Jhund Movie Review అమితాబ్ ఆస్కార్ రేంజ్ ఫెర్ఫార్మెన్స్.. వెండితెరపై మరో స్లమ్ డాగ్!

Rating:
3.5/5
Star Cast: అమితాబ్ బచ్చన్, ఆకాష్ తోసర్, రింకూ రాజ్‌‌గురు
Director: నాగరాజ మంజులే

భారతీయ సినిమా రంగంలో భావోద్వేగమైన స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంగా ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురిచేశాయి. అయితే ప్రతీ సినిమా ఎదో కొత్త కోణంలో ఎమోషనల్ అంశాలను ఆవిష్కరించాయి. చక్ దే ఇండియా, భాగ్ మిల్కా భాగ్ లాంటి సినిమాలు అద్భుతంగా ప్రేక్షకులను మెప్పించాయి. అయితే అలాంటి కోణంలోనే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం Jhund (జుండ్). అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు సైరాత్ అనే మరాఠీ సినిమా నిర్మించి దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించిన నాగరాజ్ ముంజలే దర్శకుడిగా వ్యవహరించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకుడికి ఎలాంటి అనుభూతిని పంచే అంశాలున్నాయనే విషయంలోకి వెళితే..

జుండ్ సినిమా కథ..

జుండ్ సినిమా కథ..

నాగ్‌పూర్‌లోని మురికివాడ (జోపడ్‌పట్టి)లో పేదరికంలో మగ్గుతున్న పిల్లలు చైన్ స్నాచింగ్, బొగ్గు, గంజాయి లాంటి అక్రమ వ్యాపారాలకు పాల్పడుతుంటారు. అదే ప్రాంతంలో నివసించే విజయ్ బార్సే (అమితాబ్) వారిలోని ఫుట్‌బాల్ ప్రతిభను గుర్తించి వారికి శిక్షణ ఇస్తాడు. ఆ ప్రాంతంలో ఉండే సంపన్న వర్గాల పిల్లలు చదివే కాలేజ్‌లో ఆడే ఫుట్‌బాల్ టీమ్‌తో స్లమ్స్‌లో ఉండే పిల్లల టీమ్‌తో పోటీ పెడుతాడు. ఆ పోటీలో విజయం సాధించిన జట్టుకు ఇంటర్నేషన్ హెమ్‌లెస్ (మురికి వాడల్లో నివసించే) సాకర్ టీమ్‌ పోటీల్లో పాల్గొనే అవకాశం వస్తుంది. అయితే నేర చరిత్ర ఉన్న బాలలు, చదువు సంధ్యలేని పిల్లలు కావడంతో పాస్‌పోర్టు ఇవ్వడానికి పోలీసులు, అధికారులు నిరాకరిస్తారు.

 జుండ్ మూవీలో ట్విస్టులు

జుండ్ మూవీలో ట్విస్టులు


నాగ్‌పూర్ మురికి వాడల్లోని బాలల పరిస్థితి ఏమిటి? వారిని ఏ పరిస్థితుల్లో విజయ్ బార్సే చేరదీయాలనే తపన కలిగింది? మురికి వాడల పిల్లల్ని పుట్‌బాల్ ఆటగాళ్లుగా ఎందుకు తీర్చిదిద్దాలనే కోరిక కలిగింది? ఆటగాళ్లుగా తయారు చేయడానికి ఎలాంటి సమస్యలను విజయ్ బర్సాలే ఎదుర్కొన్నాడు. మురికివాడల పిల్లల కోసం ఎలాంటి త్యాగాలకు సిద్దపడ్డాడు? చివరకు ఎలాంటి పరిస్థితులను అధిగమించి పిల్లలు ఇంటర్నేషనల్ హెమ్ సాకర్ టోర్నమెంట్‌లో అడుగుపెట్టారు? అనే ప్రశ్నలకు సమాధానమే జుండ్ సినిమా కథ.

దర్శకుడు నాగరాజ్ మంజులే గురించి

దర్శకుడు నాగరాజ్ మంజులే గురించి


సైరాత్‌తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన నాగరాజ్ మంజులే జుండ్ సినిమా కోసం ఎంచుకొన్న పాయింట్ రెగ్యులర్ అనిపించినప్పటికీ.. ఆ పాయింట్ చుట్టిన కథ, కథనాలు, భావోద్వేగాలు తెర మీద గొప్పగా ఉంటాయి. మురికివాడల్లో ఉండే పిల్లల జీవన స్థితిగతులు, మురికి వాడల్లో ఉండే కుటుంబాల పరిస్థితులను అత్యంత సహజసిద్ధంగా నాగరాజ్ తెరకెక్కించారు. ఇక ఈ కథకు కావాల్సిన ముడిసరుకుగా పిల్లల్ని ఎంచుకొన్న తీరు.. వారి నుంచి ప్రతిభను రాబట్టుకొన్న విధానం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మురికి వాడల పిల్లల మనస్తత్వాలను, అలాగే వారి యాటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్‌ను తెరమీద ఆవిష్కరించిన విధానం ఈ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లుందనే భావన కలుగుతుంది.

