John Wick: Chapter 4 Review కీన్ రీవ్స్ హై రేంజ్ యాక్షన్ డ్రామా.. ఊపిరి బిగబట్టి చూసేలా ఫైట్స్!

Rating:
3.5/5
Star Cast: కీన్ రీవ్స్, డోని యెన్, బిల్ స్కార్స్‌గార్డ్, లారెన్స్ ఫిష్‌బర్న్, రినా సవయామా
Director: చాద్ స్టాహెల్కీ

నటీనటులు: కీన్ రీవ్స్, డోని యెన్, బిల్ స్కార్స్‌గార్డ్, లారెన్స్ ఫిష్‌బర్న్, రినా సవయామా, స్కాట్ ఆడ్కిన్స్ తదితరులు
దర్శకత్వం: చాద్ స్టాహెల్కీ
నిర్మాతలు: బాసిల్ ఇవానిక్, ఎరికా లీ, చాద్ స్టాహెల్కీ
సినిమాటోగ్రఫి: డాన్ లాస్టెసెన్
ఎడిటింగ్: నాథన్ ఓరిఆఫ్
మ్యూజిక్: టైలెర్ బేట్స్, జోయల్ జే రిచర్డ్
బ్యానర్: సమ్మిట్ ఎంటర్‌టైన్‌మెంట్, థండర్ రోడ్ ఫిల్మ్స్
రిలీజ్ డేట్: 2023-03-24

జాన్ విక్ 4 కథ ఏమిటంటే?

జాన్ విక్ 4 కథ ఏమిటంటే?

మాఫియా సామ్రాజ్యాన్ని నడిపించే హై టేబుల్‌పై జర్దానీ అలియాస్ జోనాథన్ అలియాస్ జాన్ విక్ (కీన్ రివ్స్) అజాతంలో ఉండి ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూస్తుంటాడు. న్యూయార్క్‌ కాంటినెంటల్ హోటల్‌లో విధ్వసం తర్వాత జాన్ విక్‌ను చంపాలని ఆ హోటల్ మేనేజన్ విన్‌స్టంట్ స్కాట్ పక్కా ప్లాన్ వేసి మార్క్విస్ విన్సెంట్ డి గ్రామంట్ (బిల్ స్కార్స్‌గార్డ్)తో ఒప్పందం కుదుర్చుకొంటాడు.

జాన్ విక్ 4 ట్విస్టులు

జాన్ విక్ 4 ట్విస్టులు

జాన్ విక్‌ను చంపడానికి మార్క్విస్ విన్సెంట్ డి గ్రామంట్ ఎలాంటి ప్లాన్స్ వేశాడు? 40 మిలియన్ల డాలర్ల కాంట్రాక్టు కుదిరిన తర్వాత జాన్ విక్‌ను నిలువరించడానికి మార్క్విస్ విన్సెంట్ డి గ్రామంట్ ఏం చేశాడు. పారిస్‌లో కైనే (డానీ యెన్), జాన్ విక్ మధ్య మార్క్విస్ విన్సెంట్ డి గ్రామంట్‌ ఎలాంటి డ్రామాను క్రియేట్ చేశాడు? మార్క్విస్ ప్లాన్స్‌ను జాన్ విక్ ఎలా ఎదుర్కొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే జాన్ విక్ 4 సినిమా కథ.

జాన్ విక్ 4 మూవీ విశ్లేషణ

జాన్ విక్ 4 మూవీ విశ్లేషణ

న్యూయార్క్‌ కాంటినెంటల్ హోటల్‌లో జాన్ విక్ (కీన్ రివ్స్) ఎంట్రీతోపాటు.. హై టేబుల్ మాఫియాతో జరిగే యాక్షన్ ఎపిసోడ్‌తో కథ ఇంటెన్సివ్‌గా సాగుతుంది. అంధుడైన కైనే (డానీ యెన్) పాత్ర ప్రవేశించిన తర్వాత కథలో కొంత వినోదంపాటు ఎమోషనల్ అంశాలు కూడా తోడవుతాయి. కైనే కూతురును చంపుతామని బెదిరింపులు, కైనే పెంపుడు కుక్క చేసే విన్యాసాలు సినిమాలో హైలెట్ సన్నివేశాలుగా ఉంటాయి. జాన్ విక్‌ను వెంటాడే మిస్టర్ నోబడీ (షామీయర్ అండర్సన్) పార్ట్ కూడా ఆసక్తికరంగా సాగుతుంది. మార్క్విస్ విన్సెంట్ డి గ్రామంట్ సాఫ్ట్ విలనిజం.. సినిమాకు మరింత ఎట్రాక్షన్‌గా మారింది.

