Jigarthanda DoubleX Review కథ, క్లైమాక్స్ బాగుంది.. అక్కడే దెబ్బ పడింది.. జిగర్తాండ డబుల్ ఎక్స్ రివ్యూ
నటీనటులు: రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య, షైన్ టామ్ చాకో, నిమిషా సజయన్, నవీన్ చంద్ర, సత్యన్, అరవింద్ ఆకాశ్, ఇలవరసు, భవ చెల్లాదురై తదితరులు
కథ, దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజు
నిర్మాత: కార్తీకేయన్ సంతానం, ఎస్ కథిరేశన్, అలంకార్ పాండ్యన్
ఎడిటింగ్: షఫీక్ మహ్మద్ ఆలీ
మ్యూజిక్: సంతోష్ నారాయణన్
బ్యానర్: స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ఫైవ్ స్టార్ క్రియేషన్స్, ఇన్‌వెనీయో ఆరిజిన్
రిలీజ్ డేట్: 2023-11-10
ఆదివాసీ తెగకు చెందిన అలియాస్ సీజర్ (రాఘవ లారెన్స్) నేరాలకు పాల్పడుతుంటాడు. హాలీవుడ్ హీరో క్లింట్ ఈస్ట్ ఉడ్ స్పూర్తితో సినిమా హీరోగా కావాలని కలలు కంటుంటాడు. ఎస్ఐ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన రే డాసన్ (ఎస్‌జే సూర్య) ఓ క్రిమినల్ కేసులో ఇరుక్కొంటాడు. ఈ క్రమంలో హీరోగా రాణించాలని కోరుకొంటున్న సీజర్‌కు డైరెక్టర్‌గా కథ చెప్పడానికి డాసన్ వస్తాడు. సీజర్ జీవితాన్ని తెరకెక్కించాలని ప్రయత్నం చేస్తాడు.

ఆదివాసి తెగకు చెందిన సీజర్ హీరోగా ఎందుకు కావాలనుకొంటాడు? ఆస్కార్ స్థాయిలో బయోపిక్ తీస్తానని సీజర్‌ను రే డాసన్ ఎందుకు మభ్య పెడుతాడు. ఆదివాసీ ప్రాంతంలో పోలీస్ అధికారి (నవీన్ చంద్ర) అకృత్యాలు ఎలా సాగాయి? బయోపిక్ తీస్తానని చెప్పిన డాసన్ ఆ తర్వాత తన మనసు ఎందుకు మార్చుకొంటాడు? అటవీ జీవితాన్ని వదిలి నగరానికి వచ్చిన సీజర్ మళ్లీ తన ప్రాంతంలోని తన గ్రామస్థులకు ఎందుకు అండగా నిలవాలని అనుకొంటాడు? ఆదివాసీల కోసం ప్రాణాలకు తెగించి ప్రభుత్వ అధికారులతో ఎందుకు పోరాటం చేయాలనుకొంటాడు? చివరకు సీజర్ బయోపిక్‌ను దర్శకుడిగా డాసన్ తెరకెక్కించాడా? ఎస్ఐ ఉద్యోగంలో డాసన్ చేరారా? ఆదివాసీల పోరాటానికి ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే జిగర్తాండ డబుల్X సినిమా కథ.
జిగర్తాండ డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX) సినిమా కథగా చూస్తే.. బలమైన, ఎమోషనల్ పాయింట్స్ కనిపిస్తాయి కానీ సినిమా కోసం ఎంచుకొన్న స్క్రీన్ ప్లే గానీ.. ఎంచుకొన్న సన్నివేశాలు గానీ అంతగా ఆకట్టుకోవు. ఫస్టాఫ్ సినిమా చాలా నీరసంగా, బలమైన కంటెంట్ లేకుండా సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇక సినిమాలో ప్రతీ విషయాన్ని అరటి పండు ఒలిచిపెట్టడం వల్ల, డీటైలిటీ ఎక్కువగా కావడంతో నిడివి బాగా పెరిగిపోయిందనే ఫీలింగ్ అనిపిస్తుంది.