 అమితాబ్ మరోసారి నట శిఖరంగా

అమితాబ్ మరోసారి నట శిఖరంగా


జుండ్ సినిమాకు అమితాబ్ బచ్చన్ పాత్ర ప్రాణం అనే మాట చిన్నమాటగా అనిపిస్తుంది. భారతీయ నటన రంగంలో శిఖరమైన అమితాబ్ ఈ చిత్రంలో పోషించిన విజయ్ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. స్పోర్ట్స్ అధికారుల ముందు, అలాగే పోలీస్ స్టేషన్‌లో, కోర్టులో అమితాబ్ ప్రదర్శించిన నటన అమోఘంగా ఉంటుంది. పలు సన్నివేశాల్లో అమితాబ్ తాను కనిపించకుండా విజయ్ మాత్రమే కనిపించే విధంగా నటనపరంగా జాగ్రత్తలు తీసుకొన్నారు. బిగ్‌ బీ సరికొత్త నటనా విశ్వరూపాన్ని చూడాలంటే జుండ్ సినిమాను తప్పకుండా చూడాల్సిందే.

మిగితా పాత్రల్లో నటీనటులు ఫెర్ఫార్మెన్స్

మిగితా పాత్రల్లో నటీనటులు ఫెర్ఫార్మెన్స్

సైరాత్ చిత్రంలో నటించిన ఆకాష్ తోసర్, రింకూ రాజ్‌‌గురు మరోసారి ఉత్తమ నటనను ప్రదర్శించాడు. రింకూ పేదరికంలో ముగ్గుతున్న అమ్మాయిగా.. ఆకాశ్ సంపన్న వర్గానికి చెందిన యువకుడిగా నెగిటివ్ పాత్రలో కనిపించి మెప్పించాడు. ఇక డాన్ పాత్ర పోషించిన యువకుడు ఈ సినిమాకు వెన్నముకగా నిలిచాడు. ఇతర పాత్రల్లోని యువతీ, యువకులు తమ పాత్రలకు ప్రాణం పోయడమే కాకుండా అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్‌ను చూపించారు.

జుండ్ హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో

జుండ్ హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో


సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. జుండ్ సినిమాకు సినిమాటోగ్రఫి అందించిన సుధాకర్ రెడ్డి ఎక్కంటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్లమ్ ఏరియాను కెమెరాలో బంధించడం ఒక ఎత్తైతే.. ఫుట్ బాల్ క్రీడను చిత్రీకరించిన విధానం అద్భుతంగా ఉంటుంది. ఇక టాప్ యాంగిల్ షాట్స్, యాక్షన్ సీన్లు, ఎమోషనల్ సీన్లను అత్యంత సహజసిద్దంగా చూపించారు. ఇక కొన్ని సీన్లలో లైటింగ్ వాడుకొన్న తీరు హై రేంజ్‌లో ఉంటాయి. సాకేత్ కనెత్కర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అజయ్, అతుల్ పాటలు ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌గా మారాయి. ఇలాంటి హై ఎమోషనల్ కంటెంట్‌ను తెర మీదకు తీసుకురావాలనే ప్రయత్నం చేసిన టీ సీరిస్‌ను అభినందించకుండా ఉండలేం.

ఫైనల్‌గా ఎలా ఉందంటే

ఫైనల్‌గా ఎలా ఉందంటే


మురికి వాడల నేపథ్యంగా సలాం బాంబే, స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రాలు ప్రేక్షకుల మనసులను దోచుకోవడమే కాకుండా అవార్డులు కూడా తెచ్చిపెట్టాయి. అయితే క్రిటిక్స్ ప్రశంసలు, ప్రేక్షకుల మెప్పు, అవార్డులు పొందే అన్ని అర్హతలు జుండ్ సినిమాకు ఉన్నాయి. ప్రతీ ఫ్రేమ్ కొత్త అనుభూతిని పంచుతుంది. సినిమా హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కథ, కథనాలు, నటీనటులు ఫెర్ఫార్మెన్స్ వెంటాడుతుంటాయి. ఇటీవల కాలంలో వచ్చిన అద్భుతమైన స్పోర్ట్స్ డ్రామా అంటే అతిశయోక్తి కాదు. మూడు గంటలపాటు ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేసే సినిమాగా చెప్పుకోవచ్చు. పేదరికం, మురికి వాడల్లో పుట్టడం పిల్లలకు శాపం కాదు అనే సందేశాన్ని చెప్పడమే కాకుండా ఓ చర్చకు దారి తీసే విధంగా ఉంటుంది. స్లమ్ డాగ్ మిలియనీర్ మాదిరిగా జుండ్ ఓ గొప్ప అనుభూతిని కలిగించే చిత్రంగా చెప్పుకోవచ్చు.

 నటీనటులు, సాంకేతిక నిపుణులు

నటీనటులు, సాంకేతిక నిపుణులు


నటీనటులు: అమితాబ్ బచ్చన్, ఆకాష్ తోసర్, రింకూ రాజ్‌‌గురు, వికి కడియన్ తదితరులు
రచన, దర్శకత్వం: నాగరాజ మంజులే
నిర్మాత: భూషణ్ కుమార్, కిషన్ కుమార్, రాజ్ హైర్‌మత్, నాగరాజ్ మంజులే, గార్గీ కులకర్ణి, మీను అరోరా
సినిమాటోగ్రఫి: సుధాకర్ రెడ్డి ఎక్కంటి
ఎడిటింగ్: కుతబ్ ఇనామ్‌దార్, వైభవ్ దభాడే
మ్యూజిక్: సాకేత్ కనెత్కర్ (బ్యాక్ గ్రౌండ్ స్కోర్), అజయ్, అతుల్ (పాటలు)
ప్రొడక్షన్: టీ సిరీస్, తాండవ్ ఫిల్మ్స్, ఆట్‌పాట్ ఫిల్మ్స్
రిలీజ్ డేట్: 2022-03-04

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X