Jewel Thief Review: జెవెల్ థీఫ్ హిందీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
1.5/5

నటీనటులు: సైఫ్ ఆలీ ఖాన్, జైదీప్ అహ్లావట్, నికితా దత్తా, కునాల్ కపూర్, కుల్‌భూషణ్ ఖర్బందా, దోరేంద్ర సింగ్ లియోటన్‌బమ్ తదితరులు
దర్శకత్వం: కూకీ గులాటీ, రాబీ గ్రేవాల్
స్క్రీన్ ప్లే: డేవిడ్ లోగన్
నిర్మాతలు: సిద్దార్థ్ ఆనంద్, మమతా ఆనంద్
సినిమాటోగ్రఫి: జిష్ను భట్టాచార్జి
ఎడిటింగ్: ఆరీఫ్ షేక్
మ్యూజిక్: సచిన్-జిగర్, షేజాన్ షేక్
బ్యానర్: మార్ట్‌ఫ్లిక్స్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2025-04-28

అరుదైన వజ్రాలను దోపిడి చేసే అంతర్జాతీయ దొంగ రెహన్ రాయ్ (సైఫ్ ఆలీ ఖాన్). విలువైన కళాఖండాలను, చిత్రాలను సేకరించే హాబీ ముసుగులో స్మగ్లింగ్‌కు పాల్పడే మాఫియా డాన్ రాజన్ ఔలాఖ్ (జైదీప్ అహ్లావాట్). రెడ్ సన్ అనే ఆఫ్రికాలో విలువైన వజ్రంతో ప్రిన్స్ గమురు ప్రపంచ యాత్ర చేస్తుంటాడు. ఆ క్రమంలో ముంబైలో ప్రదర్శనకు పెట్టిన ఆ వజ్రాన్ని కాజేయాలని రెహన్, రాజన్ ప్లాన్ చేస్తారు. వీరిని పట్టుకొనేందుకు పోలీస్ ఆఫీసర్ విక్రమ్ పటేల్ (కునాల్ కపూర్) వెంటాడుతుంటాడు.

Jewel Thief Review

రెహాన్ రాయ్ ఎందుకు దొంగగా మారాడు? తండ్రి జయంత్ రాయ్ (కుల్‌భూషణ్ ఖర్బందా)తో విభేదాలు ఎందుకు? రెడ్ సన్ అనే వజ్రం ప్రాముఖ్యత ఏమిటి? ముంబైలో ప్రదర్శనకు పెట్టిన ఆ వజ్రాన్ని కొట్టేయడానికి రెహన్ ఎలాంటి ప్లాన్ చేశాడు? ఫరా (నికితా దత్తా) ఎవరు? రెహన్‌కు, రాజన్‌కు ఫరాకు ఉన్న సంబంధమేమిటి? విక్రమ్ పటేల్ వేట ఎలా సాగింది? రెహాన్ చేతికి రెడ్ సన్‌ వజ్రం దొరికిందా? అనే ప్రశ్నలకు సమాధానమే జెవెల్ థీఫ్ సినిమా కథ.

వజ్రం దొంగతనం చుట్టూ సాగే దోపిడి కథను దర్శకులు కూకీ గులాటీ, రోబీ గ్రేవాల్ రాసుకొన్న తీరు బేసిగ్గా అవుట్ డేట్. ఇలాంటి కథలు మంచి కాన్సెప్ట్, బెటర్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురి చేశాయి. అలాంటి పాయింట్‌ను చాలా పేలవంగా, నాసిరకంగా తెరకెక్కించారు. రొటీన్ మాఫియా పాత్రలు, రెగ్యులర్ రొమాన్స్‌తో రాసిన కథ అత్యంత బోరింగ్‌గా సాగుతుంది. ఆసక్తికరమైన అంశాలు కొరవడటం, ట్విస్టులు లేకపోవడంతో కథలో ఏం జరుగుతుందనే విషయం సాధారణ ప్రేక్షకుడిగా అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాలోని ప్రధాన పాత్రలను డిజైన్ చేసిన విధానం చూస్తే.. అంతంత మాత్రమే.

ఇక నటీనటుల ప్రతిభ విషయానికి వస్తే.. ఇంతకు ముందు సైఫ్ పోషించిన పాత్రలు, సినిమాలను చూస్తే జెవెల్ థీఫ్ చాలా రొటీన్, రెగ్యులర్ పాత్ర. ఏ మాత్రం ప్రేక్షకుడిని థ్రిల్ గురి చేయని పేలవమైన పాత్రలో కనిపించాడు. మూస పాత్రలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ప్రేక్షకుడిని కట్టిపడేసే డ్రామా కథలో లేకపోవడం వల్ల రెహన్ పాత్ర కూడా సాదాసీదాగా మారిపోయింది. రాజన్‌గా జైదీప్ కొన్ని సీన్లలో క్రూరంగా కనిపించాడు. కానీ ఆయన క్యారెక్టర్‌లో కూడా బలం లేకపోయింది. నికితా దత్తా లిప్ లాక్స్, రొమాంటీక్ సీన్లకే పరిమితమైంది. కుల్‌భూషణ్, ఇతర పాత్రలు పెద్దగా ఆకట్టుకొనేలా ఉండవు.

Jewel Thief Review

టెక్నికల్ విషయాలకు వస్తే.. స్టోరీ, స్క్రీన్ ప్లేలో పస లేకపోతే సాంకేతిక నిపుణులు చేయడానికి ఏమీ ఉండదు అనే విషయాన్ని జెవెల్ థీప్ మరోసారి రుజువు చేసింది. విలాసవంతమైన లోకేషన్లలో సినిమాను షూట్ చేయడంతో జిష్ను భట్టాచార్జికి విజువల్స్‌ను బాగా ప్రజెంట్ చేయడానికి వీలు కలిగింది. సచిన్ జిగర్ అందించిన పాటలు కూడా అంతగా క్యాచీగా లేవు. మిగితా విభాగాల పనితీరు కూడా అంతంత మాత్రంగానే ఉంది. కూకీ గులాటీ, రాబీ గ్రేవాల్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

జెవెల్ థీఫ్ మూవీ గురించి ఓవరాల్‌గా చెప్పాలనుకొంటే.. అవుట్ డేటేడ్ కథ, ఆకట్టుకొని స్క్రీన్ ప్లేతో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్. ఆసక్తికరమైన అంశాలు లేకుండా పేలవంగా, నిస్సారంగా సాగే సినిమా ఇది. సైఫ్ ఆలీ ఖాన్, జైదీప్, నికితా దత్తా కూడా ఈ సినిమాను కాపాడాలేకపోయారనే చెప్పాలి. థియేటర్‌లో కాకుండా ఓటీటీలోనే రిలీజైంది. సైఫ్ సినిమాలను ఇష్టపడేవారు.. ఏమీ తోచక ఏదో ఒకటి చూసేయాలనే వారు ఈ మూవీపై వీలైతే ఓసారి లుక్కేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X