twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఝాన్సీ మూవీ రివ్యూ: పవర్‌ఫుల్‌గా జ్యోతిక కమ్‌బ్యాక్!

    By Rajababu
    |

    Recommended Video

    Jhansi Movie Review ఝాన్సీ సినిమా రివ్యూ

    Rating:
    3.0/5
    Star Cast: జ్యోతిక, జీవీ ప్రకాశ్, రాక్ లైన్ వెంకటేష్, ఇవానా
    Director: బాలా

    అందం, అభినయంతో మెప్పించిన జ్యోతిక నటించిన చిత్రం ఝాన్సీ. తమిళంలో ఘన విజయం సాధించిన నాచియార్ చిత్రానికి ఇది రీమేక్. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత జ్యోతిక దక్షిణాది చిత్ర పరిశ్రమలో రీ ఎంట్రీ ఇవ్వడం, అలాగే బాలా దర్శకుడిగా మరోసారి ప్రేక్షకులకు దగ్గరకావడం అనే అంశాలు ఈ సినిమాపై ఆసక్తిని, అంచనాలను పెంచాయి. తమిళం భారీ సక్సెస్ తర్వాత తెలుగులో ఆగస్టు 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జ్యోతిక నటన ప్రేక్షకులను మెప్పించిందా? దర్శకుడు బాలా ఏ మేరకు భావోద్వేగాలను పండించాడు? ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా కథ, కథనాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    ఝాన్సీ సినిమా కథ

    ఝాన్సీ సినిమా కథ

    ఝాన్సీ నిజాయితీ, నిఖార్సైన పోలీస్ ఆఫీసర్. అన్యాయాన్ని, అవినీతిని ఎదురించే ఆఫీసర్‌కు డిపార్ట్‌పరంగా అనేక సమస్యలు ఎదురైనా వాటిని పట్టించకోకుండా దూకుడును ప్రదర్శిస్తుంటుంది. ఈ క్రమంలో అత్యాచారం జరగడంతో రాశీ (ఇవానా) అనే ఓ మైనర్ బాలిక‌ గర్భం దాల్చిన కేసు తన దృష్టికి వస్తుంది? తన ప్రియుడి (జీవీ ప్రకాశ్ కుమార్) పైనే అత్యాచారం ఆరోపణలు రావడంతో అతడిని జైల్లో పెట్టిస్తుంది? కేసు దర్యాప్తులో ప్రియుడు నిందితుడు కాదనే విషయం తెలియడంతో సినిమాలో కీలక మలుపు తిరుగుతుంది.

    కథలో మలుపులు

    కథలో మలుపులు

    ప్రియుడిపై ఎందుకు ఆరోపణలు రావడానికి ప్రధానమైన కారణం ఏమిటి? మైనర్ బాలికపై ఎవరు అత్యాచారం జరిపారు? మైనర్ బాలికకు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరు? ఈ కేసు దర్యాప్తులో ఝాన్సీకి ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకి మైనర్ బాలికకు జరిగిన అన్యాయానికి ఝాన్సీ ఎలాంటి శిక్ష విధించింది అనే ప్రశ్నలకు సమాధానమే ఝాన్సీ సినిమా కథ.

    ఫస్టాఫ్ అనాలిసిస్

    ఫస్టాఫ్ అనాలిసిస్

    ఝాన్సీ చిత్రం గతంలో వచ్చిన దర్శకుడు బాలా చిత్రాలకు భిన్నంగా తొలిభాగం సాగుతుంది. సన్నితమైన అంశాలతో కథ ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ఫ్లాట్ నడుస్తుంది. ఓ కీలకమైన అంశంతో ఇంటర్వెల్‌ కార్డు పడటంతో రెండో భాగంలో ఏం జరుగుతుందోననే ఆసక్తి కలుగుతుంది.

    సెకండాఫ్ అనాలిసిస్

    సెకండాఫ్ అనాలిసిస్

    ఇక రెండో భాగంలో ఇన్వెస్టిగేషన్ పంథాలో సాగుతుంది. దర్యాప్తులో ఝాన్సీకి ఎదురయ్యే సవాళ్లు, కథలో ఉండే చిక్కు ముడులను విప్పే ప్రయత్నంగా ముందుకెళ్తుంది. కాకపోతే కేసు దర్యాప్తుకు సంబంధించిన కీలక అంశాన్ని ప్రీ క్లైమాక్స్‌లో ఏదో హడావిడిగా ముగించడం ప్రేక్షకుడికి అంతు చిక్కని విషయంగా ఉంటుంది.

    బాలా టేకింగ్

    బాలా టేకింగ్

    సేతు, శివపుత్రుడు, వాడే వీడు లాంటి విభిన్నమైన చిత్రాలతో తనదైన మార్కును సొంతం చేసుకొన్న బాలా ఈ సారి మరో బలమైన పాయింట్‌తో ముందుకొచ్చాడు. ఝాన్సీ చిత్రంలో బలమైన పాత్రలతో కథ, కథనాలు అల్లుకొన్నాడు. కథను భావోద్వేగమైన చెప్పడంలో ఆయన మార్కు కనబరిచే ప్రయత్నం చేశాడు. సమాజంలో బాలికలపై జరుగుతున్న ఘోరాలకు సాక్ష్యంగా బాలా ఈ చిత్రాన్ని రూపొందించడం అభినందనీయం. కాకపోతే కమర్షియల్ వ్యాల్యూస్ కోసం కథను పక్కదారి పట్టించాడా అనే అనుమానం కలుగుతుంది.