జిగర్తాండ డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX) ఫస్టాఫ్ పెట్టిన సహనానికి పెట్టిన పరీక్ష నుంచి తెరుకోవడానికి సెకండాఫ్‌లో కాస్త టైమ్ ఎక్కువగానే తీసుకొన్నది. ఫస్టాఫ్‌ను చాలా పేలవంగా చూపించిన.. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు సెకండాఫ్‌లో విజృంభించాడు. సినిమా చివరి 30 నిమిషాలు తనదైన శైలిలో ఎమోషన్స్, సీరియస్ కంటెంట్‌ను జొప్పించి అదరగొట్టాడు. కానీ అప్పటికే ప్రేక్షకులు నీరసపడిపోవడం వల్ల ప్రయోజనం లేకపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది.
నటీనటుల ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. లారెన్స్ రాఘవ భారమైన, భావోద్వేగమైన పాత్రలో అద్బుతంగా నటించాడు. చాలా సీన్లలో లారెన్స్ రాఘవ కంటే సీజర్‌గానే మెప్పించాడు. చివరి 30 నిమిషాల్లో తన కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పవచ్చు. ఇక కథకు బలంగా నిలిచిన పాత్రలో ఎస్‌జే సూర్య కనిపించాడు. క్లైమాక్స్‌లో తన క్యారెక్టర్‌తో లీడ్ తీసుకోవడం సినిమాకు బలంగా మారింది. ఇక నవీన్ చంద్ర సర్‌ప్రైజింగ్ క్యారెక్టర్‌తో ఆకట్టుకొన్నాడు. సరికొత్త విలనిజం, బాడీ లాంగ్వేజ్‌తో మెప్పించాడు. ఇతర పాత్రల్లో నటించిన వారు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

జిగర్తాండ డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX) సినిమాలో సాంకేతిక అంశాల విషయానికి వస్తే..ముఖ్యంగా ఆకట్టుకొనే అంశాల్లో ఆర్ట్, మేకప్ విభాగాలు ముందున్నాయి. అందమైన లొకేషన్లు, ఆదివాసీల వాతావరణాన్ని తెరపైన చక్కగా ప్రతిబింబిచేలా చేశారు. ఆ తర్వాత సినిమాటోగ్రఫి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఫ్లై కామ్ షాట్స్, క్లైమాక్స్‌లో సీన్లను చిత్రీకరించిన విధానం బాగుంది. ఎడిటింగ్ ఈ సినిమాకు మైనస్. కొన్ని అనవసరమైన సీన్లపై కత్తెర వేసి ఉంటే..సినిమా మరింత ఫీల్ పెరిగి ఉండేదనిపిస్తుంది.నిర్మాణ విలువలు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి.
జిగర్తాండ డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX) సినిమా విషయానికి వస్తే.. సమాజాన్ని, ఫ్రభుత్వ అధికారులు, నేతల అరాచకాలపై ఆలోచింపజేసే చిత్రంగా రూపొందింది. కమర్షియల్ అంశాలతోపాటు తనకంటూ ఓ సామాజిక బాధ్యతగా సినిమాను తెరకెక్కించిన తీరుకు కార్తీక్ సుబ్బరాజును అభినందించాలి.ఈ సినిమాకు నిడివి చాలా మైనస్. ఫస్టాఫ్ పేలవంగా, సెకండాఫ్‌లో భావోద్వేగంగా ఉంటుంది. మూడు గంటలపాటు దేనినైనా భరించే ఓపిక ఉంటే థియేటర్‌కు వెళ్లి సినిమా చూడండి.. లేకపోతే.. ఓటీటీలో వచ్చే వరకు ఆగండి..


Click it and Unblock the Notifications











