం చేశాడు? కఠారిపాలెంకు జెట్టీ సదుపాయం ఏర్పడిందా? గ్రామానికి ఉన్న కష్టాలు తీరాయా? అనేవి కథలో ట్విస్టులు.

  Jetty movie Review and Rating: Manyam Krishna and Nandita Swetas emotional drama

  జెట్టీ సినిమాలో జాలన్నగా నటించిన ఎంఎస్ చౌదరీ అద్బుతమైన నటనే కాకుండా సినిమాను తన భుజాల మీద మోశారని చెప్పవచ్చు. ఇక తొలి చిత్ర నటుడిగా మాన్యం కృష్ణ శ్రీను ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయాడు. సినిమా తెరకు కొత్తవాడైనా అనుభవం ఉన్న హీరోగా తెరపైన ఫెర్ఫార్మ్ చేశారు. సామాజిక బాధ్యత ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. ఇక మీనాక్షిగా నందితా శ్వేత మరోసారి కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. గ్రామం కోసం ప్రాణాలకు తెగించే భావోద్వేగమైన పాత్రతో మెప్పించింది. మైమ్ గోపి, జీవా, శివాజీ రాజా తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

  వీరమణి సినిమాటోగ్రఫి బాగుంది. సముద్ర తీరపు, గ్రామీణ అందాలను కెమెరాలో చక్కగా బంధించారు. కార్తీక్ కొడకండ్ల అందించిన సంగీతం బాగుంది. శ్రీనివాస్ తోట ఎడిటింగ్ విషయంలో కొన్ని చోట్ల కత్తెరలు పడాల్సిందే. వేణు మాధవ్ కే నిర్మాణ విలువలు బాగున్నాయి.

  జెట్టి అంటే సముద్ర తీర ప్రాంతాన్ని, సముద్రాన్ని కలిపే వంతెన. కోస్తాంధ్ర మత్స్య కారులకు జెట్టిలు ప్రధాన ఆదాయ వనరులను సమకూర్చే ఫిషింగ్ హార్బర్. కోస్తాంధ్రలోని మత్స్యకారుల సమస్యను ఆధారంగా చేసుకొని దర్శకుడు సుబ్రహ్మణ్యం పిచ్చుక రాసుకొన్న పాయింట్ బాగుంది. చిన్న నటులతో తీసిన రంగస్థలం సినిమాలా ఉంటుంది. నేటివిటి, గ్రామానికి సంబంధించిన మట్టివాసన కథలో గుభాలిస్తుంది. గ్రామీణ ప్రజల్లో అమాయకత్వం పాత్రల్లో ప్రతిబింబిస్తుంది.

  జెట్టీ చిత్రం అన్ని సినిమాల మాదిరిగా కాకుండా.. నేటివిటీ చిత్రాల్లో చేరుతుంది. గ్రామీణ నేపథ్యం, కట్టుబాట్లు, పరువు హత్యలు లాంటి అంశాలతో ఈ సినిమా భావోద్వేగంగా కనిపిస్తుంది. చాలా మంది కొత్తవాళ్లతో మంచి ఫెర్ఫార్మన్స్‌ను రాబట్టడంలో సినిమా యూనిట్ సఫలమైంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. కథ, కథనం, సన్నివేశాలపై ఇంకాస్త కసరత్తుచేసి ఉంటే.. మంచి నెటీవిటీ చిత్రం అయి ఉండేది.

  English summary
  Actress Nandita Swetha actor Manyam Krishna's Jetty movie has released on November 4th. Here is the exclusive review of Telugu filmibeat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X