    జ్యోతిక పవర్ ఫుల్ పాత్రలో

    జ్యోతిక పవర్ ఫుల్ పాత్రలో

    స్ట్రిక్ట్ అండ్ సీన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా జ్యోతిక తన దూకుడును ప్రదర్శించాడు. ఆమె నటన ప్రదర్శన సింప్లీ సూపర్బ్. కీలక సన్నివేశాల్లో ఎమోషనల్‌‌గా నటించారు. ప్రధానంగా సెకండాఫ్‌లో జ్యోతిక నటన ప్రేక్షకులను ఆకట్టుకొంటుంది. అన్యాయాన్ని ఎదురించే పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయారు.

    జీవీ ప్రకాశ్ పెర్ఫార్మెన్స్

    జీవీ ప్రకాశ్ పెర్ఫార్మెన్స్

    భావోద్వేగ బంధంలో సతమతమైన పాత్రలో జీవీ ప్రకాశ్‌ జీవించాడు. పాత్రలో ఉండే బాధ, ఆవేదనను చక్కగా తనదైన హావభావాలతో ప్రదర్శించాడు. కొన్ని సన్నివేశాల్లో జీవి ప్రకాశ్ నటన ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేసేలా ఉంటుంది. జీవీ ప్రకాశ్‌ను మంచి నటుడిగా గుర్తించేలా ఈ చిత్రం దోహదపడింది.

    ఇవానా యాక్టింగ్

    ఇవానా యాక్టింగ్

    అత్యాచారానికి గురై బాల్యంలోనే గర్భవతి అయిన పాత్రలో యువతార ఇవానా కనిపించింది. ఇవానా నటన ఈ చిత్రానికి హైలెట్‌ అని చెప్పవచ్చు. తొలి చిత్రంతోనే భావోద్వేగమైన పాత్రను పోషించి మెప్పించింది. భవిష్యత్‌లో ఇవానా మంచి నటిగా మారే అవకాశం ఉంది.

    కీలక పాత్రలో రాక్‌లైన్ వెంకటేష్

    కీలక పాత్రలో రాక్‌లైన్ వెంకటేష్

    ఝాన్సీ చిత్రంలో నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ ఓ కీలక పాత్రలో మెరిశాడు. తనలో ప్రభావవంతమైన నటుడు ఉన్నాడనే ఫీలింగ్‌‌ను రాక్‌లైన్ కల్పించాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఈ చిత్రంతో మరిన్ని మంచి అవకాశాలు చేజిక్కించుకొనే అవకాశం ఉంది.

    ఇళయరాజా సంగీతం

    ఇళయరాజా సంగీతం

    ఝాన్సీ చిత్రానికి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా అందించిన సంగీతాన్ని హైలెట్. ఈ చిత్రంలో పాటలు లేకపోయినా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఇళయరాజా సంగీతాన్ని మళ్లీ తెరపైన వినే మంచి అవకాశం ప్రేక్షకులకు కలుగుతుంది.

    సినిమాటోగ్రఫీ

    సినిమాటోగ్రఫీ

    ఝాన్సీ చిత్రానికి థేని ఈశ్వర్ సినిమాటోగ్రఫిని అందించారు. ఎమోషనల్‌గా సాగే కథకు అవసరమైన మూడ్స్‌ను పాత్రల్లో కనిపించే విధంగా లైటింగ్, ఇతర అంశాలను చక్కగా చూపించారు. సతీష్ సూర్య ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    తమిళంలోని విజయవంతమైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంగా ఝాన్సీ సినిమాను కోనేరు కల్పన, డీ అభిరాం అజయ్‌కుమార్ రూపొందించారు. కల్పనా చిత్ర, యశ్వంత్ మూవీస్ బ్యానర్‌పై వచ్చిన చక్కటిన నిర్మాణ విలువలకు ఉదాహరణగా నిలిచింది. ఈ రెండు బ్యానర్ల అభిరుచికి ఝాన్సీ చిత్రం సాక్ష్యంగా నిలిచింది. తమిళ నేటివిటిని కనిపించకుండా చూపిస్తే మరింత బాగా ఉండేది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    ఝాన్సీ చిత్రం సమాజంలో నిత్యం కనిపించే బాలికలపై అత్యాచారాలు అనే ఓ కీలక పాయింట్‌తో తెరకెక్కింది. బాలా చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. సామాజిక అంశాల కథా నేపథ్యం ఉండే చిత్రాలను ఆదరించే ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా నచ్చుతుంది. బీ, సీ, సెంటర్ల ప్రేక్షకులకు చేరగలిగితే మంచి విజయం అందుకొనే అవకాశం ఉంది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్
    జ్యోతిక, జీవీ ప్రకాశ్ నటన
    కథ, కథనాలు
    ఇళయరాజా మ్యూజిక్

    మైనస్ పాయింట్స్
    బాలా టేకింగ్‌కు దూరంగా ఉండటం
    తమిళ వాసన ఎక్కువగా కనిపించడం

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    నటీనటులు: జ్యోతిక, జీవీ ప్రకాశ్, రాక్ లైన్ వెంకటేష్, ఇవానా తదితరులు
    రచన, దర్వకత్వం: బాలా
    మ్యూజిక్: ఇళయరాజా
    సినిమాటోగ్రఫీ: థేనీ ఈశ్వర్
    ఎడిటింగ్: సతీష్ సూర్య
    నిర్మాతలు: కోనేరు కల్పన, డీ అభిరాం అజయ్‌కుమార్
    బ్యానర్: కల్పనా చిత్ర, యశ్వంత్ మూవీస్ బ్యానర్‌
    రిలీజ్: 2018-08-17

    English summary
    After long gap, Surya's wife Jyothika re entry into tollywood. She is coming with Jhansi, which remake of Nachiyar Tamil movie. This movie released on 17th August. In this occassion, Telugu filmibeat brings exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X