జాన్ విక్ 4 యాక్షన్ ఎలా సాగిందంటే?

జాన్ విక్ 4 యాక్షన్ ఎలా సాగిందంటే?

జాన్ విక్ 4 సినిమా విషయానికి వస్తే.. కథ, కథనాల కంటే..ఎక్కువగా యాక్షన్‌కు పెద్ద పీట వేశారు. సుదీర్ఘంగా సాగే యాక్షన్ ఎపిసోడ్స్‌ తెర మీద అద్భుతంగా సాగుతాయి. ప్రతీ ఫైట్ విజువల్ ట్రీట్‌లా డిజైన్ చేశారనే చెప్పాలి. ఒక్కో యాక్షన్ ఎపిసోడ్ కనీసం 10 నుంచి 15 నిమిషాలు ఉంటే.. చివరి 40 నిమిషాలు ఏకధాటిగా సాగే యాక్షన్ సీక్వెన్స్ కొన్నిసార్లు ఒళ్లు జలదరించేలా చేయడమే కాకుండా థ్రిల్లింగ్‌గా సాగుతుంది.

పారిస్ ఎపిసోడ్ అంతా ప్రేక్షకుడిని సీట్లకు హత్తుకుపోయేలా చేస్తుంది. కార్ల ఫైటింగ్, అలాగే మెట్ల మీద యాక్షన్ సీన్లు హై రేంజ్‌లో ఉంటాయి. క్లైమాక్స్ సీన్‌లో కీన్ రివ్స్ ఫెర్ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకొంటుంది.

కీన్ రీవ్స్ వన్ మ్యాన్ షో

కీన్ రీవ్స్ వన్ మ్యాన్ షో

నటీనటులు విషయానికి వస్తే.. కీన్ రీవ్స్ ఫెర్ఫార్మెన్స్ వన్ మ్యాన్ షో మాదిరిగానే ఉంటుంది. ప్రతీ సన్నివేశంలోను, అలాగే యాక్షన్ ఎపిసోడ్‌లోను కీన్ రీవ్స్ మూమెంట్స్, బాడీ లాంగ్వేజ్, ముఖంలో ఫైర్ ప్రేక్షకుడిని ఆకట్టుకొంటాయి. అలాగే డానీ యెన్, బిల్ స్కార్స్‌గార్డ్, షామీయర్ అండర్సన్ ఫెర్ఫార్మెన్స్ బ్రహ్మండంగా ఉంది. డానీ యెన్ అంధుడిగా నటించిన తీరు బాగుంది.

టెక్నికల్‌గా ఎలా ఉందంటే?

టెక్నికల్‌గా ఎలా ఉందంటే?

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. డాన్ లాస్టెసెన్ సినిమాటోగ్రఫి జాన్ విక్ 4కు స్పెషల్ ఎట్రాక్షన్. పారిస్ ఎపిసోడ్స్, పారిస్‌లో కార్లతో యాక్షన్ ఎపిసోడ్, హోటల్‌లో ఫైట్స్ చక్కగా చిత్రీకరించారు. టైలర్ బేట్స్, జోయల్ జే రిచర్డ్ అందించిన మ్యూజిక్ నెక్ట్స్ లెవెల్. యాక్షన్ ఎపిసోడ్స్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కేకపెట్టిస్తుంది. నిర్మాణ విలువలు హై రెంజ్‌లో ఉన్నాయి.

జాన్ విక్ 4 ఫైనల్‌గా ఎలా ఉందంటే?

జాన్ విక్ 4 ఫైనల్‌గా ఎలా ఉందంటే?

జాన్ విక్ 4 సినిమా విషయానికి వస్తే.. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఎమోషన్స్ కంటెంట్ ఉన్న మూవీ అని చెప్పవచ్చు. కీన్ రీవ్స్ పెర్ఫార్మెన్స్, ఇతర నటీనటుల యాక్టింగ్, సాంకేతిక నిపుణుల ప్రతిభ ఈ సినిమాను మరో రేంజ్‌లో నిలబెట్టాయని చెప్పవచ్చు. తెలుగు సినిమా ప్రేక్షకులు లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే.. థియేట్రికల్ విజువల్ ఎక్స్‌పీరియెన్స్‌లా ఉండటమే కాకుండా మంచి యాక్షన్ అనుభూతిని కలిగిస్తుంది. జాన్ విక్ సిరీస్‌లో బెస్ట్ అని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X